Shruti Haasan: సౌత్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్స్ లో శ్రుతి హాసన్ (Shruti Haasan) ఒకరు. పలు సూపర్ హిట్ చిత్రాలతో ఆమె తెలుగు ప్రేక్షకులను అలరించారు. ప్రభాస్ సూపర్ హిట్ చిత్రం సలార్ లోనూ నటించి ఆమె ఆకట్టుకున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆమె రజనీకాంత్ (Rajinikanth) నటిస్తున్న కూలీ (Coolie)చిత్రంలో చేస్తున్నారు. సూపర్ స్టార్ తో మూవీ నటించడం ఇదే ఆమెకు తొలిసారి. ఈ నేపథ్యంలో రజనీతో షూటింగ్ అనుభవాలను ఆమె పంచుకున్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
శృతి ఏమన్నదంటే?
ప్రముఖ యూట్యూబర్ అల్లాబాడియా పాడ్ కాస్ట్ (Ranveer Allahbadia podcast షోకు నటి శృతి హాసన్ హజరైంది. ఈ క్రమంలో కూలీ ప్రాజెక్ట్ లో రజనీకాంత్ తో పని అనుభవం ఎలా ఉందన్న ప్రశ్న ఆమెకు ఎదురైంది. దీనికి శృతి ఇంట్రస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు. తన తండ్రి (కమల్ హాసన్), రజనీకాంత్ ఇద్దరూ తమిళ ఇండస్ట్రీకి మూల స్థంభాల వంటి వారని శృతి అన్నారు. స్టార్ హీరో కూతురిగా ఇన్నాళ్లు రజనీకాంత్ ను తన నాన్న (Kamal Haasan) దృష్ణికోణం నుంచే చూసినట్లు చెప్పారు. అయితే కూలీ సినిమాతో తొలిసారి ఆయనతో వర్క్ చేస్తున్నప్పుడు పూర్తిగా తెలుసుకోగలిగినట్లు చెప్పారు. ‘రజనీ.. ఎన్నో విభిన్న లక్షణాల మిశ్రమం. చాలా చురుకైనవారు. ప్రతి ఒక్కరితో మనస్ఫూర్తిగా మాట్లాడతారు. తన చుట్టూ ఉండేవాళ్లు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. ఆయన సెట్ లో ఉన్నప్పుడు ఫుల్ జోష్ ను తీసుకువస్తారు. ఆయనతో కలిసి నటించే అవకాశం వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది’ అని శృతి పేర్కొంది.
పెళ్లి అంటే భయం…
జీవితంలో పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని శృతికి ప్రశ్న ఎదురుకాగా ఇందుకు ఆమె షాకింగ్ సమాధానం ఇచ్చారు. పెళ్లి అనే ఆలోచన అంటే తనకు చాలా భయమని ఆమె వ్యాఖ్యానించారు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించడం కోసం జీవితమంతా కష్టపడ్డానని.. ఆ గుర్తింపును ఓ కాగితం ముక్కతో ముడిపెట్టాలన్న ఆలోచన కూడా భయంకరంగా అనిపిస్తుందని అన్నారు. తన లైఫ్ లో ఒకసారి పెళ్లి దగ్గర వెళ్లానని.. కానీ అది ముడిపడలేదని అన్నారు. ఇద్దరు మనుషులు ఒక్కటి కావాలంటే వారి అభిప్రాయాలు కలవడం చాలా ముఖ్యమని అన్నారు. తన దృష్టిలో పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన విషయం కాదని.. జీవితకాలపు బాధ్యత అని ఆమె చెప్పుకొచ్చారు.
Also Read: Viral Video: ఓరి బాబోయ్.. ఫోన్ పోతే ఇంతగా గుండెలు బాదుకోవాలా.. వీడియో వైరల్!
కూలీ గురించి ఇవి తెలుసా?
శ్రుతి హాసన్ గత ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే ఆమె తెలుగులో వీరనరసింహారెడ్డి (Veera Simha Reddy), వాల్తేరు వీరయ్య Waltair Veerayya), హాయ్ నాన్న (Hi Nanna), సలార్ (Salaar: Part 1 – Ceasefire) వంటి చిత్రాల్లో చేశారు. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) రూపొందిస్తున్న కూలీతో పాటు జన నాయగన్, ట్రైయిన్ వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. రజనీ – శృతి నటిస్తున్న కూలీ విషయానికి వస్తే.. ఇందులో స్టార్ హీరోలు అమీర్ ఖాన్, నాగార్జున, ఉపేంద్ర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నటి పూజా హెగ్డే ప్రత్యేక గీతంతో అలరించనుంది.