Shambhala: మన ఆది హిట్ కొట్టాడని అందరూ ఫోన్‌లు చేస్తున్నారు.. పుత్రోత్సాహం అంటూ ఆడియెన్స్ నాకు చెబుతుంటే చాలా చాలా ఆనందంగా ఉందని అన్నారు డైలాగ్ కింగ్ సాయి కుమార్. ఆయన కుమారుడు, వెర్సటైల్ యాక్టర్ ఆది సాయి కుమార్ (Aadi Sai Kumar) హీరోగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘శంబాల’ (Shambhala). యుగంధర్ ముని దర్శకత్వంలో రూపుదిద్దుకుని డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. విడుదలకు ముందు వేసిన ప్రీమియర్లతోనే మంచి స్పందనను రాబట్టుకుని.. మొదటి రోజు హౌస్ ఫుల్ కలెక్షన్లతో థియేటర్లలో దూసుకెళుతోంది. ఈ సంతోషాన్ని పురస్కరించుకుని మేకర్స్ సక్సెస్ సెలెబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాయి కుమార్ మాట్లాడుతూ.. ఎమోషనల్ అయ్యారు.
మన ఆది హిట్ కొట్టాడు
‘‘మా నాన్న విజయనగరంలో ‘ప్రేమ కావాలి’ మూవీని చూసి నాకు చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తున్నాయి. ఈ రోజు ప్రతీ చోటా హౌస్ ఫుల్స్ పడ్డాయి. ఈ మాటలు వింటే నాకు మళ్లీ ఆ రోజులు గుర్తుకు వచ్చాయి. నా ఈ 50 ఏళ్లలో 300కి పైగా చిత్రాలు, వెయ్యికి పైగా సినిమాలకు డబ్బింగ్ చెప్పాను. నేను ప్రతీ వారం వచ్చే సినిమాల గురించి, వాటి ఫలితాల గురించి తెలుసుకుంటూనే ఉంటాను. ‘పోలీస్ స్టోరీ’కి హౌస్ ఫుల్ అవుతుందా? అనుకున్నాను. కానీ హాలు నిండినది అని బోర్డ్ చూసిన తర్వాత నాకెంతో సంతోషం కలిగింది. మళ్లీ ఇప్పుడు ఆ మాటలు వింటున్నాను. ‘శంబాల’ టీ షర్ట్ వేసుకుని నేను నిన్న థియేటర్ విజిట్‌కు వెళ్లాను. అలా వెళ్లిన ప్రతీ చోటా అద్భుతమైన స్పందనను చూశాను. అనిల్ రావిపూడి చెప్పినట్టుగా ఈ శుక్రవారం మా వాడు హిట్టు కొట్టాడు. అర్ధరాత్రి నాకు అనిల్ రావిపూడి బ్లాక్ బస్టర్ హిట్ అని మెసెజ్ పెట్టారు. ప్రతీ చోటా నుంచి ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. చాలా మంది టికెట్ల కోసం ఫోన్ చేస్తున్నారు. దీనంతటికి కారణం డైరెక్టర్ యుగంధర్ ముని. ఆది కూడా నాలానే డైరెక్టర్ యాక్టర్. నా వాయిస్ ఓవర్ కూడా ఈ మూవీకి ప్లస్ పాయింట్ అయిందని అంటుంటే చాలా హ్యాపీ. సనాతన ధర్మాన్ని టచ్ చేస్తూ ఈ మూవీని యుగంధర్ అద్భుతంగా తెరకెక్కించారు. మంచి టీంతో మహీధర్, రాజశేఖర్ తీసిన ఈ మూవీని ఆడియెన్స్ పెద్ద హిట్ చేశారు. అన్ని చోట్లా హౌస్ ఫుల్స్ పడ్దాయి.. అన్ని చోట్ల నుంచి ఫోన్‌లు వస్తున్నాయి. మన ఆది హిట్ కొట్టాడని అందరూ ఫోన్‌లు చేస్తూ.. పుత్రోత్సాహం అంటూ ఆడియెన్స్ నాకు చెబుతుంటే.. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇది ప్రజల విజయం. కుటుంబమంతా కలిసి చూడదగ్గ సినిమా ఇది. త్వరలోనే ‘శంబాల’ టీం సక్సెస్ టూర్ నిర్వహిస్తుంది’’ అని సాయి కుమార్ (Sai Kumar) చెప్పుకొచ్చారు.
Also Read- The Raja Saab: ‘ది రాజా సాబ్’ క్రిస్మస్ గిఫ్ట్.. ‘రాజే యువరాజే..’ సాంగ్ ప్రోమో.. ఇక ప్రేయర్లే!
థియేటర్లు పెంచబోతున్నాం
ఆది సాయి కుమార్ మాట్లాడుతూ.. మా సినిమాకు మొదటి నుంచి మీడియా ఎంతగానో సపోర్ట్ చేసింది. నా ఈ సినీ ప్రయాణంలో అండగా నిలిచిన మీడియాకు, అభిమానులకు, ప్రేక్షకులకు థాంక్స్. మూవీని చూసిన వారంతా మెసేజ్‌లు చేస్తున్నారు. ‘శంబాల’ని ఇంతలా ఆదరిస్తున్న ఆడియెన్స్‌కి థాంక్స్. ప్రీమియర్ల నుంచి డే వన్‌కి అన్ని చోట్లా హౌస్ ఫుల్స్ పడుతూనే వచ్చాయి. చాలా కాంపీటిషన్‌లో విడుదలైనా కూడా ఆ మూవీ పెద్ద హిట్ అయింది. త్వరలోనే థియేటర్లు కూడా పెంచబోతోన్నాం. ఈ మూవీని కచ్చితంగా థియేటర్లోనే చూడండి. అప్పుడే పూర్తిగా ఎంజాయ్ చేయగల్గుతారు. హాలీడే సీజన్‌ను అందరూ ‘శంబాల’తో ఎంజాయ్ చేయండని అన్నారు. డైరెక్టర్ యుగంధర్ ముని మాట్లాడుతూ.. ‘శంబాల’ సినిమాను గత ఏడాది డిసెంబర్ నుంచి ప్రారంభించాం. రెండు వారాల క్రితమే సినిమాకు సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాయి. ఇక సినిమాని ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఎలా రిలీజ్ చేయాలి? అని మాలో ఒక టెన్షన్ ఉంది. ఆహా, జీ వాళ్లు మూవీని చూసి పోటీ పడి మరీ కొనేసుకున్నారు. మేం చాలా పోటీలో ఈ సినిమాను రిలీజ్ చేశాం. గత మూడు రోజుల నుంచి ప్రివ్యూలు వేస్తూనే వచ్చాం. మీడియాకు వేసిన ప్రివ్యూ షో నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఆ తరువాత నేను కాస్త రిలాక్స్‌గా ఫీల్ అయ్యాను. సినిమా వేసిన ప్రతీ చోటా హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి. ఇంతలా ఆదరిస్తున్న ఆడియెన్స్‌కి థాంక్స్. నా ఈ ప్రయాణంలో సహకరించిన అందరికీ ధన్యవాదాలు. వారి సహకారంతోనే ఇంత గొప్పగా సినిమాని తీయగలిగాను. ఈ మూవీని మీ దగ్గర్లో ఉన్న థియేటర్లో చూడండి.. కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు అని తెలిపారు.
Also Read- Trivikram Srinivas: ‘ఈ సినిమా ఆడుద్ది’.. ఏ సినిమా అంటే?
ఆయన జాయిన్ అయ్యాక..
నిర్మాత మహిధర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘శంబాల’కు ఆడియెన్స్ నుంచి అదిరిపోయే స్పందన వస్తోంది. మేం హిట్ అవుతుందని మాత్రమే అనుకున్నాం. కానీ ఇలా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఊహించలేదు. అన్ని చోట్లా హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. ఇక డిమాండ్‌ను పట్టి షోలు కూడా పెంచుతున్నాం. యుగంధర్ గత ఏడాది నుంచి నిద్రలేని రాత్రులెన్నో గడిపి ఎంతో కష్టపడి ఈ మూవీని తీర్చిదిద్దారు. మాకు సపోర్ట్ చేసిన మా హీరో ఆది, అలాగే టీమ్ అందరికీ థాంక్స్ అని చెప్పారు. మరో నిర్మాత రాజశేఖర్ అన్నభీమోజు మాట్లాడుతూ.. మా సినిమా సక్సెస్ అయింది. మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం. ప్రతీ చోటా హౌస్ ఫుల్స్ పడ్డాయి. ప్రీమియర్లకు అన్ని చోట్లా అద్భుతమైన స్పందన వచ్చింది. ఇకపై మేం షోలు పెంచబోతోన్నాం. యుగంధర్ చెప్పిన కథతో ఈ ‘శంబాల’ స్టార్ట్ అయింది. మహిధర్ రెడ్డి జాయిన్ అయ్యాక ఈ మూవీ స్వరూపం, స్థాయి మారిపోయింది. మాకు సపోర్ట్ చేసిన ఆది, సాయి కుమార్, చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ థాంక్స్. ఇంకో రెండు వారాలు మా మూవీ ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నానని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరోయిన్ అర్చన ఐయ్యర్, శ్రీచరణ్ పాకాల, నటుడు ఇంద్రనీల్, నటుడు మధు నందన్ వంటి వారంతా ప్రసంగించారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

