Megastar Chiranjeevi: సందీప్ కిషన్, రావు రమేష్ తండ్రీకొడుకులుగా నటించిన చిత్రం ‘మజాకా’ (Mazaka), ఈ సినిమా ఫిబ్రవరి 26న శివరాత్రి స్పెషల్‌గా విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం ప్రమోషన్స్‌ని మేకర్స్ యమా రేంజ్‌లో నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్స్‌లో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి పేరు బాగా వినిపిస్తుండటం విశేషం. ఈ సినిమాకు రైటర్ ప్రసన్న కుమార్. చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమా చేసే టైమ్‌లో ‘సోగ్గాడే చిన్నినాయన’ ఫేమ్ కళ్యాణ్ కృష్ణ (Kalyan Krishna)తో సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి, ‘డిజె టిల్లు’ (DJ Tillu) ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ కాంబినేషన్‌లో సినిమా అని, రైటర్ ప్రసన్న కుమార్ మంచి కథ రెడీ చేశాడనేలా టాక్ వినబడింది. ఈ సినిమాను చిరంజీవి కుమార్తె సుస్మిత నిర్మిస్తారని కూడా టాక్ నడిచింది. ఆ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ ఈ సినిమా చేయనని చెప్పడంతో, ఆ ప్లేస్‌లో శర్వానంద్‌తో పాటు మరో ఇద్దరు యంగ్ హీరోల పేర్లు వినిపించాయి. ఆ తర్వాత ఏమైందో ఏమో గానీ, ఈ ప్రాజెక్ట్ జాడే లేదు.
Also Read- Hari Hara Veera Mallu: ‘హరి హర వీరమల్లు’.. ‘కొల్లగొట్టినాదిరో’ పాట ఎలా ఉందంటే..
కట్ చేస్తే, ‘మజాకా’ ప్రమోషన్స్‌లో సందీప్ కిషన్, దర్శకుడు త్రినాథరావు వంటివారు ఇది చిరంజీవి చేయాల్సిన సినిమాగా చెబుతూ వస్తున్నారు. రావు రమేష్ పాత్రని మెగాస్టార్ చిరంజీవి చేయాల్సి ఉందట. కానీ చిరు స్థాయికి ఆ పాత్ర సరిపోదని, అందుకు చిరు ఈ ప్రాజెక్ట్‌ని పక్కన పెట్టేసినట్లుగా ఇన్ సైడ్ వర్గాల టాక్. హీరో సందీప్ కిషన్ కూడా ఇదే విషయాన్ని బలపరిచాడు. రావు రమేష్ చేసిన తండ్రి పాత్ర, మెగాస్టార్ స్థాయికి సరిపోదు, మంచి కథ వస్తే మాత్రం కచ్చితంగా చిరంజీవిగారితో కలిసి చేస్తాను అని అన్నాడు. అంతెందుకు, స్వయంగా చిరంజీవే ఇటీవల ఓ వేడుకలో సందీప్ కిషన్‌ని ఉద్దేశించి మాట్లాడుతూ, ఈ ప్రాజెక్ట్‌లో మనం కలిసి చేయాలి కానీ, కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు అంటూ పబ్లిగ్గా తెలిపాడు. ఆయన ఆ మాటలు అన్న తర్వాతే, ఈ ‘మజాకా’ ప్రాజెక్ట్ అప్పటిది అనేలా టాక్ మొదలైంది.
ఇక ఇదే విషయంపై దర్శకుడు త్రినాథరావు కూడా స్పందించారు. ఈ కథ మెగాస్టార్ దగ్గరకు వెళ్లింది నిజమే. కానీ, ఆ వెర్షన్ వేరని నేను అనుకుంటున్నాను. ‘మజాకా’ స్టోరీ మాత్రం మెగాస్టార్ ఇమేజ్‌కు సరిపోదు. ఇది కేవలం రావు రమేష్ కోసం రెడీ చేసిన పాత్ర. ఆయన వయసుకు తగిన పాత్ర. నిజంగా చిరంజీవి ఆ పాత్ర చేయాల్సి వస్తే.. ఈ కథ అస్సలు సరిపోదు. ఆయన ఇమేజ్ ఎక్కడో ఉంది. దానిని ఈ కథ అందుకోలేదు. భవిష్యత్‌లో మంచి కథ ఉంటే మాత్రం కచ్చితంగా మెగాస్టార్‌తో సినిమా చేస్తానంటూ ఈ ‘ధమాకా’ దర్శకుడు చెప్పుకొచ్చాడు. నిజమే, ‘మజాకా’ ఎంటర్‌టైన్ చేసే చిత్రమే కావచ్చు, విడుదల తర్వాత సక్సెస్ కూడా కావచ్చు. కానీ, చిరంజీవి ఇమేజ్‌కి ఈ సినిమా సరిపోదనే విషయం ‘మజాకా’ ట్రైలర్ చూసైనా చెప్పేయవచ్చు. అందుకే, చిరు ఈ ప్రాజెక్ట్‌ని ముందుకు తీసుకెళ్లలేదనేది సందీప్, త్రినాథరావుల మాటలతో స్పష్టమవుతుంది.