Shanmukha: ఆది సాయికుమార్.. ఈ హీరోకి అర్జెంట్‌గా హిట్ కావాలి. ఏడాదికి రెండు మూడు సినిమాలు చేస్తున్నా, ఈ మధ్య కాలంలో ఒక్కటంటే ఒక్క హిట్ కూడా ఈ హీరోకి పడటం లేదు. దీంతో, ఈసారి గట్టిగా కొట్టాలనే ధ్యేయంతో దిగుతున్నాడు. ఆయన హీరోగా నటిస్తోన్న డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘షణ్ముఖ’. ‘చిన్నారి పెళ్లికూతురు’ ఫేమ్ అవికాగోర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి షణ్ముగం సాప్పని దర్శకుడు. ‘శాసనసభ’ వంటి పాన్ ఇండియా సినిమాతో పరిచయమైన సాప్‌బ్రో ప్రొడక్షన్స్ సంస్థ నుంచి వస్తోన్న రెండో చిత్రమిది. సాప్పని బ్రదర్స్ సమర్పణలో తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని, రమేష్ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణతో పాటు నిర్మాణానంతర పనులను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మార్చి 21న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్‌లో టీమ్ మీడియా సమావేశం నిర్వహించింది.
Also Read- Ketika Sharma: కేతికా.. నీ పంట పండిందిపో! ‘అది ధ సర్‌ప్రైజ్’
ఈ కార్యక్రమంలో హీరో ఆది సాయికుమార్ (Aadi Saikumar) మాట్లాడుతూ.. ‘‘నా కెరీర్‌లో ఎప్పుడూ లేని విధంగా విడుదలకు ముందే ఈ సినిమాకు సంబందించిన అన్ని డిజిటల్ హక్కులు, అన్ని భాషల శాటిలైట్ హక్కులు, థియేట్రికల్ హక్కులు ఫ్యాన్సీ రేటుకు అమ్ముడు పోవడం ఆనందంగా ఉంది. వరుసగా సినిమాలు చేసే నా నుంచి సినిమా వచ్చి అప్పుడే సంవత్సరం దాటిపోయింది. పైనల్‌గా ఈ మార్చి 21న ‘షణ్ముఖ’ వంటి ఒక పవర్ ఫుల్ చిత్రంతో వస్తున్నాను. ఈ సినిమా క్రెడిట్ అంతా దర్శక, నిర్మాత షణ్ముగం సాప్పనికే చెందుతుంది. ఎందుకంటే, ఈ సినిమాకు ఆయన పడిన కష్టం అలాంటిది. ఈ సినిమా బిజినెస్ అయిపోవడం కూడా చాలా హ్యపీగా ఉంది. రవి బస్రూర్ సంగీతం, నేపథ్య సంగీతం ఈ సినిమాను మరో లెవల్‌కు తీసుకెళుతుంది. అవికాతో మళ్లీ మళ్లీ చేయాలని ఉంది. ఎంతో సపోర్టివ్ నటి. ఇంకా ఇతర పాత్రలలో చేసిన వారంతా, ఈ సినిమాకు ప్రాణం పెట్టేశారు. ఇది మంచి సినిమా. మంచి సినిమాకు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుంది కాబట్టి ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని తెలిపారు.
అందరిలాగే ఈ సినిమా కోసం నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఇది నా కెరీర్‌లో చాలా ప్రత్యేకమైన సినిమా. డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ చేయడం హ్యపీ. ప్రతి ఆర్టిస్ట్ ఇలాంటి పాత్ర చేయాలనుకునే డిఫరెంట్ రోల్ నాకు ఈ చిత్రంలో లభించింది. ఐయామ్ వెరీ థ్యాంక్‌ఫుల్. అమేజింగ్.. క్లియర్ అమేజింగ్ కో-యాక్టర్ ఆది. అందరూ ఈ సినిమాను థియేటర్లలో చూడాలని కోరారు హీరోయిన్ అవికా గోర్ (Avika Gor). దర్శక నిర్మాత షణ్ముగం సాప్పని మాట్లాడుతూ.. హిందీ డిజిటల్ హక్కులు, ఇతర రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు హాట్ కేకులా సేల్ అవ్వడం హ్యపీగా ఉంది. ఏపీ, తెలంగాణలో నా మిత్రుడు శశిధర్ రెడ్డి ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఇందులో పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా ఆది కనిపిస్తాడు. ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని ఓ అద్భుతమైన పాయింట్‌తో రూపొందుతున్న డివోషనల్ థ్రిల్లర్ చిత్రమిది. విజువల్ వండర్‌లా, అద్బుతమైన గ్రాఫిక్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ప్రతి పాత్ర హైలైట్‌గా వుంటుంది. అందరూ ఫ్యామిలీతో చూడదగిన డివోషనల్ థ్రిల్లర్ ఇది. దర్శకుడిగి నా మొదటి సినిమా. అందరికీ నచ్చుతుందనే నమ్మకముందని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటుడు మనోజ్ నందం, విలన్‌గా చేసిన చిరాగ్ మాట్లాడారు.
ఇవి కూడా చదవండి:
Jyothika: ‘కంగువ’పై కామెంట్స్ చేశారు, కానీ కొన్ని చెత్త సినిమాలకు.. ఇచ్చిపడేసిన జ్యోతిక
SSMB29: అడ్డడ్డే.. రాజమౌళికి ఎంత కష్టం వచ్చింది.. ఇక టార్చరే!