Spirit Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. మొదట ఈ చిత్రంలో దీపికా పదుకొనే కథానాయికగా ఎంపికవగా.. కొన్ని వారాల్లోనే ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. పారితోషికం, వర్కింగ్ అవర్స్ విషయంలో దర్శకుడితో అభిప్రాయ భేదాలు ఏర్పడటమే ఇందుకు కారణమని సమాచారం. ఆ తరువాత దీపికా స్థానంలో త్రిప్తి దిమ్రీకి అవకాశమిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ‘కింగ్డమ్’ సినిమా ప్రమోషన్ లో భాగంగా సితార ఎంటర్టైన్‌మెంట్స్ యూ ట్యూబ్ ఛానల్‌లో ఓ పాడ్‌కాస్ట్ నిర్వహించారు. విజయ్ దేవరకొండ, దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో ముచ్చటించిన సందీప్ రెడ్డి వంగా.. స్పిరిట్ గురించి చెప్పారు. ‘స్పిరిట్’ షూటింగ్ సెప్టెంబర్ నుంచి మొదలవుతుందన్నారు. ఆ తరువాత సినిమా పూర్తయ్యే వరకు నిరంతరంగా షెడ్యూల్స్ జరగనున్నాయని తెలిపారు.
Read also- SAR Data Crop: అగ్రికల్చర్ యూనివర్సిటీ అధికారుల ప్రతిపాదనలు.. మంత్రి తుమ్మలతో భేటీ
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న స్పిరిట్ సినిమాకు తొలుత బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోణెను కథానాయికగా తీసుకోవాలని నిర్ణయించారు. అయితే సినిమా ప్రారంభానికి ముందే కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. అందులో ముఖ్యంగా పారితోషికం విషయంలో అభిప్రాయ భేదాలు, వర్కింగ్ అవర్స్‌పై పరిమితులు ఉన్నాయని సమాచారం. దీపికా తన పారితోషకం పెరిగినట్టు, తాను కోరిన షరతులు భారీ ప్రాజెక్ట్‌కు సెట్ కాకపోవడంతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, నిర్మాతలు ఆమెను ఈ ప్రాజెక్టు నుంచి తొలగించారు. దీని వల్ల ఇద్దరి నుంచీ స్వల్ప అసంతృప్తి నెలకొన్నప్పటికీ, ఎవరూ బహిరంగంగా కామెంట్ చేయలేదు. చివరికి దీపికా స్థానంలో ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి దిమ్రీను స్పిరిట్ సినిమాకు హీరోయిన్ గా ఎంపిక చేశారు.
Read also- Sangareddy Tragic: సంగారెడ్డి జిల్లాలో హృదయవిదారక ఘటన.. పసికందు మృతి
ఈ సినిమా మ్యూజిక్‌ను హర్షవర్ధన్ రమేశ్వర్ అందించగా.. ఇప్పటికే మ్యూజిక్ వర్క్ పూర్తి చేసుకున్నట్టు సమాచారం. భారీ స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రం పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాపై అఫిషియల్ అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ ‘ది రాజాసాబ్’ సినిమాలో నటిస్తున్నారు. అది పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని సమాచారం. ‘యానిమల్’ హిట్ లో ఉన్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, ‘కల్కీ’ హిట్ లో ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్ లో వారి సత్తా చూపించారు కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.