Kangana Ranaut: ‘గ్యాంగ్ స్టర్’ అనే మూవీతో బాలీవుడ్‌లోకి ‘కంగనా రనౌత్’ ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే ఫిలింఫేర్ ఉత్తమ నటి డెబ్యూ పురస్కారం అందుకున్నారు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ.. తన నటనతో ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. క్వీన్, మణికర్ణిక, తను వెడ్స్ మను వంటి మూవీస్‌లో నటించి స్టార్ డమ్ తెచ్చుకుంది. ‘ఏక్ నిరంజన్’ చిత్రంతో కంగనా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ప్రభాస సరసన నటించి ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకుంది. ఇక కాంట్రవర్సీల్లో కంగనా పేరు ఎప్పుడూ వినిపిస్తూనే ఉంది. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్‌గా కంగనా రనౌత్ పేరు గాంచింది. ఎప్పుడు వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. బాలీవుడ్‌లో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా కంగనా మారింది.
ఇదిలా ఉంటే.. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తరుపున కంగనా పోటీ చేసి గెలుపొందిన విషయం తెలిసిందే. మండి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన కంగనా భారీ మెజారిటీతో గెలుపొందింది. ఈ క్రమంలోనే సినిమాలకు బ్రేక్ ఇస్తారేమోని అందరూ అనుకున్నారు. అయితే ఇటు మూవీస్‌లో నటిస్తూ.. అటు రాజకీయాల్లో కూడా రాణిస్తుంది. మరోవైపు హిందీ చిత్ర పరిశ్రమ, నటులపై కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా హాలీవుడ్ నటి జెన్నిఫర్ లోఫేజ్‌పై హాట్ కామెంట్స్ చేసింది. జెన్నిఫర్ లోఫేజ్ పెళ్లిళ్లు గురించి వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. జెన్నిఫర్‌కి పేరు ప్రఖ్యాతలు, ఆస్తులు ఉన్నప్పటికీ వివాహ బంధాన్ని నిలబెట్టు కోలేకపోతుందని పేర్కొంది.
Also Read: నటి ప్రీతి జింటాకు రాజ్యసభ సీటు?
ఇప్పటికి మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న జెన్నిఫర్ లోఫేజ్.. 50 ఏండ్ల వయసులో కూడా మరో భర్త కోసం చూస్తుందని అన్నారు. ఎవరైనా ఇతర దేశాల వ్యక్తులు.. భారతీయ పెళ్లిళ్ల గురించి మాట్లాడే ముందు ఈ విషయాలు తెలుసుకుని మాట్లాడాలని చెప్పింది. ఇక ప్రపంచంలోనే బెన్ అఫ్లెక్ హాటెస్ట్ మ్యాన్‌గా పేరొందారని.. పిల్లలు ఉన్నా, పెళ్లిళ్లు చేసుకున్నా, ఇప్పటికీ కూడా మరో భార్య కోసం ఎదురుచూస్తున్నాడని వెల్లడించింది. అలానే జెన్నిఫర్ స్టార్ పాప్ సింగర్, రిచ్ పర్సన్.. ఆమె కూడా హస్బెండ్ కోసం వెతుకుతుందని తెలిపింది. అయితే భారతీయ సంప్రదాయాలు వీటన్నింటికి విరుద్ధమని, ఒక్కసారి పెళ్లి చేసుకుంటే భర్తతోనే కలిసే ఉండాలని కోరుకుంటారని, పెళ్లికి ఇక్కడ చాలా విలువ ఉంటుందని తెలిపింది. ఒక్కసారి పెళ్లి అయితే భార్యాభర్తలు లోతైన బంధాన్ని ఏర్పరచుకుంటారని భారతీయ వివాహబందంపై కంగనా పొగడ్తల వర్షం కురిపించింది. ప్రస్తుతం కంగనా రనౌత్ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.