Hrithik and NTR in War 2
ఎంటర్‌టైన్మెంట్

Jr NTR: ఎన్టీఆర్ బర్త్‌డే.. ఊహించని ట్రీట్ రెడీ చేసిన హృతిక్! ఎన్టీఆర్ స్పందనిదే!

Jr NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా దూసుకెళుతున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఆయనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిన విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత, ఆయన చేస్తున్న ప్రతి సినిమా పాన్ ఇండియా సినిమాగానే విడుదల అవుతుంది. ఇదే టైమ్ అనుకున్న తారక్ ఇంకో అడుగు ముందుకేసి డైరెక్ట్ బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇస్తున్న విషయం తెలిసిందే. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) స్పై యూనివర్స్ నుంచి వచ్చే చిత్రాలకు ప్రత్యేకంగా అభిమానులున్నారు. ఇప్పుడీ స్పై యూనివర్స్‌లో భాగంగా ‘వార్ 2’లో కబీర్ పాత్రతో తిరిగి బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ ఆడియెన్స్ ముందుకు రాబోతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాతోనే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. అంటే, హృతిక్ రోషన్‌ (Hrithik Roshan)ని తారక్ ఢీ కొట్టబోతున్నాడన్నమాట.

Also Read- Hari Hara Veera Mallu: అధికారిక ప్రకటన వచ్చేసింది.. ఇక సర్దుకోండమ్మా!

ఇక మే 20 ఎన్టీఆర్ బర్త్‌డే. ఈ పుట్టినరోజును పురస్కరించుకుని ‘వార్ 2’ (War 2) టీమ్ ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్లుగా గత వారం రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అదే విషయాన్ని బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కూడా కన్ఫర్మ్ చేశారు. ఈ మేరకు హృతిక్ రోషన్ ఓ సర్‌ప్రైజ్ పోస్ట్‌లో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ని హ్యాపీ చేశారు. ‘హే తారక్, ఈ సంవత్సరం మే 20న ఏం అప్‌డేట్ రాబోతోందో? అసలు ఏం జరగబోతోందో నీకు తెలుసా? నువ్వస్సలు ఊహించలేవు.. మీరంతా సిద్ధంగా ఉన్నారా?’ అంటూ ఒక్కసారిగా ‘వార్ 2’ సినిమాపై హృతిక్ అంచనాలను పెంచేశారు. ఆయన ఈ పోస్ట్ చేశాడో, లేదో.. పోస్ట్‌తో పాటు, వార్ 2 యాష్ ట్యాగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అసలు ఎన్టీఆర్ అభిమానులను కంట్రోల్ చేయలేనంతగా, సోషల్ మీడియా అంతా రచ్చ రచ్చ చేస్తున్నారు.

Also Read- Anasuya: పెళ్లికాకపోయి ఉంటే.. ఆ స్టార్ హీరోతో డేటింగ్ చేసేదాన్ని!

ఇక హృతిక్ పోస్ట్‌కు తారక్ స్పందిస్తూ.. ‘హృతిక్ సార్ మీకు కూడా ముందస్తుగా ధన్యవాదాలు. కబీర్.. నిన్ను వేటాడి నీకు స్పెషల్ రిటన్ గిఫ్ట్ ఇచ్చేందుకు వేచి చూస్తున్నా’ అని పోస్ట్ చేశారు. నిజంగా ఏం జరగబోతుందో తెలియదు కానీ, హృతిక్ నుంచి ఇలాంటి పోస్ట్ ఒకటి వస్తుందని మాత్రం ఫ్యాన్స్ కూడా ఊహించలేదు. ఈ పోస్ట్‌తో బాలీవుడ్‌లో ఎన్టీఆర్ బాండింగ్ ఏంటనేది తెలుస్తుందని, హృతిక్‌పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ ‘వార్ 2’పై ఇప్పటికే వరల్డ్ వైడ్‌గా క్రేజ్ నెలకొన్న విషయం తెలిసిందే. ఇండియన్ సూపర్ స్టార్లైన హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌లను ఒకే చిత్రంలో నటిస్తుండటంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాపై ఎక్కడాలేని హైప్ ఏర్పడింది. ఈ చిత్రం 14 ఆగస్టు, 2025న హిందీ, తెలుగు, తమిళ భాషలలో విడుదల కానుంది. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా ‘ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై, వార్, పఠాన్, టైగర్ 3’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు రాగా, ఇప్పుడు రాబోయే ‘వార్ 2’ అనేది ఈ స్పై యూనివర్స్‌లో ఆరో చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!