Shraddha Srinath: శ్రద్ధా శ్రీనాథ్‌కు ఇప్పుడు అంతగా అవకాశాలు రావడం లేదు. తెలుగులో మంచి మంచి సినిమాలు చేసిన శ్రద్ధా శ్రీనాథ్‌కు, ఈ మధ్యకాలంలో సరైన హిట్ పడలేదు. వెంకటేష్‌తో చేసిన ‘సైంధవ్’ హిట్ పడితే, అమ్మడి దశ తిరిగేది కానీ, ఆ సినిమా భారీ డిజాస్టర్‌గా నిలిచింది. అప్పటి నుంచి ఈ భామకు అనుకున్నంతగా అయితే అవకాశాలు రావడం లేదు. దీంతో ఈ భామ ఇప్పుడు వెబ్ సిరీస్‌లపై దృష్టి పెట్టింది. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ గ్రిప్పింగ్ థ్రిల్లర్ విడుదల తేదీ వచ్చేసింది. ఈ సిరీస్ కనుక క్లిక్ అయితే.. మళ్లీ ఆమెకు వరుస అవకాశాలు వస్తాయని ఆమె కూడా ఆశపడుతోంది. మరి ఆమె ఆశలు ఎంత వరకు నిజమవుతాయో చూడాల్సి ఉంది. ఇక ఆమె నటించిన వెబ్ సిరీస్ వివరాల్లోకి వస్తే..
Also Read- Bathukamma Sarees: బతుకమ్మ చీరలు వచ్చేస్తున్నాయ్.. హైదరాబాద్‌లో ఎన్ని పంచుతారంటే?
‘బ్లాక్ వారంట్’ తర్వాత
శ్రద్ధా శ్రీనాథ్ (Shraddha Srinath) లీడ్ రోల్‌లో నెట్‌ఫ్లిక్స్ (Netflix), అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి చేసిన న్యూ గ్రిప్పింగ్ థ్రిల్లర్ ‘ది గేమ్: యూ నెవర్ ప్లే అలోన్’ (The Game: You Never Play Alone). నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ వెబ్ సిరీస్‌గా అక్టోబర్ 2న ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది. ‘బ్లాక్ వారంట్’ తర్వాత నెట్‌ఫ్లిక్స్, అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ కలయికలో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై భారీగానే అంచనాలున్నాయి. ఈ వెబ్ సిరీస్‌కు రాజేష్ ఎం. సెల్వా దర్శకుడు. సంతోష్ ప్రతాప్, చందినీ, శ్యామ హరిని, బాల హసన్, సుబాష్ సెల్వం, వివియా సంతోష్, ధీరజ్, హేమ ఇతర ముఖ్య పాత్రలలో కనిపించనున్న ఈ వెబ్ సిరీస్ స్ట్రాంగ్ స్టోరీ టెల్లింగ్‌తో పాటు, టైమ్‌లి థీమ్స్‌ని మిక్స్ చేస్తూ ఆడియన్స్‌కు డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వనుందని మేకర్స్ చెబుతున్నారు.
Also Read- Allu Arjun and Anushka: ‘పుష్ప’ యూనివర్స్‌లో ‘ఘాటి’ కూడా భాగమా?.. పుష్పరాజ్‌తో షీలావతి!
రియల్ వరల్డ్‌కి అద్దం పట్టేలా
ఈ సందర్భంగా నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్ మాట్లాడుతూ.. ‘ది గేమ్’ మా సంస్థలో ఈ ఏడాది వస్తున్న ఫస్ట్ తమిళ సిరీస్. ఈ వెబ్ సిరీస్‌తో సరికొత్త స్టోరీని తీసుకొస్తున్నాం. ఒక ఫీమేల్ గేమ్ డెవలపర్‌పై జరిగే కో-ఆర్డినేటెడ్ అటాక్ వెనక ఉన్న వాళ్లను ట్రాక్ చేసే నేపథ్యంలో.. ఆమె జర్నీని ఓ థ్రిల్లర్‌గా ప్రజెంట్ చేయబోతున్నాం. అప్లాజ్‌తో మా కలయికలో ఇప్పటికే ‘బ్లాక్ వారంట్’ వచ్చి మంచి ఆదరణను అందుకుంది. ఇప్పుడు ఈ సిరీస్ కూడా చాలా రెలివెంట్‌గా ఉంటుందని కాన్ఫిడెంట్‌గా చెబుతున్నామని అన్నారు. అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎండీ సమీర్ నాయర్ మాట్లాడుతూ.. ‘ది గేమ్’ అనేది డిజిటల్ యుగం రియాలిటీలను చూపించే టైమ్‌లి స్టోరీగా ఉంటుంది. రాజేష్ సెల్వా స్టైల్‌తో స్ట్రాంగ్ స్టోరీ టెల్లింగ్‌తో వస్తున్న ఈ సిరీస్ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతుందని ఆశిస్తున్నామని తెలిపారు. ‘ది గేమ్’ అనేది కేవలం థ్రిల్లర్ మాత్రమే కాదు, మనం ఉన్న రియల్ వరల్డ్‌కి అద్దం పట్టేలా ఉంటుంది. ఇది పీపుల్, వాళ్ల ఛాయిస్, బలహీనతలు, నిజం-అబద్ధం మధ్య సన్నని లైన్ గురించిన కథ. నెట్‌ఫ్లిక్స్, అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ కలయిక వలన మాకు క్రియేటివ్‌గా కొత్త ప్రయోగం చేసే లిబర్టీ దొరికిందని అన్నారు డైరెక్టర్ రాజేష్ ఎం. సెల్వా (Rajesh M Selva).
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు