Sri Sri Sri Rajavaru: నార్నే నితిన్ (Narne Nithin) ఈ పేరుకి ఈ మధ్య మంచి డిమాండే ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎన్టీఆర్ బావమరిదిగా పరిచయమైనప్పటికీ, నటుడిగా వరుస విజయాలు అందుకుంటున్న నార్నే నితిన్.. నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్నారు. నటన పరంగా ప్రేక్షకులతో మంచి మార్కులు వేయించుకుంటూ దూసుకెళుతున్న నార్నే నితిన్‌కు ఈ మధ్య వరుస విజయాలు అయితే వస్తున్నాయి కానీ, ఆయన మొదటిగా నటించిన సినిమా మాత్రం ఇంత వరకు విడుదలకు నోచుకోలేదు. ఇప్పుడిప్పుడే విడుదలకు సంబంధించి కాస్త మూమెంట్ వస్తుంది. జాతీయ అవార్డు విన్నర్, ‘శతమానం భవతి’ దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ సినిమా చాలా వాయిదాల తర్వాత జూన్ 6న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు మేకర్స్ పూనుకున్నారు. నార్నే నితిన్ సరసన సంపద హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని శ్రీ వేధాక్షర మూవీస్ పతాకంపై చింతపల్లి రామారావు నిర్మించారు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో యూత్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా ఈ చిత్రం రూపొందింది. శనివారం ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ని హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేశారు.
Also Read- R Narayana Murthy: పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ.. పీపుల్ స్టార్ సంచలన వ్యాఖ్యలు
ట్రైలర్ విడుదల కార్యక్రమంలో దర్శకుడు సతీష్ వేగేశ్న (Satish Vegesna) మాట్లాడుతూ.. మా ఈ ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ సినిమా సాంగ్స్, టీజర్‌ను సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ సినిమాలో నరేష్ ఒక డైలాగ్ చెబుతారు. మనల్ని మనం జయించుకోవడమే సక్సెస్ అంటే అనే డైలాగ్. ఈ కాన్సెప్ట్‌తో సినిమాను రూపొందించాం. మా హీరో నార్నే నితిన్ పక్కింటి కుర్రాడిలా మొదలుపెట్టి, యాక్షన్ పరంగా ఆకట్టుకుంటూ అద్భుతంగా దూసుకెళుతున్నాడు. హీరోయిన్ సంపద మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. నా సినిమాల్లో ఎప్పుడూ ఎక్కువమంది ఆర్టిస్టులు ఉంటారు. కారణం ఏంటంటే.. మన కుటుంబాల్లో ఎలా ఎక్కువమంది మనవాళ్లు ఉంటారో.. అలా నా కథల్లోనూ అలాంటి పాత్రలే పలకరిస్తాయి. మరుగున పడిపోయిన కొన్నింటిని చూపించాలనే నా సినిమాల ద్వారా తాపత్రయపడుతుంటాను. అలాంటి ప్రయత్నమే ఈ సినిమా. ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ సినిమా మిమ్మల్ని నిరాశపరచదు. ఈ సినిమాను అందరూ థియేటర్లలో చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానని అన్నారు.
Also Read- Hari Hara Veera Mallu: సీఎం రేవంత్ రెడ్డి తన నిర్ణయం మార్చుకుంటారా?
నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ.. మంచి కమర్షియల్ ఎలిమెంట్స్‌తో గొప్ప చిత్రాన్ని నిర్మించాలని నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్‌లో ఈ సినిమాను నిర్మించాం. మా చిత్ర హీరో నార్నే నితిన్ ఇటీవల యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీస్‌తో వరుస విజయాలు అందుకుంటున్నారు. ఈ సినిమా మంచి గ్రామీణ నేపథ్యంలో సాగే వెరైటీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం. పూర్తి కమర్షియల్ ఫార్మాట్‌లో, భారీ తారాగణంతో తెరకెక్కించారు దర్శకుడు. అలాగే ఎన్టీఆర్ ఎంతో మెచ్చి, ఈ కథను ఎంపిక చేశారు. ఆయన అంచనాల మేరకు దర్శకుడు ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా, అద్భుతంగా తెరకెక్కించారు. ఈ జూన్ 6న నార్నే నితిన్ అకౌంట్‌లో ఆయ్, మ్యాడ్ తరహాలో మరో సూపర్ హిట్ మూవీ పడుతుందని గట్టిగా నమ్ముతున్నామని తెలిపారు. ఇంకా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు