David Reddy: మంచు మనోజ్ ప్రధాన పాత్రలో హనుమ రెడ్డి యక్కంటి దర్శత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం డేవిడ్ రెడ్డి. ఇటీవలే ఆ సినిమా నుంచి ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. అయితే ఈ లుక్ చూడటానికి సంపూర్ణేష్ బాబు హీరో గా వచ్చిన హృదయ కాలేయం సినిమా లోని విలన్ పాత్రతో పోలుస్తున్నారు. ఈ రెండ్ పోస్టర్లు ఒకే లా ఉండటంతో ఈ చర్చ రెడ్డిట్ లో తెరపైకి వచ్చింది. దీనిని చూసిన నెటిజన్లు కామెడీగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే మరి కొందుకు మనోజ్ లుక్ ఏఐ తో చేసిందని, లుక్ కూడా మనోజ్ కు అంతగా సెట్ కాలేదని తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. మంచు మనోజ్ ‘మిరాయ్’ తర్వాత మంచి ఫామ్ లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ‘డేవిడ్ రెడ్డి’ (David Reddy). ఈ సినిమాను వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్, ట్రూ రాడిక్స్ బ్యానర్స్‌పై వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి నిర్మిస్తున్నారు. డైరెక్టర్ (Hanuma Reddy Yakkanti) ఈ చిత్రానికి దర్శకుడు. బ్రిటీష్ కాలం నాటి బ్యాక్ డ్రాప్‌తో ఇంటెన్స్ యాక్షన్ డ్రామా కథతో భారీ పాన్ ఇండియా చిత్రంగా ‘డేవిడ్ రెడ్డి’ సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో మారియా ర్యబోషప్క (Maria Ryaboshapka) హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడలో ఈ సినిమా రూపొందుతోంది.
Read also-Gunasekhar: జూనియర్ ఎన్టీఆర్‌ను ఘోరంగా తిట్టిన స్టార్ దర్శకుడు.. ఎందుకంటే?
ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు మంచు మనోజ్ డేవిడ్ రెడ్డి ఏ రేంజ్ లో ఉండబోతుందో.. గ్లింప్స్ ద్వారా చెప్పేశారు. ఎప్పుడూ లేని విధంగా మంచు మనోజ్ పవర్ ఫుల్ లుక్ లో కనిపిస్తున్నారు. అయితే రెడ్డిట్ లో చర్చకు దారి తీసిన ఈ అంశం ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సంపూర్ణేష్ బాబు సినిమాలో విలన్ తో పోల్చినందుకు మనోజ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మరి దీనిపై సినిమా టీం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.
Read also-Hey Bhagavan Teaser: సుహాస్ ‘హే భగవాన్’ టీజర్ వచ్చేసింది.. కామెడీ అదుర్స్.. ఓ లుక్కేయండి

