Sri Reddy Tweet: వివాదాస్పద కామెంట్స్ తో వార్తల్లో నిలిచే శ్రీరెడ్డి, ఈసారి కాస్త వేదాంతం పలికారు. అది కూడా ఇక వేస్ట్.. సినీ ఇండ్రస్ట్రీని ఇక నేను మార్చలేను అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు మరికొన్ని సంచలన కామెంట్స్ చేస్తూ , శ్రీరెడ్డి ట్వీట్ చేయడం ఇప్పుడు చర్చకు దారి తీసింది. అయితే ఆ ట్వీట్ లో ఓ మెలిక పెట్టిన శ్రీరెడ్డి, ఇక తన వల్ల కాదని తేల్చి చెప్పారు. ఇంతకు శ్రీరెడ్డి చేసిన ట్వీట్ సారాంశం ఏమిటంటే..
శ్రీరెడ్డి అంటే ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. సినీ ఇండ్రస్ట్రీలోకి అడుగుపెట్టి తన మార్క్ చూపించాలని పరితపించిన ఓ నటిగా చెప్పవచ్చు. అయితే అనూహ్యంగా పలు వివాదాలు ఆమె చుట్టూ చేరడం, కొందరు సినీ పెద్దలను ఎదిరించి అర్ధనగ్న ప్రదర్శన చేసిన శ్రీరెడ్డి అంటే తెలియని వారుండరు. సినిమాలలో అవకాశం దక్కాలంటే కమిట్మెంట్ గురించి సంచలన కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి నాటి రోజుల్లో, ఓ వర్ధమాన నటిగా అందరికీ తెలుసు.
సినిమా ఇండ్రస్ట్రీలో పొసగలేని శ్రీరెడ్డి, రాజకీయాల వైపు మొగ్గు చూపారు. వైసీపీ పార్టీలో చేరక పోయినప్పటికీ, పార్టీకి మద్దతుగా కామెంట్స్ చేస్తూ వచ్చారు. వైఎస్ జగన్ అంటే తనకు ఎనలేని అభిమానమని చెప్పుకొనే శ్రీరెడ్డి, 2024 ఎన్నికల వరకు ఓ రేంజ్ లో టిడిపి, జనసేన లక్ష్యంగా విమర్శలు గుప్పించారు.
ఆ విమర్శలు కాస్త లైన్ దాటి చేశారని చెప్పవచ్చు. అందుకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే, సారీల పర్వం సాగించారు. మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ లతో పాటు సిఎం చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులకు సారీ చెబుతూ లేఖలు కూడా విడుదల చేశారు.
అయితేనేమి టిడిపి, జనసేన కేడర్ మాత్రం ఆమెపై పలు పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదులు సైతం చేశారు. ఇలా ఏదొక రూపంలో వార్తల్లో నిలిచే శ్రీరెడ్డి, తాజాగా సినీ ఇండ్రస్ట్రీకి సంబంధించి ఓ ట్వీట్ చేశారు. మొన్నటి వరకు రాజకీయ ట్వీట్ లు చేస్తూ ప్రకంపనలు సృష్టించిన శ్రీరెడ్డి కన్ను ఇప్పుడు తెలుగు సినీ ఇండ్రస్ట్రీపై పడింది.
Also Read: Pawan Kalyan: పవన్ ఫోటోస్ తెగ వైరల్.. దటీజ్ పవన్ అంటున్న జనసైనిక్స్..
తాజాగా శ్రీరెడ్డి చేసిన ట్వీట్ ఆధారంగా.. నా జీవితం ప్రతిరోజూ ఓ పోరాటంలా అయిపోయింది. చాలా చాలా అలసిపోయా.. ఓపిక నశించింది. నా ఒక్కదాని వల్ల ఏ ఇండ్రస్ట్రీ లో ఏ మార్పు రాదు. ఒక మూస లో ఉన్నవి, కొత్తగా వచ్చి మనమెవరం మార్చలేము. నాలాగా ఎదురించి.. ఎవరూ మీ పేరు, జీవితం, పాడు చేసుకోవద్దు. ఎవరిలో ఏ మార్పు రాదు.
అంతా వేస్ట్ ఓకేనా? నా అనుకున్న వాళ్లు కూడా ఎవరినో స్క్రాప్ ని ఎంకరేజ్ చేస్తారు తప్ప, మనల్ని పక్కన పడేస్తారు. నా జీవితమే ఒక పాఠం. నేను ప్రశాంతత కోరుకుంటున్నాను. అందరూ నన్ను ఆశీర్వదించండి అంటూ శ్రీరెడ్డి ట్వీట్ చేశారు.
Also Read: Telugu Directors: శ్రీరామ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెలుగు దర్శకుల హవా!
ఇంతకు సినీ ఇండ్రస్ట్రీలో శ్రీరెడ్డికి, నా అనుకున్న వారు ఎవరు? వారెందుకు పక్కన పెట్టేశారన్నదే ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. మొత్తం మీద రాజకీయ విమర్శలకు సెలవు చెప్పిన శ్రీరెడ్డి, తాజాగా ఇక సినీ ఇండ్రస్ట్రీకి సెలవు ప్రకటించారని ఈ ట్వీట్ ద్వారా చెప్పవచ్చు.
Na Jeevitham daily o poraatam aipoyindhi, chala chala alisipoya,opika nasinchindhi,na okkadhani valla ye industry lo ye maarpu raadhu..oka moosa lo vunnavi, kothaga vachi
mana mevaram maarchalem..na laaga yedhurinchi,yevaru me peru,jeevitham paaduchesukovadhu..yevarilo ye…— Sri Reddy (@SriReddyTalks) April 7, 2025