Srikanth Bharath: తెలుగు సినిమాల్లో నటుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ భరత్ (శ్రీకాంత్ అయ్యంగార్) ఎప్పడూ కాంట్రవర్సీలకు కేరాఫ్ లడ్రస్ గా ఉంటారు. తాజాగా ఆయన మహాత్మా గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. దీనిని చూసిన నెటిజన్లు శ్రీ కాంత్ పై చర్యలు తీసుకోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా శ్రీ కాంత్ మహాత్మా గాంధీ గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ తమదైన శైలిలో శ్రీ కాంత్ అయ్యంగార్ పై విరుచుకు పడ్డారు. దీనిని చూసిన శ్రీకాంత్ అయ్యంగార్ కామెంట్లుకు సమాధానం ఇస్తూ.. మరోసారి నెటిజన్లపై ఫైర్ అయ్యారు. మరో వీడియోలో శ్రీ కాంత్ మాట్లాడుతూ.. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా చేసిన వ్యాఖ్యల కింద కామెట్లు నేను చదివాను. వాటిని నేను పట్టించుకోను. అంటూ మెదలు పెట్టి వాటిపై సమాధానం ఇస్తూ నెటిజన్లపై ఫైర్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Read also-Lik movie postponed: రిలీజ్ వాయిదా పడిన ప్రదీప్ రంగనాధన్ సినిమా.. ఎందుకంటే?
గాంధీ ‘మహాత్ముడు కాదు, జాతిపిత కాదు’ అని, ఆయన ఎంతోమందిని లైంగికంగా వేధించారని, స్వాతంత్ర్యం అనేది గాంధీ ఒక్కడే తీసుకురాలేదు. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వంటి ఎందరో మహానుభావులు ప్రాణాలు విడిస్తే వచ్చిందంటూ చెప్పుకొచ్చారు. నెటిజన్లపై.. “మీకేం తెలుసురా? గాంధీ ఎంతోమందిని లైంగికంగా వేధించాడు. వాడు మహాత్ముడా?” “ఆత్ముడు. స్వాతంత్ర్యం ఆయన తీసుకొచ్చింది కాదు. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వంటి వారు ప్రాణాలకు తెగించి తీసుకొచ్చారు. వాళ్లు పరమాత్ములు.” “గాంధీ జాతిపిత కాదు. అంటూ కామెంట్లు చూసిన వారిపై విరుచుకు పడ్డారు. ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా, నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. చాలామంది దీన్ని ‘అనుచితమైనది, అసభ్యమైనది’ అని ఖండించారు. కొందరు పోలీసులను ట్యాగ్ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.
Read also-MLA Kaushik Reddy: నా గెలుపు కోసం మీరు కష్టపడ్డారు.. మీ కోసం నేను కష్టపడతాను: కౌషిక్ రెడ్డి
ఇంతకు ముందు కూడా శ్రీకాంత్ అయ్యాంగార్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి వివాదాల్లో చిక్కుకున్నారు. అక్టోబర్ 2024లో ‘పొట్టేల్’ సినిమా సక్సెస్ మీట్‌లో శ్రీకాంత్ రివ్యూయర్లపై తీవ్రంగా విమర్శించారు. ‘రివ్యూయర్లు పరాన్నచరులు (parasites), దారిద్ర్యంలో జన్మించినవారు’ అని అసభ్య భాష ఉపయోగించారు. ఈ వ్యాఖ్యలు తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్‌ను కోపం తెప్పించింది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణుకు ఫిర్యాదు చేసింది. డిజిటల్ మీడియా ఆర్టిస్ట్స్ అసోసియేషన్ శ్రీకాంత్ సినిమాలకు సంబంధించిన మీడియా ఈవెంట్ల బాయ్‌కాట్‌ను ప్రకటించింది. తర్వాత శ్రీకాంత్ క్షమాపణలు చెప్పుకోవడానికి ఒత్తిడి పెరిగింది. అక్టోబర్ 28, 2024న ఆయన ‘క్షమాపణలు చెప్పుతాను’ అని హామీ ఇచ్చారు, కానీ పూర్తి వివరణ ఇవ్వడం ఆలస్యమైంది. ఈ ఘటన పరిశ్రమలో రివ్యూయర్ల-నటుల మధ్య ఉద్రిక్తతలను బయటపెట్టింది.
Dare to WATCH?!?!?!
THE TRUTH!!!!!!! pic.twitter.com/0Y0kO2cvDP
— Shrikanth BHARAT (@Shri__Bharat) October 6, 2025
