Singer Neha and Singer Pravasthi
ఎంటర్‌టైన్మెంట్

Singer Neha: ప్రవస్తి చెప్పేది నిజమే.. ఆ నరకం నేనూ చూశా! సింగర్ నేహా షాకింగ్ కామెంట్స్

Singer Neha: బాడీ షేమింగ్, డిస్కరేజ్ చేయడం వంటివి చేశారంటూ సింగర్ ప్రవస్తి (Singer Pravasthi) మీడియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా సింగర్ ప్రవస్తి పేరు రెండు తెలుగు రాష్ట్రాలలో బాగా వైరల్ అవుతుంది. ప్రస్తుతం సింగింగ్ ఇండస్ట్రీలో ఆమె వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. కారణం ప్రవస్తి టార్గెట్ చేసింది నార్మల్ పర్సన్స్‌‌ని కాదు.. ఏకంగా ఆస్కార్ విజేతలు అయిన ఎమ్.ఎమ్. కీరవాణి, చంద్రబోస్‌లతో పాటు ది మోస్ట్ టాలెంటెడ్ సింగర్ సునీతని. ఇప్పటి వరకు ఒక్క ప్రవస్తి మాత్రమే ఈ విషయంలో పోరాడుతూ వస్తుంది. తాజాగా మరో సింగర్ ఈ కాంట్రవర్సీలో ప్రవస్తికి మద్దతుగా కొన్ని కామెంట్స్ చేశారు. ఆ సింగర్ ఎవరో కాదు, తను కూడా పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా వెలుగులోకి వచ్చిన సింగరే. ఆమె ఎవరో కాదు సింగర్ నేహా.

తాజాగా నేహా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘కొందరు కామన్‌గా జరుగుతూ ఉండే విషయమే కదా.. దీనికి ఎందుకు ప్రవస్తి ఇంత రాద్దాంతం చేస్తుందని అంటుంటే నాకు నచ్చడం లేదు. బయటకి వచ్చి గొడవ చేయాలనేది నా ఉద్దేశ్యం కాదు. ఆ వర్డ్ మాత్రం నాకు నచ్చలేదు. ఒక తప్పు పదే పదే జరుగుతూ ఉంటే అది రైట్ అయిపోదు కదా. ఎవరూ మాట్లాడలేదు. నాకూ ఇలాంటి అనుభవాలున్నాయి. నేను మీడియా ముందు మాట్లాడకపోవచ్చు. కానీ, నాకు ఎక్కడైతే తప్పని అనిపించిందో.. అప్పుడే నేను వాళ్లతో డైరెక్ట్‌గా మాట్లాడాను. నా స్టాండ్ నేను తీసుకున్నాను. ఇప్పుడు మీడియా ఛానల్స్ ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి.. ప్రవస్తి విషయం ఇంతగా బయటికి వచ్చింది. మేము రియాలిటీ షోలు చేసిన టైమ్‌లో చాలా మంది దీనిపై పోరాడారు. కానీ ఇప్పుడు మీడియా అవగాహన పెరగడంతో ఇది ఇంతలా హైలెట్ అవుతుంది.

Also Read- NTRNeel: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ఇలా ట్విస్ట్ ఇచ్చారేంటి? నమ్మకం లేదా?

నాకు జరిగినవన్నీ ఒకే షో లో జరిగాయని చెప్పడం లేదు. ఒక్కో షోలో ఒక్కోలా జరిగింది. నేను ఓ సాంగ్ పాడలేనని తెలిసి, అదే సాంగ్ ఇచ్చి నన్ను ఎలిమినేట్ చేశారు. అందరూ అంటుంటారు.. కాంపిటేషన్ అన్నాక అన్ని పాటలు పాడాలని. అది నా ఒక్కదానికేనా. అందరికీ ఆ రూల్ ఉండదా? అని నేను ప్రశ్నిస్తున్నాను. అన్ని షోలలో ఇలా ఉంటుందని నేను చెప్పను. ‘పాడుతా తీయగా’ విషయానికి వస్తే.. ఇప్పుడు జరుగుతున్న సీజన్‌లో ప్రవస్తి ఫేస్ చేసినవి.. మేము ఫేస్ చేయలేదు. అప్పుడు బాలు సార్ ఉన్నారు. కాస్ట్యూమ్స్, బాడీ షేమింగ్ అనేది నేను అయితే వినలేదు. పాటల విషయంలో, ఫేవరేటిజం అయితే మాత్రం ఉంటుంది. అసలు ‘పాడుతా తీయగా’లో ట్రెడిషనల్‌గా ఉండాలనే రూల్ ఉంటుంది.

