Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ వరుస చిత్రాలతో అందరికీ షాకిస్తున్నాడు. ‘ది రాజా సాబ్’, ‘సలార్ 2’, ‘కల్కీ 2’, ‘ఫౌజి’, ‘స్పిరిట్’.. ఇలా క్షణం గ్యాప్ లేని విధంగా ప్రభాస్ ఆర్డర్ ఉంది. అయితే కొత్తగా మరో సినిమాకు ప్రభాస్ సైన్ చేసినట్లుగా టాక్ నడుస్తుంది. వాస్తవానికి ‘సలార్ 2’ కాకుండా మరో రెండు ప్రాజెక్ట్స్ ప్రభాస్‌తో చేయబోతున్నట్లుగా హోంబలే ఫిలిమ్స్ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. ఆ రెండు చిత్రాల్లో ఒక చిత్రానికి సంబంధించిన అప్డేట్‌గా, ఇప్పుడొక కాంబినేషన్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్‌తో ‘హనుమాన్’ దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prashanth Varma) ఓ సినిమా చేయబోతున్నాడని, అందుకు సంబంధించిన టెస్ట్ షూట్ కూడా జరుగుతుందనేది తాజా సమాచారం. ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్ నిర్మించనుందని అంటున్నారు. అయితే, ప్రశాంత్ వర్మతో ప్రభాస్ సినిమా అనగానే అంతా గతంలో ప్రశాంత్ వర్మ చేయాల్సి ఆగిపోయిన కథనే, కొత్తగా మార్చి ఉంటాడనేలా టాక్ నడుస్తుంది. ఆ వివరాల్లోకి వెళితే..
Also Read- Rashmika Mandanna: రష్మికకు వింత అలవాటు.. అదేం పని?
ఆ సినిమానే ప్రభాస్‌తో చేస్తున్నాడా?
‘హనుమాన్’ మూవీ టైమ్‌లో బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్‌తో ప్రశాంత్ వర్మ ఓ సినిమాను ప్రకటించాడు. ఈ సినిమాకు ‘బ్రహ్మ రాక్షస్’ (Brahma Rakshas) అనే టైటిల్ కూడా వినిపించింది. ఈ సినిమాకు అన్నీ సెట్టై, సెట్స్ మీదకు వెళ్లే సమయంలో రణ్వీర్ సింగ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. అప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఒక్క వార్త కూడా వినబడలేదు. కట్ చేస్తే, ఇప్పుడు ప్రభాస్‌తో ప్రశాంత్ వర్మ సినిమా అనగానే, అదే కథని ప్రభాస్‌కు తగినట్లుగా అద్భుతంగా మార్చాడని, అందుకే రెబల్ స్టార్ ఈ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పాడనేది ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. మరి నిజంగా ఇది ఆ ప్రాజెక్ట్ అయితే మాత్రం, ప్రశాంత్ వర్మ యూనివర్స్‌లో ఇది కూడా ఒక పార్ట్ అయ్యే అవకాశం అయితే లేకపోలేదు. నిజంగా వారు చేస్తున్న టెస్ట్ షూట్ సినిమా కోసమేనా, లేదంటే ఏదైనా అడ్వర్‌టైజ్‌మెంట్ కోసమా? అనేది కూడా తెలియాల్సి ఉంది.

మరి మోక్షజ్ఞ సినిమా సంగతేంటి?
మరోవైపు ప్రశాంత్ వర్మ.. నందమూరి నట వారసుడు, బాలయ్య తనయుడు నందమూరి మోక్షజ్ఞ తేజ (Nandamuri Mokshagna Teja)తో సినిమా చేస్తున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. సినిమా పూజా కార్యక్రమాల వరకు వెళ్లి, అనూహ్యంగా ఆగిపోయింది. ఈ సినిమా ఆగిపోవడానికి కారణం ఏమిటనేది ఇంత వరకు తెలియరాలేదు. నందమూరి ఫ్యామిలీ సైడ్ నుంచి వినిపిస్తున్న దానిని బట్టి చూస్తే, ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు సరైన కథని సెట్ చేయలేదని, అందుకే బాలయ్య చివరి నిమిషంలో క్యాన్సిల్ చేశాడని అంటున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ ఆగిపోవడానికి కారణం నిర్మాత అని కూడా టాక్ వినబడుతుంది. మరి ఏదో నిజమో, వారిలో ఎవరైనా చెబితేనే కానీ తెలియదు. అప్పటి వరకు ఎవరికి నచ్చినట్లుగా వారు దీనిపై రాతలు రాసుకోవడం కామనే.