Sree Vishnu: టాలీవుడ్ కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు, టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ కాంబోలో సమ్మర్ సెన్సేషనల్‌గా వచ్చి సక్సెస్ సాధించిన చిత్రం ‘సింగిల్’ (Single Movie). కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించారు. కార్తీక్ రాజు దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించారు. మే 9న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా అందరినీ అలరించి, మెప్పించి.. సమ్మర్ బ్లాక్ బస్టర్‌గా నిలిచి, సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్‌ను నిర్వహించి ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
Also Read- Kannappa: ‘కన్నప్ప’ కామిక్ బుక్ ఫైనల్ చాప్టర్.. ‘శివయ్యా’ అని విష్ణు ఎందుకు పిలిచాడంటే?
అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ఈ సినిమా రసెస్ చూసిన తర్వాత శ్రీ విష్ణుని పిలిచి గీతా ఆర్ట్స్‌లో మరో రెండు సినిమాలు చేయాలని చెక్ ఇచ్చాను. మనిషిగా, నటుడిగా నాకు తను అంతగా నచ్చాడు. సినిమా బాగుంటే మేము థియేటర్స్‌కి వస్తామని మరోసారి నిరూపించిన ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాను. డైరెక్టర్ కార్తీక్ రాజు అద్భుతంగా ‘సింగిల్’ సినిమాని తీశారు. విష్ణుతో నా జర్నీ ఇంకా ముందు ముందు కూడా ఉంటుంది. తను డైలాగ్ డైలాగ్‌కి మధ్య చెప్పిన డైలాగు అర్థం చేసుకోవడం నావల్ల కూడా కాలేదు. వెన్నెల కిషోర్ ఈ సినిమాతో ఇంకాస్త దగ్గర అయ్యారు. వ్యక్తిగత సలహాలు తీసుకోవడం వరకు వచ్చింది. కేతిక, ఇవానా ఫెంటాస్టిక్‌గా పెర్ఫామ్ చేశారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం ఈ సినిమాకు హైలెట్‌గా నిలిచింది. యువ దర్శకులంతా వచ్చి ఈ సక్సెస్‌ని సెలబ్రేట్ చేయడం అనేది చాలా ఆనందాన్ని ఇచ్చింది. వారందరికీ ధన్యవాదాలు. విద్య మా అమ్మాయి. తను ఈ సినిమాతో విజయాన్ని అందుకోవడం ఆనందంగా వుంది. ఈ సినిమాకు పని చేసిన టెక్నీషియన్స్‌కి, నటించిన నటీనటులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సమ్మర్లో థియేటర్స్‌కి వచ్చి ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకులందరికీ మరోసారి థ్యాంక్యూ సో మచ్ అని అన్నారు.
Also Read- Jr NTR: ఎన్టీఆర్ బర్త్‌డే.. ఊహించని ట్రీట్ రెడీ చేసిన హృతిక్! ఎన్టీఆర్ స్పందనిదే!
హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ.. మూడేళ్ల క్రితం ఈ కథని డైరెక్టర్ కార్తీక్ రాజు నాకు చెప్పారు. అంతకుముందు ఈ కథని ఒక 15 మంది రిజెక్ట్ చేశారని తెలిసింది. రిజెక్ట్ చేసిన వాళ్లందరికీ థాంక్యూ. సినిమాని చాలా కసిగా చేశాం. నా కసిలో పాలుపంచుకున్న వెన్నెల కిషోర్‌కి థాంక్యూ. నిర్మాతలందరూ సినిమా బిగినింగ్ నుంచి చాలా సపోర్ట్ చేశారు. మంచి టీమ్‌తో చేస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ కొడితే బావుంటుందని అనుకున్నాను, అది జరిగింది. దేవుడున్నాడు. హానెస్ట్‌గా, సిన్సియర్‌గా ఏది చేసినా దేవుడు మనకి ఇచ్చేస్తాడు. ఈ సినిమా విజయం, మెగా ప్రొడ్యూసర్ అరవింద్‌తో జర్నీ చాలా ఎంజాయ్ చేశాను. మా టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. చాలా సంవత్సరాల తర్వాత ఇంత మంచి, ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిన ప్రేక్షకులకు చాలా చాలా ధన్యవాదాలు. కేతిక, ఇవానా.. వాళ్ల పాత్రలకి లైఫ్ తీసుకొచ్చారు. వాళ్ళు చాలా మంచి మంచి సినిమాలు చేసి ఇంకా పెద్ద పెద్ద హిట్లు కొట్టాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాని జనం చూస్తూనే ఉంటారు. సింగిల్‌ను చాలా రోజులు ఎంజాయ్ చేస్తారు. ముందు చెప్పినట్లు కేవలం నవ్వుకోవడానికే తీసిన సినిమా ఇది. ప్రేక్షకులంతా థియేటర్స్ కొచ్చి ఇంతలా నవ్వుకోవడం చాలా హ్యాపీగా ఉందని అన్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు