Siddu Jonnalagadda: తెలుసు కదా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సిద్ధు జొన్నల గడ్డ రిలీజ్ అనంతరం ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో సినిమా గురించి మాట్లాడుతూ ఎందుకు సెకండాప్లో స్టోరీ డిప్ అవుతుందో చెప్పుకొచ్చారు. అంతే కాకుండా ఇంటర్వెల్ తర్వాత సినిమాలో జరిగే పరిణామాల గురించి కూడా చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ.. సినిమాలకు ఇంటర్వెల్ అవసరమే లేదని దానికి ఉదాహరణగా.. హాలీవుడ్ సినిమాలను చూడండి అందులో ఇంటర్వెల్ ఉండదు. మనకు ఇక్కడ, పాప్ కార్న్ సమోసాలు అమ్ముకోవడానికి చేసిన పంచాయితీ అంటూ మండి పడ్డారు. ఈ ఇంటర్వెల్ పెట్టడం వల్ల సినిమా క్వాలిటీ తగ్గిపోతుందని.. ఎందుకు అంటే సినిమా ఇంటర్వెల్ లో ప్రేక్షకుడు అదిరిపోయే ట్విస్ట్ కోసం ఎదురు చూస్తాడు కాబట్టి అప్పుడు హైప్ చేస్తాం సినిమాను కానీ ఇంటర్వెల్ తర్వాత అదే హైప్ కొనసాగదు మళ్లీ స్టోరీలోకి రావాలి అప్పుడు సినిమా డిప్ అయినట్లు కనిపిస్తుంది. అంటూ చెప్పుకొచ్చారు.
Read also-Upasana Konidela: మెగా కోడలు దివాళి సెలబ్రేషన్స్ చూశారా.. థీమ్ అదిరింది గురూ..
అంతే కాకుండా ఇదే సందర్భంలో ఏం చెయ్యాల్లో ఇంటస్ట్రీకి చెందిన పెద్ద రైటర్ హిత బోధ చేశారని అప్పటి నుంచి ఆయన చేప్పిన పనే చేస్తున్నానని అన్నారు. ఇంతకూ ఆయన ఏం అన్నారంటే.. ఏ సినిమా అయినా సెకండాఫ్ లో ఖచ్చితంగా డిప్ అవుతుంది. అది అవ్వాల్సిందే.. అంటూ అయన చెప్పిన మాటలు బాగా నచ్చాయని, వారానికి ఒక సారి ఆయన దగ్గరకు వెళ్లి వస్తే ఏం ఉండదని చెప్పుకొచ్చారు. సెకండాప్ లో సినిమా పడిపోవడం సహజమే అయినా అది ఎక్కడ పడుతుందో తెలుసుకుంటే సరిపోద్ది అని చెప్పారన్నారు. అయినా కాలిక్యులేటెడ్ గా ఫస్ట్ హాఫ్ లో.. సెకండ్ హాఫ్ లో పెట్టాల్సింది అంతా పెట్టాము కాకపోతే జనాలు ఆ ట్రాన్స్ లో ఉండిపోయారు. ఇంటర్వెల్ తర్వాత ఖచ్చితంగా సినిమా పడుతుంది కావలిస్తే ఏ సినిమా అయినా చూసుకోండి అంటూ బదులిచ్చారు.
Read also-Bandla Ganesh: తేజ సజ్జాపై షాకింగ్ కామెంట్స్ చేసిన బండ్లగణేష్.. అది నిజమేనా..
సినిమా గురించి మాట్లాడితే.. వరుణ్ (సిద్ధు జొన్నలగడ్డ) ఒక షెఫ్. అతని జీవితం పూర్తిగా ఆర్డర్‌తో నడుస్తుంది. ప్రొఫెషనల్‌గా మాత్రమే కాక, పర్సనల్ లైఫ్‌లో కూడా. మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా అతను అంజలి (రాశీ ఖన్నా)ని కలుస్తాడు, ఆమెను వివాహం చేసుకుంటాడు. కానీ, వారి జీవితంలో ఒక తీవ్రమైన ట్విస్ట్ వస్తుంది. అంజలి తల్లి అవ్వలేనని తెలుస్తుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి అతను రాగా (శ్రీనిధి శెట్టి) అనే డాక్టర్‌ని సంప్రదిస్తాడు. సరోగసీ ఆప్షన్‌ను ఎంచుకున్నప్పటికీ, ఈ నిర్ణయం వరుణ్ మనసులో కొత్త గందరగోళాలను సృష్టిస్తుంది. వరుణ్ రాగాతో గతంలో ఒక సంబంధం ఉండటం వల్ల, ముగ్గురి మధ్య సంబంధాలు మరింత సంక్లిష్టమవుతాయి. మరింత తెలుసుకోవాలి అంటే సినిమా చూడండి.
