Kumbh Mela Monalisa: ఇక మోనాలిసాకు.. ఆ రెండూ కూడా వస్తే!
Kumbh Mela Monalisa
ఎంటర్‌టైన్‌మెంట్

Kumbh Mela Monalisa: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మోనాలిసా.. ఆ రెండూ కూడా వస్తే!

Kumbh Mela Monalisa: ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో జరిగిన మహా కుంభమేళాలో కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించిన విషయం తెలిసిందే. ఈ పుణ్య స్నానాలతో పాటు ఈ కుంభవేళా పేరును బాగా వైరల్ చేసిన జాబితాలో మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లా మహేశ్వర్‌‌కు చెందిన మోనాలిసా పేరు ప్రముఖంగా వినబడింది. ఈ మహా కుంభమేళాలో పూసలు, రుద్రాక్షలు అమ్ముకోవడానికి వచ్చిన ఈ యువతి అందరినీ బాగా ఆకర్షించింది. అందరూ న్యాచురల్ బ్యూటీ అంటూ ఆమెతో సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. ఒక్కసారి మోనాలిసా ఫేమస్ అయింది. ఇంకా చెప్పాలంటే, ఆమె కోసం సెల్ఫీ దిగే వారి సంఖ్య ఎక్కువై ట్రాఫిక్ జామ్‌లు కూడా అయినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తాకిడికి తట్టుకోలేక పోలీసులు ఆమెను ఆ ప్రదేశం నుండి పంపించేశారంటే, ఎంతగా ఆమె వైరల్ అయిందో అర్థం చేసుకోవచ్చు.

Also Read- Singer Neha: ప్రవస్తి చెప్పేది నిజమే.. ఆ నరకం నేనూ చూశా! సింగర్ నేహా షాకింగ్ కామెంట్స్

ఆ కుంభమేళా సమయంలోనే బాలీవుడ్‌కి చెందిన ఓ డైరెక్టర్‌ను ఆమెకు సినిమా ఛాన్స్ ఆఫర్ చేయడమే కాకుండా, స్వయంగా ఇంటికి వెళ్లి ఆమె పేరేంట్స్‌ని ఒప్పించారు. ఆ తర్వాత మోనాలిసాను ముంబై తీసుకెళ్లి మేకోవర్ చేస్తున్నట్లుగా కొన్ని వీడియోలు సోషల్ మాధ్యమాలలో దర్శనమిస్తూనే ఉన్నాయి. అయితే సదరు డైరెక్టర్ ఈ మధ్య లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ చేశారనే విషయం తెలిసిందే. మోనాలిసాకు అవకాశం ఇస్తానని చెప్పిన డైరెక్టర్ సనోజ్ మిశ్రాను వేరే యువతిపై అత్యాచారం కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. హీరోయిన్‌ను చేస్తానని మాయమాటలు చెప్పి ఓ యువతిపై అత్యాచారం చేసినట్లుగా కేసు నమోదవడంతో పోలీసులు ఆయనని అరెస్ట్ చేశారు.

దీంతో మోనాలిసా సేఫ్ అయిందని అంతా అనుకున్నారు. అయితే, సనోజ్ మిశ్రా ఆమెకు మంచే చేశాడు. ఆయన అవకాశం ఇస్తానని చెప్పి మోనాలిసాను తీసుకొచ్చి, ఆమె మేకోవర్ మొత్తాన్ని మార్చేశాడు. ఆ మేకోవర్‌తో మోనాలిసా హీరోయిన్ మెటీరియల్‌గా మారిపోయింది. నిజంగా ఈ భామ పూసలమ్ముకునే అమ్మాయేనా అనుకునేంతగా ఆమెలో మార్పు వచ్చింది. ఆమె సరికొత్త లుక్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం మోనాలిసా ఫుల్ మేకప్‌లో ఉన్న వీడియో ఒకటి సోషల్ మాధ్యమాలలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా, ఇప్పుడు మోనాలిసాలో హీరోయిన్ కళ కొట్టిచ్చినట్లు కనిపిస్తుందని, ఈ అందానికి తగినట్లుగా ఆమె నటన, డ్యాన్స్ నేర్చుకుంటే మాత్రం ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసే హీరోయిన్ అవుతుందని అంతా అభిప్రాయపడుతున్నారు.

">

Also Read- NTRNeel: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ఇలా ట్విస్ట్ ఇచ్చారేంటి? నమ్మకం లేదా?

నిజంగా ఆమెకు ఆ అవకాశం వస్తుందనే భావించవచ్చు. ఎందుకంటే, ఆమెకు అదృష్టం అలా ఉంది. ఎక్కడో పూసలు అమ్ముకునే అమ్మాయి, ఇలా ముంబైలోని ఫేమస్ డిజైనర్ స్టూడియోస్‌లో కనిపించడం, వేషధారణ మొత్తం మారిపోయి హీరోయిన్‌లా మారిపోవడం.. ఇదంతా అదృష్టమనే అనుకోవాలి. ఈ అదృష్టానికి తగినట్లుగా అవకాశాలు కూడా వస్తే.. మోనాలిసా వెండితెరను ఏలేస్తుందని అంతా అనుకుంటున్నారు. మరి ఆ రోజు ఎప్పుడు వస్తుందో వెయిట్ అండ్ సీ..

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం

Congress Election Strategy: రెండో విడత కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ.. మెజార్టీ స్థానాలపై ఫోకస్..!