Singer Sri Krishna in Controversy
ఎంటర్‌టైన్మెంట్

Singer Sri Krishna: సింగర్ శ్రీకృష్ణ అలాంటివాడా? బండారం బయటపెట్టిన లేడీ సింగర్!

Singer Sri Krishna: ప్రస్తుతం సింగర్ ప్రవస్తి కాంట్రవర్సీ ఎలా వైరల్ అవుతుందో తెలిసిందే. ఇప్పటి వరకు ప్రవస్తి మాత్రమే రియాలిటీ షోలలో ఏం జరుగుతుందో బయటపెట్టింది. ఇప్పుడిప్పుడే ఆమెకు మ్యూజిక్ ఇండస్ట్రీ నుంచి మద్దతు లభిస్తుంది. మొన్న మ్యూజిక్ డైరెక్టర్ షకీల్ ఆమెకు సపోర్ట్‌గా నిలిస్తే.. ఇప్పుడు మరో లేడీ సింగర్ నేహా కూడా ప్రవస్తికి చెప్పే విషయాలు నిజమే అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. సింగర్ నేహా మ్యూజిక్ ఇండస్ట్రీలో జరుగుతున్న మరో వ్యవహారాన్ని కూడా బట్టబయలు చేసింది. ముందుగా ప్రవస్తి గురించి చెబుతూ.. ఆమె బయటికి వచ్చింది కాబట్టి.. ఇలాంటివి ఇంకా ఎవరైనా ఫేస్ చేసి ఉంటే, వాళ్లు కూడా బయటికి వచ్చి చెబితే.. ఫ్యూచర్ జనరేషన్స్‌కు ఇంకా బెటర్‌గా ఈ రియాలిటీ షోలు మారుతాయని నేను అనుకుంటున్నాను. నేను ఎక్కువ చోట్ల క్యాస్ట్‌కు సంబంధించిన ప్రాబ్లమ్ ఫేస్ చేశా. క్యాస్ట్ ఫీలింగ్ అనేది ప్రతి రంగంలో ఉంది. ఆఖరికి సీఎంలను ఎన్నుకునే చోట కూడా ప్రజలు క్యాస్ట్ ఫీలింగ్ చూపిస్తారు. ఈ ప్రాబ్లమ్ ఇండియాలో ప్రతి చోటా ఉంది. అయితే ఎంత క్యాస్ట్ ఉన్నా, కొంతమంది కంటెస్టెంట్స్‌కి వాళ్లకి తెలియకుండానే జనాల్లో పాపులారిటీ వచ్చేస్తుంది. అప్పుడు జడ్జిలు కాదు కదా.. ఇంకెవరు ఏమీ చేయలేరు అని నేహా తెలిపింది.

Also Read- Kumbh Mela Monalisa: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మోనాలిసా.. ఆ రెండూ కూడా వస్తే!

ఇంకా ఆమె మాట్లాడుతూ.. ‘‘నేను ఫేస్ చేసిన ఇంకో విషయం చెబితే ఆశ్చర్యపోతారు. సింగర్ శ్రీకృష్ణ, నేను పాడితే అతను పాడనని చెప్పాడట. ఈ విషయం వాళ్లు వీళ్లు చెబుతుంటే నేను నమ్మలేదు. ఒక షో‌లో ఇద్దరం కలిసి ఓ పాట పాడాల్సి వచ్చినప్పుడు నా గొంతు బాగాలేదని చెప్పి తప్పుకున్నాడు. ఆ తర్వాత వేరే సింగర్‌తో వేరే పాట బాగానే పాడాడు. అప్పుడు నాకు అర్థమైంది. మరి శ్రీకృష్ణ అన్నకి నాపై ఎందుకంత ధ్వేషం ఉందో ఇప్పటికీ నాకు తెలియదు. ఇటీవల నేను ఓ సినిమాకు పాడిన పాట బాగా క్లిక్ అయింది. ఆ తర్వాత వేరే సినిమా వాళ్లు ఫోన్ చేసి మీరు శ్రీకృష్ణ గ్రూపా, సాకేత్ గ్రూపా అని అడిగారు. నేను ఎవరి గ్రూపు కాదని చెప్పాను. అవునా.. అయితే మేము మళ్లీ కాల్ చేస్తామని అన్నారు.. అంతే.

అంటే, ఈ శ్రీకృష్ణ వంటి వాళ్లే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్స్‌గా ఉన్నారు. నాతో పాడటానికే ఇష్టపడని వాళ్లు, నాకు అవకాశం ఎలా రానిస్తారు? ఇలాంటివి కూడా ఈ సింగింగ్ ఇండస్ట్రీలో ఉన్నాయి. ఇవన్నీ ఎవరికీ తెలియవు. ఒక ఈవెంట్ మ్యానేజర్ తనకి నచ్చిన వాళ్లని కాకుండా, శ్రీకృష్ణ వంటి వారు చెప్పిన సింగర్స్‌నే తీసుకుంటున్నారంటే.. ఏ లెవల్‌లో ఇది ఉందో అర్థం చేసుకోవచ్చు. నేను ఒక్కదాన్నే కాదు, చాలా మంది సింగర్స్ ఒక సింగర్ కారణంగా మమ్మల్ని పక్కన పెట్టేస్తున్నారని చెప్పారు. మరి మీరు చెప్పొచ్చు కదా.. ఎందుకు మాట్లాడరు? అని నేను అడిగేదాన్ని. ఎందుకులే.. ఈ వచ్చే కొన్నింటిని కూడా రానివ్వరు అని భయపడిపోతున్నారు.

Also Read- Singer Neha: ప్రవస్తి చెప్పేది నిజమే.. ఆ నరకం నేనూ చూశా! సింగర్ నేహా షాకింగ్ కామెంట్స్

ఒకరు ఒక బ్యాచ్‌లాగా తయారై, ఇలా చేయడం అనేది వేరే ఇండస్ట్రీలలో ఉందో లేదో నాకయితే తెలియదు. ఒకరు మనకి అవకాశం ఇవ్వకపోయినా పరవాలేదు. వేరొకరు ఇచ్చే అవకాశాన్ని, నువ్వు ఇవ్వడానికి వీల్లేదు అని బెదిరించి, ఆపడం తప్పే కదా. గ్రూపిజం వల్ల ఇక్కడ చాలా జరుగుతున్నాయి. ఎక్కడో కొంతమంది మంచి వాళ్లు ఉండబట్టే, ఇంకా మాలాంటి వాళ్లకి అవకాశాలు వస్తున్నాయి. ఈ గ్రూపిజంలో యాడ్ చేసుకోవడానికి వాళ్ల టార్గెట్ ఏమిటో తెలియదు. నాకు తెలిసి ఇక్కడ కూడా క్యాస్టే పని చేస్తుందేమో. మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరూ సింగర్స్‌ని సెలక్ట్ చేసుకోరు. వాళ్లు చాలా బిజీగా ఉంటారు. వాళ్లెవరినీ నేను బ్లేమ్ చేయను. ఈ మధ్యలో ఉండి ఇలా గ్రూపులు క్రియేట్ చేసే వాళ్లతోనే ప్రాబ్లమ్ అవుతుంది’’ అని సింగర్ నేహా షాకింగ్ విషయాలను బయటపెట్టింది. సింగర్ నేహా చెప్పిన ఈ విషయాలతో అందరూ శ్రీకృష్ణను ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ఎప్పుడూ నవ్వుతూ ఉండే రేలంగి మావయ్య అనుకున్నాం కదయ్యా! నువ్వు కూడా అలాంటివాడివేనా?’ అంటూ కామెంట్స్ చేస్తుండటం విశేషం.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?