Upasana Konidela: దీపావళి సందర్భంగా కొణెదల వారి కోడలు చేసిన పనికి సర్వత్రా హర్షధ్వానాలు వినిపిస్తున్నాయి. పండుగ సందర్భంగా అందరినీ సమానంగా చూడాలి అనే ఉద్ధేశంతో జండర్ ఈక్వాలిటీ అనే థీమ్ తో పండుగ మొదలు పెట్టారు ఆమె. ఎప్పుడూ సమాజ సేవ శ్రేయస్సు కోరుకునే కలవారి కోడలు ఈ సారి సమాజంలో వివక్షకు గురయ్యే ట్రాన్స్ జండర్లకు స్వీట్లు పంచుతూ ఈ దీపావళిని వారితో ప్రారంభించారు. దీంతో మరో సారి తన ఉదారత్వం చూపించుకున్నారు ఉపాసన. ఇప్పటికే సమాజాన్ని మేల్కొల్పుతూ ఆమె చేసిన వీడియోలు ఎందరికో మార్గదర్శకమయ్యాయి. అలాంటిదే ఈ దీపావళి పండగ సందర్భంగా ట్రాన్స్ జండర్లు ఎదుర్కొంటున్న పరిస్థితులను అద్దం పడుతూ ఆమె షేర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Read also-Bandla Ganesh: తేజ సజ్జాపై షాకింగ్ కామెంట్స్ చేసిన బండ్లగణేష్.. అది నిజమేనా..
ఆ వీడియోలో.. ఉపానస మాట్లాడుతూ.. అందరికీ వైద్యం అందించాలి. ఎవ్వరి మీదా వివక్ష ఉండకూడదు. అంటూ తాత చెప్పారు. అని అన్నారు. ఇదే వీడియోలో ట్రాన్స్ జండర్ త్రిపాఠి మాట్లాడుతూ.. ‘ప్రస్తుత సమాజంలో ట్రాన్స్ జెండర్లని ఎందుకు అంత తక్కువగా చూస్తున్నారో అర్థం కావడం లేదు. మాది అందరి లాగే ఒక ఉన్నతమైన పుట్టుక. మాకు అందరిలా ఆరోగ్య అవసరాలు ఉంటాయి. 2014లో మేము దేశంలో చట్టబద్ధులం అయ్యాము. కానీ ఇంకా డాక్టర్లు మమ్మల్ని తాకడానికి, స్టెతస్కోప్ పెట్టడానికి వెనకాడుతున్నారు, వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. మాకు అందరికీ ఉండేలా బీపీ, డయాబెటిస్, థైరాయిడ్ వంటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. భావోద్వేగాలు సైతం ఉంటాయి.’ అని ట్రాన్స్ ఉమెన్ చెప్పుకొచ్చారు.
Read also-Akhanda 2: ఆ సినిమాల సక్సెస్‌తో ‘అఖండ 2’పై క్రేజ్ తగ్గుతుందా?
దీనిపై ఉపాసన మరింత మాట్లాడుతూ.. ‘మనకు ఇతరులపై గౌరవం మొదలైనప్పుడు మనపై గౌరవం మొదలవుతుంది. అదే నిజమైన దేవుని పూజ. ఇది సనాతన ధర్మానికి నిజమైన అందం. అది ఎవరిని తేడాగా చూడకుండా అందరినీ సమానంగా చూస్తుంది. ఇదే కాదు పురాణాల్లో శ్రీమహావిష్ణువు మోహిని రూపం ధరించాడు. శివుడు, పార్వతి ఇద్దరు కలిసి అర్ధనారీశ్వర స్వరూపంగా మారారు. వీరిని ప్రజలు పూజిస్తున్నారు. కానీ మమ్మల్ని గడ్డి పరక పరేసినట్టుగా చూస్తారని భావోద్వేగబరితమయ్యారు. హెల్త్ కేర్ అందరికీ అందుబాటులో ఉండాలి ఎవరిని వదలకూడదని మా తాతయ్య ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు. ప్రతి మనిషిని, మనసుని, చుట్టూ ఉన్నవారిని గౌరవించాలి. ఇలా చేసినప్పుడే లక్ష్మీదేవి స్వయంగా మనలో ప్రవేశిస్తారు.’ అంటూ ఉపాసన చెప్పుకొచ్చారు. దీనిని చూసిన మెగా అభిమానులు ఆమెను ప్రశంసిస్తున్నారు.
Respect is our greatest Dhan – wealth
May we always give & receive it to all equally with dignity & grace.#HappyDhanteras #HappyDiwali @ApolloFND @HospitalsApollo pic.twitter.com/KahoYhnU7j— Upasana Konidela (@upasanakonidela) October 18, 2025
