Sita Ramam 2: టాలీవుడ్ లో ఇటీవల విడుదలైన సినిమాల్లో ‘సీతారామం’ ఇక క్లాసిక్ అనే చెప్పాలి. దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ క్లాసిక్ హిట్ సాధించింది. తాజాగా ఈ సినిమాకు సీక్వల్ రాబోతుందనే వార్తలు సినీ వర్గాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. దీనికి కారణం దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ కలిసి ఉన్న ఫోటోలు. ఈ ఫోటోలో వీరిద్దరూ గొడుగు పట్టుకుని కనిపిస్తున్నారు. ఇది చూసిన అభిమానులు ‘సీతారామం 2’ రాబోతోందని, రామ్ మళ్ళీ తిరిగి వస్తున్నాడని చర్చించుకోవడం మొదలుపెట్టారు. అయితే ఈ ఫోటోలు ఎక్కడి నుంచి వచ్చాయో దేని కోసమో అని విషయాలు తెలియాల్సి ఉంది. సీతారామం లాంటి మంచి సినిమా కు సీక్వల్ వస్తుందంటే మూవీ అభిమానులు పండగే. మరి ఈ ఫటోలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియాల్సి ఉంది.
Read also-David Reddy: మంచు మనోజ్ లుక్‌ను ఇలా ట్రోల్ చేస్తున్నారేంట్రా.. కాస్త చూసుకోబడలా?
అసలు విషయం ఏమిటంటే..
ప్రస్తుతానికి ‘సీతారామం’ చిత్రానికి సీక్వెల్ వచ్చే అవకాశం లేదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. వైరల్ అవుతున్న ఆ ఫోటో ఒక యాడ్ షూట్ (Commercial Ad) లేదా ఒక కొత్త ప్రాజెక్ట్‌కి సంబంధించినది కావచ్చని సమాచారం. సీతారామం చిత్రాన్ని నిర్మించిన వైజయంతీ మూవీస్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా వస్తున్న ‘ఫౌజీ’ (Fauzi) సినిమాపై దృష్టి సారించింది. ఈ సినిమాను కూడా సీతారామం దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్నారు. గతంలో పలు ఇంటర్వ్యూలలో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. ‘సీతారామం’ ఒక క్లాసిక్ అని, దానికి సీక్వెల్ తీసి ఆ మ్యాజిక్‌ను చెడగొట్టకూడదని అభిప్రాయపడ్డారు. మృణాల్ ఠాకూర్ కూడా సీక్వెల్ గురించి తనకు ఇంకా ఎలాంటి సమాచారం లేదని, కానీ అవకాశం వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ప్రస్తుతానికి ‘సీతారామం 2’ గురించి అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. వైరల్ అవుతున్న ఫోటో వీరిద్దరూ మళ్ళీ కలిసి ఏదైనా బ్రాండ్ కోసం నటించినది అయి ఉండొచ్చు. అయితే ఈ హిట్ జోడీ మళ్ళీ వెండితెరపై ఎప్పుడు కనిపిస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read also-Gunasekhar: జూనియర్ ఎన్టీఆర్‌ను ఘోరంగా తిట్టిన స్టార్ దర్శకుడు.. ఎందుకంటే?
దుల్కర్ సల్మాన్ మరియు మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘సీతారామం’ ఒక అందమైన దృశ్య కావ్యం. 2022లో విడుదలైన ఈ సినిమా క్లాసిక్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. ఈ కథ 1960ల కాలంలో సాగుతుంది. అనాథ అయిన లెఫ్టినెంట్ రామ్ అనే సైనికుడికి, దేశం నలుమూలల నుండి తెలియని వ్యక్తులు ఉత్తరాలు రాస్తుంటారు. ఆ క్రమంలో ‘సీతా మహాలక్ష్మి’ అనే అమ్మాయి నుండి అతనికి ఒక ఉత్తరం వస్తుంది. ఆ ఉత్తరం వెనుక ఉన్న మనిషిని వెతుక్కుంటూ రామ్ వెళ్లడం, వారి మధ్య చిగురించిన ప్రేమ.. చివరకు అది ఎలాంటి మలుపులు తిరిగింది అనేది ఈ సినిమా కథ.