ఇక బాడీ షేమింగ్ అంటారా? ఇది.. కార్యక్రమం, ఛానల్‌పై కాకుండా.. ఆ బాడీ షేమింగ్ ఎవరైతే చేశారో వారిపైనే మాట్లాడాలనేది నా ఉద్దేశ్యం. ప్రవస్తి విషయంలో నాకు ఏం జరిగిందనేది తెలియదు కానీ, రియాలిటీ షోలలో కొందరిని టార్గెట్ చేయడం అనేది మాత్రం ఉంటుంది. వీళ్లని విన్నర్‌ని చేయాలని, వీళ్లని టాప్ 4 లో నిలబెట్టాలని ముందే అనుకుంటే మాత్రం.. అందుకు అడ్డుగా ఉన్నవారిని ఏదో ఒకటి చేసి తీసేస్తారు. ఆ నలుగురు కాకుండా ఇంకా బాగా పాడే వాళ్లని ముందే ఎలిమినేట్ చేస్తారు. ఇలాంటివి జరుగుతాయి. నాకు కూడా జరిగింది కాబట్టి కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాను. విన్నర్ సెలక్ట్ చేయడం ఎక్కువగా మ్యానేజ్‌మెంట్ చేతుల్లోనే ఉంటుంది. జడ్జిల చేతుల్లో ఏం ఉండదు. కొన్ని సార్లు రికమెండేషన్స్ కూడా ఇక్కడ పని చేస్తాయి. టీఆర్పీల కోసం కొన్ని చేస్తారు.

Also Read- Padma Bhushan Award: పద్మభూషణ్‌ అందుకున్న బాలయ్య, అజిత్‌ల స్పందన ఇదే!

నేను ఫేస్ చేసిన ఇంకో విషయం చెబుతాను. ఇప్పుడు మట్టిలో మాణిక్యాలు అని కొందరిని తీసుకువస్తారు. వాళ్ల వెనుక ఉన్న స్టోరీ వాళ్లకి టీఆర్పీకి పనికొస్తుంది. నన్ను ఒకసారి అడిగారు.. మీ వెనుక ఎటువంటి బ్యాడ్ స్టోరీ లేదు కదండీ. మీకు ఏమైనా బాధలు ఉండే రాసి ఇవ్వండి. అది యూజ్ అవుతుందని అన్నారు. నాకు అలాంటివి ఏమీ లేవని చెబితే.. మిమ్మల్ని తీసుకుంటే మాకు అంత పుష్ రాదు కాబట్టి వేరే వాళ్లని తీసుకుంటామని చెప్పారు. ఈ విషయం నాకు డైరెక్ట్‌గా చెప్పారు.

సింగర్ ప్రవస్తి విషయానికి వస్తే, ఆమెకు ఇప్పుడు ప్రత్యేకంగా న్యాయమేమీ జరగదు. ఆమెకు జరగాల్సినవన్నీ జరిగిపోయాయి. ఎలిమినేట్ అయిపోయింది. తనకి ఎటువంటి ఉపయోగం ఉండదు. కానీ, ఇకపై ఇలాంటి షోలు పెట్టేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉంటారు. రాబోయే తరానికి మాత్రం ప్రవస్తి మేలు చేసిందని చెప్పుకోవచ్చు. అయితే కీరవాణి సార్‌‌పై చేసిన ఆరోపణలలో మాత్రం నేనేమీ చెప్పలేను. ఆమె ఆరోపణల తర్వాత ఆ షోలోని ఇతర సింగర్స్‌కి కాల్ చేసి కనుక్కున్నాను. కీరవాణి సార్, తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్‌ని చెబితే, అది ప్రవస్తి తననే అంటున్నారనలా ఫీలైందని అన్నారు. దీనికి ప్రూఫ్‌లు ఏమీ ఉండవు కదా. అక్కడ ఏం జరిగిందనేది మనకు తెలియదు..’’ అని నేహా చెప్పుకొచ్చింది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు