Mahakali: ‘హనుమాన్’ (Hanu Man) సినిమాతో సూపర్ హీరో జానర్‌ను నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళిన విజనరీ ఫిల్మ్ మేకర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma), RKD స్టూడియోస్‌తో కలిసి మరోసారి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేందుకు సిద్ధమవుతున్నారు. వారి కొత్త చిత్రం ‘మహాకాళి’ (Mahakali) నుంచి లీడ్ ఫేస్‌ను పరిచయం చేశారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి వచ్చిన వార్తలన్నీ సినిమాపై భారీ హైప్‌కి కారణమయ్యాయి. టైటిల్ రోల్ ఎవరు చేయబోతున్నారనే దానిపై చాలా ఆసక్తి నెలకొంది. స్టార్ హీరోయిన్ ఎవరైనా, ఈ పాత్ర చేస్తారా? అనేలా టాక్ కూడా నడుస్తుంది. మరీ ముఖ్యంగా అనుష్క, లేదంటే నయనతార ఈ టైటిల్ రోల్ పోషించే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడా వార్తలన్నింటికీ బ్రేక్ వేస్తూ.. ‘మహాకాళి’గా భూమి శెట్టి (Bhoomi Shetty) నటించనుందని తెలుపుతూ.. ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ని మేకర్స్ గురువారం విడుదల చేశారు. నిజంగా ఇది ఎవరూ ఊహించనిదనే చెప్పుకోవాలి.
Also Read- Book My Show: ‘బాహుబలి ది ఎపిక్’తో మాస్ మహారాజాకు దెబ్బపడేలానే ఉందిగా..
డివైన్ ఫస్ట్ లుక్
తేజ సజ్జాతో ‘హనుమాన్’ చేసే సమయంలో కూడా ఇలానే వార్తలు వచ్చాయి. కానీ, ఆ సినిమా బంపర్ హిట్టయింది. ఇప్పుడు ప్రశాంత్ వర్మ సినీమాటిక్ యూనివర్స్ నుంచి రాబోతున్న ‘మహాకాళి’ కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంటుందనేలా ఫస్ట్ లుక్ పోస్టర్‌ని డిజైన్ చేశారు. ఇందులో ఇంటెన్స్, డివైన్ ఫస్ట్ లుక్‌లో భూమి శెట్టి ఎరుపు, బంగారు వర్ణంలో ఆగ్రహం, కరుణ రెండింటినీ ప్రతిబింబించేలా.. దివ్యమైన ఆరాతో కనిపిస్తున్నారు. సాంప్రదాయ ఆభరణాలు, పవిత్ర చిహ్నాలతో అలంకరించబడిన ఆమె చూపు, సృష్టి-ప్రళయం, విధ్వంసం-పునర్జన్మ శక్తిని సూచించేలా ఉంది. ఈ సినిమా ఇప్పటికే 50 శాతానికి పైగా షూట్ కంప్లీట్ చేసుకుందని మేకర్స్ తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్స్‌లో జరుగుతోంది.
Also Read- Tollywood: టాలీవుడ్‌లో పవన్ నామ స్మరణ.. వారికి వరమా? శాపమా?
గ్రేట్ విజువల్ వండర్
సాధారణంగా నాన్-స్టార్ సినిమాలకు ఇంత భారీ బడ్జెట్ వెచ్చించేందుకు నిర్మాతలు వెనుకాడుతారు. కానీ ‘మహాకాళి’ టీమ్ మాత్రం ఈ సాహసాన్ని చేసి చూపిస్తోంది. అందుకు కారణం మాత్రం ‘హనుమాన్’ అనే చెప్పుకోవాలి. పలువురు ఏ లిస్ట్ నటీమణులు సూపర్ హీరో పాత్రను పోషించడానికి ఆసక్తిని వ్యక్తం చేసినప్పటికీ, కథ సారాన్ని నిజంగా ప్రతిబింబించగల కొత్త ముఖం కావాలనే నిశ్చయంతో.. ఈ పాత్రకు సరిపడే డార్క్ స్కిన్ టోన్, వ్యక్తిత్వం, అన్నిరకాలుగా పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యే ఫేస్ భూమి శెట్టిదని తలంచి, ప్రశాంత్ వర్మ ఆమెను ఎంపిక చేసినట్లుగా ఈ అప్డేట్‌తో మేకర్స్ తెలిపారు. ఈ పోస్టర్‌తో ఈ చిత్రం ప్రశాంత్ వర్మ సినీమాటిక్ యూనివర్స్‌లోని (PVCU) మరో అద్భుత అధ్యాయమని తెలియజేస్తుంది. అలాగే ‘From the Universe of HanuMan’ అనే ట్యాగ్‌లైన్ ఈ కథ ‘హనుమాన్’తో అనుసంధానమై ఉన్నదనే సంకేతాన్ని కూడా సూచిస్తోంది. భారతీయ పౌరాణిక సూపర్ హీరో యూనివర్స్‌కి ఇది మరో మెట్టు అవుతుందనే ఆసక్తి అటు చిత్ర బృందంలోనే కాకుండా, ఇటు అభిమానుల్లో కూడా పెంచేలా ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ప్రశాంత్ వర్మ కాన్సెప్ట్‌తో పూజ కొల్లూరు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని ఆర్ఎకే దుగ్గల్, రివాజ్ రమేష్ దుగ్గల్ గ్రేట్ విజువల్ వండర్‌గా నిర్మిస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
