Mrithyunjay Movie: టాలీవుడ్‌లో ఓ హీరోకి కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ (King Of Entertainment) అనే బిరుదు ఉంది. ఆ హీరో చేసే చిత్రాలన్నీ కూడా చాలా వైవిధ్యంగా ఉంటాయి. సినిమా సినిమాకు చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టే, ఈ హీరో నుండి సినిమా వస్తుందీ అంటే, మ్యాగ్జిమమ్ ప్రేక్షకులు అలెర్ట్ అవుతారు. హిట్, ఫట్ అనే సంబంధం లేకుండా ఆయన చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తాయి కాబట్టి. అలా డిఫరెంట్ మూవీస్‌తో ప్రేక్షకులను మెప్పిస్తోన్న ఆ కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎవరని అనకుంటున్నారా? ఇంకెవరు యంగ్ హీరో శ్రీవిష్ణు. ఇప్పుడీ హీరో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘మృత్యుంజయ్’గా అలరించేందుకు రెడీ అవుతున్నాడు. హీరో శ్రీవిష్ణు పుట్టినరోజు స్పెషల్‌గా ఈ చిత్ర విశేషాలతో మేకర్స్ ఓ టీజర్ వదిలారు. ఈ చిత్ర విశేషాలలోకి వెళితే.. (HBD Sree Vishnu)
Also Read- Kangana Ranaut: 3,4 పెళ్లిళ్లు చేసుకున్న సింగర్.. మరో భర్తను వెతుకుతోంది
హుస్సేన్ షా కిరణ్ (Hussain Sha Kiran) దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని రమ్య గుణ్ణం సమర్పణలో లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్‌ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మిస్తున్నారు. రెబా మోనికా జాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్ ఇంతకు ముందు చేసిన ‘సామజవరగమన’ చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. శుక్రవారం హీరో శ్రీవిష్ణు పుట్టినరోజు సందర్భంగా వదిలిన ‘మృత్యుంజయ్’ టైటిల్ టీజర్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. హీరో శ్రీవిష్ణు కెరీర్‌లో మరో డిఫరెంట్ మూవీగా ఈ సినిమా నిలుస్తుందనే ఫీల‌్‌ని ఈ టీజర్ ఇస్తోంది. ఈ టైటిల్ టీజర్‌ను గమనిస్తే..
ఓ వాయిస్ ఓవర్‌లో ‘గేమ్ ఓవర్ జయ్’ అనే డైలాగ్‌తో మొదలైన ఈ టైటిల్ టీజర్‌లో శ్రీవిష్ణు ఇన్వెస్టిగేషన్‌కు సంబంధించిన ఫ్లాష్ కట్స్‌ను చూడొచ్చు. చకాచకా వెళ్లిపోతున్న సీన్స్‌తో ఈ టీజర్ చిత్రంలోని నటీనటులతో పాటు శ్రీవిష్ణుని ఇన్వెస్టిగేటర్‌గా, ఖైదీగా చూపిస్తూ.. కథపై చిన్న క్లూ కూడా ఇవ్వకుండా నడిచింది. చివర్లో ‘నేను చెప్పే వరకు గేమ్ ఫినిష్ కాదు’ అంటూ శ్రీవిష్ణు చెప్పిన డైలాగ్ మాత్రం ఇదొక మృతువుకు సంబంధించిన గేమ్ అనేది మాత్రం అర్థమవుతోంది. ఫైనల్‌గా ఆసక్తిని రేకెత్తిస్తూ ‘మృత్యుంజయ్’ అని సినిమా టైటిల్‌ను రివీల్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యిందని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని మేకర్స్ తెలిపారు. శ్రీవిష్ణు హీరోగా నటిస్తోన్న ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మరో ఇంట్రెస్టింగ్ ఎంటర్‌టైనర్‌గా మెప్పించనుందనేది మాత్రం ఈ టీజర్ తెలియజేస్తుంది. విద్యాసాగర్ సినిమాటోగ్రఫీ, కాలభైరవ సంగీతం, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, మనీషా.ఎ.దత్ ప్రొడక్షన్ డిజైనింగ్ అన్నీ కూడా హైలెట్ అనేలా ఉన్నాయి. త్వరలోనే చిత్ర విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు.