Shiva Rajkumar: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global Star Ram Charan) హీరోగా బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘పెద్ది’ (Peddi). రీసెంట్‌గా రిలీజైన ఈ చిత్ర ఫస్ట్ షాట్, అందరినీ మెప్పించడమే కాకుండా రికార్డులను క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాలో కన్నడ స్టార్ యాక్టర్ రాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి రాజ్ కుమార్ ఓ కీలక అప్డేట్‌ను ఇచ్చారు. శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘45’. ఈ చిత్రాన్ని సూరజ్ ప్రొడక్షన్ బ్యానర్ పై శ్రీమతి. ఉమా రమేష్ రెడ్డి, ఎం రమేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడు అర్జున్ జన్యా ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు. ఈ చిత్ర టీజర్ లాంఛ్ కార్యక్రమం తాజాగా హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి శివరాజ్ కుమార్ కూడా హాజరయ్యారు.
Also Read- Vijayashanthi: పవన్ సతీమణి అన్నాపై ట్రోల్స్.. రాములమ్మ షాకింగ్ పోస్ట్
ఈ కార్యక్రమంలో హీరో శివరాజ్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘దర్శకుడు అర్జున్ జన్యా ‘45’ సినిమా కథను నాకు నాలుగు నుంచి ఐదు నిమిషాలు మాత్రమే చెప్పారు. కథ చెప్పాక అర్జున్ జన్యా మరో దర్శకుడికి ఎవరికైనా డైరెక్షన్ బాధ్యతలు ఇస్తానని అన్నాడు. కానీ, ఈ కథకు నువ్వు అయితేనే న్యాయం చేయగలవని చెప్పి అర్జున్‌ను ఒప్పించాను. ఈ చిత్రంలో ఉపేంద్రతో కలిసి నటించడం హ్యాపీ. అతను ఎంతో టాలెంటెడ్. సినిమానే లోకంగా అతను బతుకుతుంటాడు. నేను ఎన్నో విషయాలు ఉపేంద్ర నుంచి నేర్చుకున్నాను. రాజ్ బి శెట్టి ఈవెంట్‌కు రాలేకపోయారు. ‘45’ సినిమాలో నేను, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి ఎవరి పాత్రలదీ పైచేయి కాదు. కథే ఈ సినిమాకు మెయిన్ హీరో. కథే మెయిన్ స్కోర్ చేస్తుంది.
ఈ సినిమా డైరెక్టర్ అర్జున్‌కు మంచి పేరును తీసుకువస్తుందనే నమ్మకం ఉంది. కొత్త స్క్రీన్‌ప్లేను తెరపై చూస్తారు. ఈ సినిమా షూటింగ్ చివరలో నాకు క్యాన్సర్ అని బయటపడింది. కీమో థెరపీ తీసుకుంటూనే ఈ సినిమా షూట్‌లో పాల్గొన్నాను. ఈ విషయం తెలిసి మూవీ టీమ్ ఎన్నో మినహాయింపులు ఇస్తాం, మీరు అది చేయవద్దు ఇది చేయవద్దు అని అన్నారు. కానీ నేను చేయగలిగినప్పుడు మోసం చేయడం నాకు ఇష్టం ఉండదు. అందుకే నా పాత్రకు ఉన్న అన్ని రకాల సీన్స్ చేశాను.
Also Read- Jr NTR: ఎన్టీఆర్‌కి మాస్ ఇమేజ్ తెచ్చిన ‘ఆది’ సినిమాకు ఫస్ట్ అనుకున్న హీరో ఎవరో తెలుసా?
మెస్మరైజ్ చేస్తుంది
రామ్ చరణ్‌తో కలిసి ‘పెద్ది’ చిత్రంలో చేస్తున్నాను. చరణ్ వ్యక్తిత్వం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. డైరెక్టర్ బుచ్చిబాబు చాలా మంచి పర్సన్. స్క్రిప్ట్ చాలా బాగా వచ్చింది. ఇందులోని నా పాత్ర అందరినీ మెస్మరైజ్ చేస్తుంది. అలాగే ‘జైలర్’ సినిమాలో నా పాత్రకు అంత రెస్పాన్స్ వస్తుందని అస్సలు ఊహించలేదు. సూపర్ స్టార్ రజినీకాంత్ కోసమే ఆ సినిమా చేశాను. ఇప్పుడు ‘జైలర్ 2’ (Jailer 2)లోనూ నేను చేస్తున్నాను’’ అని తెలిపారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు