Cheekatilo Trailer: శోభిత ధూళిపాళ్ల ‘చీకటిలో’ ట్రైలర్ వచ్చేసింది..
chikatilo-trailer
ఎంటర్‌టైన్‌మెంట్

Cheekatilo Trailer: శోభిత ధూళిపాళ్ల ‘చీకటిలో’ సినిమా ట్రైలర్ వచ్చింది చూశారా?

Cheekatilo Trailer: శోభిత ధూళిపాళ్ల (Sobhita Dhulipala) ప్రధాన పాత్రలో ‘చీకటిలో’ (Cheekatilo)అనే సినిమా జనవరి 23, 2026 నుంచి అమెజాన్ ప్రైమ్ లో విడుదల అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా కు సంబంధించి ట్రైలర్ ను విడుదల చేశారు. హైదరాబాద్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న క్రైమ్ సస్పెన్స్ ఫిల్మ్. సంధ్య అనే ట్రూ క్రైమ్ పాడ్కాస్టర్ చుట్టూ తిరిగే ఈ సినిమా కథలో సంధ్యగా శోభిత ధూళిపాళ్ల నటించారు. ఆమె ఇప్పటికే తెలుగుతో పాటు కొన్ని బాలీవుడ్, కోలీవుడ్ సినిమాలలో నటించిన విషయం తెలిసిందే. నటిగానే నాగ చైతన్యకు ఆమె పరిచయమైంది. ఆ తర్వాత వారి మధ్య ప్రేమ పుట్టడం, అది పెళ్లి వరకు వెళ్లడం జరిగింది. లాస్ట్ ఇయర్ వీరిద్దరూ పెళ్లి చేసుకుని న్యూ లైఫ్ స్టార్ట్ చేశారు. పెళ్లి తర్వాత కూడా శోభిత ధూళిపాళ్ల నటిస్తూనే ఉంది. ఇప్పుడామె నటించిన ఈ ‘చీకటిలో’ చిత్రం జనవరి 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Read also-RajaSaab Collections: ప్రభాస్‘ది రాజాసాబ్’ మూడురోజుల గ్రాస్ కలెక్షన్లు ఎంతంటే?..

సంధ్య పాత్రలో శోభిత..

అయితే శోభిత ధూళిపాళ్ల  నటించిన ‘చీకటిలో’ చిత్రం థియేటర్లలోకి రావడం లేదు. డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల కాబోతోంది. ప్రైమ్ వీడియో ఒరిజినల్ తెలుగు సినిమాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం జనవరి 23న ప్రీమియర్ కాబోతున్నట్లుగా ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇందులో సంధ్య పాత్రలో శోభిత ధూళిపాల.. నగరములో జరిగే కొన్ని దారుణమైన చీకటి రహస్యాలను వెలికితీస్తుంది. అవేంటో తెలియాలంటే మాత్రం జనవరి 23 వరకు వెయిట్ చేయాల్సిందే. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ ప్రై. లి. బ్యానర్‌పై డి. సురేష్ బాబు నిర్మించారు. చంద్ర పెమ్మరాజు రచనా సహకారం అందించారు. శోభిత ధూళిపాలతో పాటు విశ్వదేవ్ రాచకొండ ఇందులో మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. చైతన్య, విశాలక్ష్మి, ఈషా చావ్లా, ఝాన్సీ, ఆమని, వడ్లమాని శ్రీనివాస్ వంటి వారు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇందులో సంధ్య అనే ట్రూ క్రైమ్ పాడ్కాస్టర్, తన వద్ద శిక్షణ పొందుతున్న వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందడంతో.. అతని మృతికి న్యాయం చేయాలని అలుపెరగని ప్రయత్నము చేసే క్రమంలో.. దారుణమైన నేరాల గురించి కనిపెడుతుంది. ఇదే మెయిన్ ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్ అని ప్రైమ్ టీమ్ తెలుపుతోంది.

Read also-MSG Movie Review: సంక్రాంతికి వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ ప్రేక్షకులను నవ్వించారా?.. ఫుల్ రివ్యూ..

Just In

01

Theatre Tragedy: మెగాస్టార్ సినిమా చూస్తూ కుప్పకూలిన రిటైర్డ్ ఏఎస్ఐ.. ఏం జరిగిందంటే?

Veerabhadra Swamy Temple: కొత్తకొండ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలకు పూర్తయిన ఏర్పాట్లు.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు!

Case filed On Tv Channel: మహిళా ఐఏఎస్‌పై ఆరోపణల వ్యవహారంలో కీలక పరిణామం.. ఓ ఛానల్, ట్విట్టర్ పేజీపై ఎఫ్ఐఆర్!

Huzurabad: విద్యార్థులు స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకోవాలి : ఏబీవీపీ నేత గోస్కుల అజయ్!

Chiranjeevi Comeback: మెగాస్టార్ సినిమా చూసి ఎమోషనల్ అవుతున్న సీనియర్ ఫ్యాన్స్.. ఏం చేశారంటే?