Biker: చార్మింగ్ స్టార్ శర్వానంద్ (Sharwanand)కు ప్రస్తుతం మంచి హిట్ కావాలి. కొన్నాళ్లుగా ఆయనకు హిట్ లేదు. అలాగే ఆయన పేరు కూడా పెద్దగా వినబడటం లేదు. వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నా.. సక్సెస్ మాత్రం ఆయనకు రావడం లేదు. ఇప్పుడొస్తున్న కుర్ర హీరోలు హిట్స్ కొడుతూ రేసులో ముందుకు వెళుతుంటే, శర్వా మాత్రం బ్రేకుల మీద బ్రేకులు తీసుకుంటున్నారు. ఇప్పుడాయన కమ్ బ్యాక్ ఇవ్వాల్సిన టైమ్ వచ్చింది. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న సినిమాల్లో ‘బైకర్’ (Biker) ఒకటి. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల విడుదలైన లుక్.. శర్వానంద్ పేరును ట్రెండింగ్‌లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ‘బైకర్’లో మోటార్ సైకిల్ రేసర్‌గా ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి శర్వానంద్ సిద్ధమవుతున్నారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో యువి క్రియేషన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చివరి దశకు చేరుకున్నట్లుగా మేకర్స్ చెబుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ మంచి స్పందనను రాబట్టుకుని సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమా గ్లింప్స్‌కు సంబంధించిన అప్డేట్‌ని మేకర్స్ ఇచ్చారు.
Also Read- Mahakali: ‘మహాకాళి’గా ఎవరంటే.. ఫస్ట్ లుక్ అరాచకం!
థియేటర్లలో ఫస్ట్.. డిజిటల్ నెక్ట్స్
ఈ గ్లింప్స్ విడుదలలో చిన్న ట్విస్ట్ కూడా యాడ్ చేశారు. ఈ చిత్ర ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ (Biker First Lap Glimpse)ను శుక్రవారం థియేటర్లలో విడుదలయ్యే సినిమాలలో ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. శుక్రవారం విడుదలవుతున్న ‘బాహుబలి: ది ఎపిక్’, ‘మాస్ జాతర’ సినిమాలకు ఈ గ్లింప్స్‌ను అటాచ్ చేసినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే డిజిటల్‌లో మాత్రం ఒక రోజు ఆలస్యంగా ఈ గ్లింప్స్‌ను విడుదల చేయనున్నారు. ప్రేక్షకులకు ఇది డిజిటల్ విడుదలకు ముందే థియేట్రికల్ ట్రీట్‌గా నిలుస్తున్న ఈ గ్లింప్స్‌ని.. డిజిటల్‌గా నవంబర్ 1న సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ ఈ అప్డేట్‌లో తెలిపారు. నిజంగా ఇది కొత్త ప్రయోగమనే చెప్పుకోవాలి. ఇంతకు ముందు కూడా కొన్ని సినిమాలకు ఇలానే చేశారు. ఇప్పుడు ‘బైకర్’ను డైరెక్ట్‌గా థియేటర్లలో చూపించి.. ఆ తర్వాత డిజిటల్‌కు తీసుకురానున్నారు.
Also Read- Book My Show: ‘బాహుబలి ది ఎపిక్’తో మాస్ మహారాజాకు దెబ్బపడేలానే ఉందిగా..
ఫిజికల్ ట్రాన్స్‌ఫార్మేషన్ అదుర్స్
ఈ విషయం తెలుపుతూ మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ పోస్టర్‌లో రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ దుస్తుల్లో శర్వానందర్ చాలా స్టైలిష్‌గా, కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నారు. అతని పొడవాటి కర్లీ హెయిర్, సన్‌గ్లాసెస్ రెబెల్లియస్ టచ్ ఇస్తున్నాయి. ఇటీవల వైరల్ అయిన షర్ట్‌లెస్ ఫోటోలతో శర్వానందర్ చేసిన ఫిజికల్ ట్రాన్స్‌ఫార్మేషన్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచిన విషయం తెలిసిందే. 1990, 2000 బ్యాక్‌డ్రాప్‌లో సాగే ‘బైకర్’ రేసింగ్ యాక్షన్‌తో పాటు ఎమోషనల్, మల్టీ జనరేషనల్ ఫ్యామిలీ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. స్పీడ్, అంబిషన్, హార్ట్‌ఫెల్ట్ రిలేషన్‌షిప్స్‌తో మూడు జనరేషన్స్ ఒకే రేసింగ్ కలతో, కుటుంబ బంధాలతో సాగే అద్భుతమైన కథ ఇదని మేకర్స్ చెబుతున్నారు. మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేయనున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
