Divya vs Rithu in Bigg Boss (Image Source: YT)
ఎంటర్‌టైన్మెంట్

Bigg Boss Telugu 9: కింగ్, క్వీన్స్.. నన్ను తొక్కి నువ్వు లేవకు.. దివ్యపై రీతూ ఫైర్!

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 66వ రోజు (Bigg Boss Telugu 9 Day 66) ఆసక్తికర టాస్క్ నడుస్తోంది. ఒక రాజు, ఇద్దరు రాణులు, నలుగురు కమాండర్స్, నలుగురు ప్రజలు కాన్సెప్ట్‌తో నడుస్తున్న టాస్క్‌లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రజలు కమాండర్స్ కావడానికి, కమాండర్స్‌గా ఉన్న వాళ్లు.. ఆ పదవిని కాపాడుకునేందుకు ప్రజలతో పోటీ పడుతున్నారు. ఈ టాస్క్‌లతో ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్నాడు బిగ్ బాస్. మరీ ముఖ్యంగా రాణులు విధించే శిక్షలు చాలా కామెడీగా ఉంటూ నవ్వు తెప్పిస్తున్నాయి. ఇక ఈ టాస్క్‌లలో రాణులు, రాజు పదవి పొందిన వారు అది శాశ్వతం అనుకున్నారు. కానీ వాళ్లకి కూడా షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. ఆ విషయం తాజాగా వచ్చిన ప్రోమో చూస్తుంటే అర్థమవుతుంది. అసలు ఈ ప్రోమోలో ఏముందంటే..

Also Read- Prakash Raj: ‘తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే’.. ప్రకాష్ రాజ్ కీలక వ్యాఖ్యలు

అంత ఛాన్స్ ఇచ్చినా గెలవలేదు

‘రాజు, రాణులు.. వారి స్థానం పదిలం కాదని, నేను ముందే చెప్పాను. ఇప్పుడు మిమ్మల్ని ఓడించి, మీ స్థానాన్ని చేజిక్కించుకోవడానికి కమాండర్స్ సిద్ధంగా ఉన్నారు. ఇందులో భాగంగా.. మొదటిగా ఏ ఒక్కరు తమ స్థానాన్ని రిస్క్‌లో పెట్టి.. కమాండర్‌తో పోటీ పడాలో పేరు చెప్పండి’ అని రాజు, రాణులకు బిగ్ బాస్ సూచించారు. ‘బెటర్ ఛాన్సెస్ ఎక్కువ వస్తున్నాయ్.. నార్మల్‌గా లాస్ట్ వీక్..’ అని కళ్యాణ్ అంటుంటే.. ‘ఎవరూ నాకు ఛాన్సులు ఇవ్వడం లేదు. నాకు నేను కల్పించుకుంటున్నాను. తనకి (రీతూ) అంత ఛాన్స్ ఇచ్చినా తను గెలవలేకపోయింది’ అని దివ్య అంటే.. ‘నువ్వు నీ గురించి ఫైట్ చేసుకో.. పక్కన వాళ్లని తక్కువ చేసి ఫైట్ చేయకు.. నన్ను తొక్కి నువ్వు లేవకు’ అని రీతూ ఫైరయింది. ఈ వాగ్వివాదం తర్వాత ‘నిన్ను పంపించడమే కరెక్ట్’ అని కళ్యాణ్ (Kalyan) డిక్లేర్ చేశాడు.

Also Read- Kajol: పెళ్లికి ఎక్స్‌పైరీ డేట్, రెన్యువల్ ఆప్షన్ ఉండాలి.. బాలీవుడ్ నటి కాజోల్ షాకింగ్ కామెంట్స్

ఎయిమ్ ఫర్ క్రౌన్

‘ఇప్పుడు కమాండర్స్.. ఏ ఇద్దరు తమ స్థానాన్ని మెరుగుపరుచుకుని రాజు, రాణి అవ్వాలన్నది మీలో మీరు చర్చించుకుని చెప్పండి’ అని బిగ్ బాస్ సూచించగా.. ‘నేను ఈ రోజు ఆడాలని అనుకుంటున్నాను’ అని డిమోన్ పవన్, తనూజ అంటున్నారు. నిఖిల్, సంజన కూడా సేమ్ మేము కూడా ఆడాలని అనుకుంటున్నామని చెప్పేశారు. దీంతో సంజన మాట్లాడుతూ.. ‘ఒక పని చేద్దాం.. చిట్స్ ఉన్నాయ్.. చిట్స్ వేసేద్దాం’ అనే సలహా ఇచ్చింది. ఆమె సలహాకు అందరూ ఓకే అన్నారు. చీటీలలో నిఖిల్, డిమోన్‌ల పేరు వచ్చినట్లుగా తెలుస్తుంది. మనిద్దరం ఆడుతున్నామని ఇద్దరూ బయటకు వెళుతున్నారు. ‘‘రాణి తన స్థానాన్ని పదిలంగా ఉంచుకోవడానికి, అలాగే కమాండర్స్ కొత్త రాజు అవడానికి పెడుతున్న పోటి.. ‘ఎయిమ్ ఫర్ క్రౌన్’ (Aim For Crown). తమ స్టాండ్స్‌లో బోల్ట్స్‌కి ఉన్న నట్స్‌ని రీమూవ్ చేసి పారెల్స్ తీసుకుని, దారిలో వచ్చే ఫ్రేమ్స్ నుంచి వాటిని అవతలకు విసిరి, ఎండ్ పాయింట్‌లో ఉన్న ప్లాట్‌ఫామ్‌పై పెట్టాలి. మీకు కేటాయించిన బాల్స్‌ను పారెల్స్ వైపు విసిరి అవి కింద పడేలా చేయాలి’’ అని బిగ్ బాస్ సూచిస్తున్నారు. ఇందులో దివ్య (Divya) గెలిచినట్లుగా ప్రోమో హింట్ ఇస్తుంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

SSMB29: ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ వచ్చేసింది.. ఆమె పాత్ర పేరేంటో తెలుసా?

Agricultural Market: వ్యవసాయ మార్కెట్‌లో పిచ్చి మొక్కలు.. రైతుల వోడ్లకు స్థలమే లేక ఇబ్బందులు

Kaantha Controversy: ‘కాంత’.. ఎవరి తాత, నాన్నల కథ కాదు.. కాంట్రవర్సీపై రానా, దుల్కర్ క్లారిటీ!

Huzurabad: కాలేజీ ఒకచోట, పరీక్షలు ఇంకోచోట.. వాగ్దేవి కళాశాల యాజమాన్యం తీరుపై విద్యార్థుల అయోమయం!

Kunamneni Sambasiva Rao: సిపిఐ శతాబ్ది ఉత్సవాలు వంద సంవత్సరాలు గుర్తుండేలా నిర్వహించాలి : ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు