R Narayana Murthy: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) ను ప్రస్తావిస్తూ పీపుల్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ‘హరి హర వీరమల్లు’ సినిమా పేరు ఎత్తకుండా సినీ పరిశ్రమలోని సమస్యలపై చర్చిద్దాం రావాలని పిలిస్తే పవన్ కళ్యాణ్ గౌరవం మరింతగా పెరిగి ఉండేదంటూ పీపుల్ స్టార్ చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ అభిమానులే కాదు, సినీ ఇండస్ట్రీకి చెందిన వారు కూడా ఫైర్ అవుతుండటం విశేషం. ‘మీరు రాజులు మీరు చెప్పినట్లే కలుస్తాం.. కానీ పూర్వకాలంలో ప్రజల దగ్గరకే రాజులు వచ్చి వాళ్ళ సమస్యలు వినేవారని, మీరు గెలిచిన తర్వాత ఇండస్ట్రీ జనాలను పిలిచి సమస్యలు వినుంటే బాగుండేది కదా’ అని ఆర్ నారాయణ మూర్తి అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
Also Read- Sreeleela: శ్రీలీలకు నిశ్చితార్థం అయిపోయిందా? ఆ ఫొటోలేంటి?
‘‘తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ ఫిల్మ్ అవార్డులను (Gaddar Film Awards) ప్రకటించడం నిజంగా గర్వంగా ఉంది. అవార్డులు వచ్చిన వారందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు కూడా నంది అవార్డులను ప్రకటించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ప్రస్తుతం పర్సంటేజీల విషయంలో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల మధ్య వివాదం నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమాను దృష్టిలో పెట్టుకుని జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తున్నారనేది అబద్ధం. పర్సెంటేజీలు ఖరారైతే నాలాంటి నిర్మాతలకు ఎంతో మేలు చేకూరుతుంది. పవన్ కళ్యాణ్ తన సినిమా ప్రస్తావన తీసుకురాకుండా సినీ పరిశ్రమలోని సమస్యలపై చర్చిద్దాం రావాలని పిలిస్తే ఆయనపై మరింతగా గౌరవం పెరిగేది.
థియేటర్ల బంద్ అనేది బ్రహ్మాస్తం వంటిది. ప్రస్తుతం సింగిల్ థియేటర్ల మనుగడ ఎలా ప్రశ్నార్థకంగా మారిందో తెలియంది కాదు. పర్సంటేజీల విధానాన్ని కోరుకునే వ్యక్తుల్లో నేనూ ఒకడిని. ఈ విషయంలో అప్పట్లో మేము ఛాంబర్ ముందు టెంటు వేసి ఆందోళనలు కూడా చేశాం. ఎంతోమంది ఛాంబర్ ప్రెసిడెంట్‌లకు విజ్ఞప్తి చేసినా సమస్య పరిష్కారం కాలేదు. పర్సంటేజీల విషయం ఒక కొలిక్కి వచ్చే దశలో ‘హరిహర వీరమల్లు’ సినిమాకు లింకు పెట్టడం సరికాదు. సినీ పరిశ్రమ పెద్దలు సీఎం చంద్రబాబును కలవాలని అనుకోవడంతో తప్పులేదు. కానీ ఈ పర్సంటేజీ విషయాన్ని పక్కదారి పట్టించవద్దు. కార్పొరేట్ సిస్టమ్‌లకు వంత పాడుతున్నట్లుగా ఉంది. అదే జరిగితే సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఏమవ్వాలి? సింగిల్ స్క్రీన్ థియేటర్లు దేవాలయాల్లాంటివి. అవి కళ్యాణ మండపాలుగా మారిపోతున్నాయి. దయచేసి వాటిని బతికించండి. సినిమా టికెట్ల ధరల పెంపు విషయంలోనూ సినీ పరిశ్రమ, ప్రేక్షకులు తీవ్రంగా నష్టపోతున్నారు. భారీ బడ్జెట్‌తో సినిమాలు తీయండి.. కానీ ఆ ఖర్చును ప్రేక్షకులపై రుద్ద వద్దు. వందల కోట్లతో హాలీవుడ్‌లో సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. ‘షోలే’, ‘మోఘల్ ఏ ఆజాం’ వంటి సినిమాలు మన దగ్గర కూడా వచ్చాయి. ఆ సినిమాల కోసం ధరలు పెంచలేదు. మన తెలుగు సినిమా ‘లవకుశ’ను ఐదేళ్లు తీశారు. ఆ సినిమాకు టికెట్ ధరలు పెంచమని అప్పట్లో అడగలేదు. సినిమా బాగుంటే జనాలు తప్పకుండా థియేటర్లకు వస్తారు. టికెట్ ధరలు పెంచడం వల్ల అభిమానులు కూడా వాళ్ల హీరోల సినిమాలు చూడడానికి ఇష్టపడటం లేదు’’ అని ఆర్. నారాయణ మూర్తి చెప్పుకొచ్చారు.
Also Read- Hari Hara Veera Mallu: సీఎం రేవంత్ రెడ్డి తన నిర్ణయం మార్చుకుంటారా?
ఆర్. నారాయణ మూర్తికి కౌంటర్లు
ఆర్. నారాయణ మూర్తి అభిప్రాయం చేసిన అంశాలపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ‘‘సినిమా ఇండస్ట్రీలోని పెద్దలందరినీ వెంటబెట్టుకుని వైఎస్ జగన్ దగ్గరకు వెళ్లినప్పుడు ఈ మాటలు ఏమయ్యాయి? పవన్ కళ్యాణ్ తన సొంతం లాభం కోసం చెప్పలేదు. ఆయన కూడా ఇండస్ట్రీ వ్యక్తే. ఇండస్ట్రీ బాగు కోసమే సినీ పెద్దలందరినీ కలవమని అడిగారు. దండాలు పెట్టమని ఆయనేం అడగలేదు. చిన్న పేపర్ తీసుకుని పక్కింటికి వెళ్లినట్లుగా వెళ్లి టికెట్ల ధరలు పెంచుకుని వస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాకు రూ. 5 పెట్టి టికెట్లు అమ్మించినప్పుడు మీరంతా ఎక్కడికి పోయారు. అప్పుడు యూనిటీ లేదనే కదా.. ఇప్పుడందరూ యూనిటీగా రండని ఆయన పిలుపునిచ్చింది. మీలాంటి వారు ఇది అర్థం చేసుకోకుండా మాట్లాడటం ఏం బాగాలేదు. మీరే చెబుతున్నారుగా.. ఫిల్మ్ చాంబర్ పెద్దలు ఎంతమంది వచ్చినా ఏం చేయలేదని. అలా జరగకూడదనే కళ్యాణ్ ఇదంతా చేస్తున్నారు’’ అంటూ నెటిజన్లు, అభిమానులు పీపుల్ స్టార్‌కు కౌంటర్స్ ఇస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు