Shambhala Teaser: యంగ్ హీరో ఆది సాయి కుమార్ (Aadi Saikumar) నటిస్తున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ చిత్రం ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అర్చన అయ్యర్, స్వాసిక, రవివర్మ, మధునందన్, శివకార్తీక్ వంటి వారు ఇతర పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ ‘శంబాల’ మూవీ నుంచి వచ్చిన పోస్టర్‌లు, పాత్రల్ని రివీల్ చేస్తున్న తీరు అందరిలోనూ ఆసక్తిని పెంచడమే కాకుండా, సినిమాపై అంచనాలను పెంచేశాయి. రీసెంట్‌గా వచ్చిన ‘శంబాల’ మేకింగ్ వీడియో అయితే.. ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా? అని వేచి చూసేలా చేసిందనడంలో అతిశయోక్తి ఉండదేమో. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను రిలీజ్ చేసి, సినిమాపై అమాంతం అంచనాలు రెట్టింపు అయ్యేలా చేశారు మేకర్స్.
Also Read- Kannappa: మళ్లీ బ్రాహ్మణులతో పెట్టుకున్న మంచు ఫ్యామిలీ.. ఈసారి ఏమవుతుందో?
ముందుగా ఈ చిత్ర టీజర్ విషయానికి వస్తే.. ‘‘ఈ విశ్వంలో అంతుపట్టని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. సైన్స్‌కి సమాధానం దొరకనప్పుడు వాటిని మూఢనమ్మకం అంటుంది. అదే సమాధానం దొరికితే.. అది తన గొప్పతనం అంటుంది. పంచభూతాలను శాసిస్తుందంటే.. ఇది సాధారణమైనది కాదు. దీని ప్రభావం వల్ల.. మనం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొవాల్సి వస్తుందో ఊహించలేం. ఇప్పుడీ రక్కసి కీడును ఆపాలంటే..’’ అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక గంభీరమైన వాయిస్ డైలాగ్ చెబుతుంటే.. ఆ వాయిస్‌కు తగ్గట్లుగా ఒక్కో సీన్ గూజ్‌బంప్స్ అనేలా ఉందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. టీజర్‌లోనే అంతుపట్టని రహస్యం గురించి చెప్పిన తీరు, చూపించిన సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేయడమే కాదు.. అద్భుతమైన అనుభూతిని ఇచ్చే సినిమా రాబోతుందనే ఫీల్‌ని ఇస్తున్నాయి.
Also Read- Amaravati: అమరావతి ‘వేశ్యల’ రాజధాని అయితే.. వైఎస్ జగన్ ఎక్కడ?
అంతరిక్షం నుంచి ఉల్క వంటి ఒక అతీంద్రయ శక్తి, ఓ గ్రామంలో పడటం.. దాని ప్రభావంతో ఊర్లోని జనాలు వింతవింతగా చనిపోవడం, వింతగా ప్రవర్తించడం రియాలిటీకి దగ్గరగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఆ రహస్యాన్ని ఛేదించేందుకు హీరో రావడం.. ఓ ఊరితో పోరాటం చేయడం వంటి ఆసక్తికరమైన అంశాలను ఈ శంబాల టీజర్‌లో చూపించారు. ప్రవీణ్ కే బంగారి అందించిన విజువల్స్, శ్రీచరణ్ పాకాల ఇచ్చిన బీజీఎం అన్నీ కూడా నెక్ట్స్ లెవెల్ అనేలా ఉండటమే కాకుండా.. సినిమాపై అద్భుతమైన ఇంపాక్ట్‌ని కలుగజేస్తున్నాయి. మొత్తంగా అయితే, పాన్ ఇండియన్ మూవీకి సరిపడా సబ్జెక్ట్, కంటెంట్ ఉందని ఈ టీజర్ క్లారిటీ ఇచ్చేసింది. అంతేనా, చాలా కాలంగా హిట్ కోసం వేచి చూస్తున్న ఆది సాయికుమార్‌కు.. ఈసారి బాక్సాఫీస్ షేకయ్యే హిట్టు పడబోతుందనే ఫీల్‌ని కూడా ఈ టీజర్ ఇస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుందని, త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని మేకర్స్ ప్రకటించారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు