Manchu Vishnu in Kannappa
ఎంటర్‌టైన్మెంట్

Kannappa: ‘కన్నప్ప’ కామిక్ బుక్ ఫైనల్ చాప్టర్.. ‘శివయ్యా’ అని విష్ణు ఎందుకు పిలిచాడంటే?

Kannappa: విష్ణు మంచు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘కన్నప్ప’. ఇప్పటికే రెండు మూడు రిలీజ్ డేట్‌లను ప్రకటించి, చివరి నిమిషంలో వాయిదా వేస్తూ వస్తున్న ఈ సినిమాను జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నట్లుగా మేకర్స్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. విడుదలకు చాలా సమయం ఉండటంతో మేకర్స్ ఇప్పటికే ప్రమోషనల్ కార్యక్రమాలను ఉవ్వెత్తున కొనసాగిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్‌లు, పాటలు సినిమాపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. కేవలం ఇండియాలోనే కాకుండా, యూఎస్‌లోకూడా విష్ణు మంచు స్టార్ట్ చేసిన కన్నప్ప ప్రమోషనల్ టూర్‌లు అందరినీ ఈ సినిమావైపు చూసేలా చేస్తున్నాయి. ప్రమోషన్స్‌ని కూడా వెరైటీగా నిర్వహిస్తూ వస్తోంది ‘కన్నప్ప’ టీమ్.

Also Read- Jr NTR: ఎన్టీఆర్ బర్త్‌డే.. ఊహించని ట్రీట్ రెడీ చేసిన హృతిక్! ఎన్టీఆర్ స్పందనిదే!

ఇక ‘కన్నప్ప’ కథను అందరికీ తెలియాలనే ఉద్దేశంతో.. ముందుగానే కామిక్ బుక్స్ రూపంలో విష్ణు మంచు తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కామిక్ సిరీస్‌లోని మొదటి రెండు ఎపిసోడ్‌లు మంచి స్పందనను రాబట్టుకోగా, తాజాగా మేకర్స్ మూడో అధ్యాయాన్ని (Kannappa Animated Comic Book Episode 3) విడుదల చేశారు. ఈ చివరి ఎపిసోడ్‌ను గమనిస్తే.. తిన్నడు భావోద్వేగ, ఆధ్యాత్మిక పరివర్తనను తెలియజేస్తుంది. అతను ఒకప్పుడు దైవత్వపు ఆలోచనను తిరస్కరిస్తాడు.. కానీ చివరికి శివుని భక్తుడిగా మారతాడు. కన్నప్పగా మారడానికి అతని అద్భుతమైన ప్రయాణాన్ని ఈ మూడో అధ్యాయంలో కళ్లకు కట్టినట్లుగా చూపించారు. భక్తి, ప్రేమ, త్యాగం, విధితో నిండిన ఈ కథ అందరినీ ఆకర్షిస్తోంది. మరీ ముఖ్యంగా ‘కన్నప్ప’ అనగానే మంచు విష్ణు చెబుతున్న ‘శివయ్యా’ డైలాగ్ బాగా హైలెట్ అవుతుంది. ఆ డైలాగ్ వెనుక ఉన్న కారణాన్ని ఈ అధ్యాయంలో చూపించారు.

Also Read- Hari Hara Veera Mallu: అధికారిక ప్రకటన వచ్చేసింది.. ఇక సర్దుకోండమ్మా!

ప్రస్తుతం ఈ మూడో అధ్యాయానికి సంబంధించిన వీడియో సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది. ఏఐ ద్వారా క్రియేట్ చేసిన ఇందులోని విజువల్స్, వీడియో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయంటే అతిశయోక్తి కానే కాదు. ఇందులో ఏవైతే ప్రేక్షకులను మెప్పిస్తున్నాయో.. సినిమాలో ఇంతకు మించి విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయని టీమ్ నమ్మకంగా చెబుతోంది. విజువల్ ఎఫెక్ట్స్‌ జాప్యం వల్లే ఈ మూవీని జూన్ 27కి వాయిదా వేసినట్లుగా మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయంలో మంచు విష్ణు ఎంతో కేరింగ్‌గా చూసుకుంటున్నారు. ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కావడం లేదు. కచ్చితంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయఢంకా మోగిస్తుందని టీమ్ అంతా ఎంతో నమ్మకంగా ఉంది. త్వరలోనే ఈ చిత్ర ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేయనున్నారు.

శివయ్యగా అక్షయ్ కుమార్, పార్వతీ మాతగా కాజల్ అగర్వాల్‌, రుద్రుడిగా ప్రభాస్‌, మహదేవ శాస్త్రిగా మోహన్ బాబు వంటి దిగ్గజాలు నటిస్తున్న ఈ సినిమాను ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మిస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!