Shambhala: ఫెంటాస్టిక్ బ్లాక్ బస్టర్ కొట్టేశారు.. ‘శంబాల’పై రెబల్ స్టార్!
Shambhala Movie Prabhas (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Shambhala: ఫెంటాస్టిక్ బ్లాక్ బస్టర్ కొట్టేశారు.. ‘శంబాల’పై రెబల్ స్టార్!

Shambhala: వెర్సటైల్ యాక్టర్ ఆది సాయికుమార్ (Aadi Saikumar) కెరీర్‌లో ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ‘శంబాల’ (Shambhala) రూపంలో ఆయనకు ఒక భారీ విజయం లభించింది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం, ప్రస్తుతం థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. తాజాగా ఈ చిత్రం సాధించిన విజయానికి రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ (Rebel Star Prabhas) తనదైన శైలిలో స్పందించారు. సినిమా ప్రారంభం నుంచి ఆది సాయికుమార్‌కు ప్రభాస్ అండగా నిలుస్తూనే ఉన్నారు. ‘శంబాల’ ట్రైలర్‌ను ప్రభాస్ విడుదల చేయగా, అది సోషల్ మీడియాలో భారీ స్థాయిలో వైరల్ అయ్యింది. అది సినిమాపై అంచనాలను పెంచడంలో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు ఈ సినిమా ‘బ్లాక్ బస్టర్’ స్టేటస్‌ను దక్కించుకోవడంతో, ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో టీమ్‌ను అభినందిస్తూ ఒక పోస్ట్ పెట్టారు.

Also Read- The Raja Saab Trailer: ‘ది రాజా సాబ్’ ట్రైలర్ 2.ఓ వచ్చేసింది. ఇది కదా కావాల్సింది!

ఫెంటాస్టిక్ బ్లాక్ బస్టర్

‘‘ఫెంటాస్టిక్ బ్లాక్ బస్టర్ కొట్టేశారు.. ఆదికి, శంబాల టీమ్‌కి కంగ్రాట్స్’’ అంటూ ప్రభాస్ ఇన్‌స్టా స్టేటస్‌లో పెట్టడంతో అభిమానులు, చిత్ర టీమ్ సంబరపడుతున్నారు. ప్రభాస్ సపోర్ట్ ఈ సినిమాకు అదనపు బలాన్ని చేకూర్చిందని చెప్పవచ్చు. పాన్ ఇండియా స్టార్ ఇలా తమ సినిమా సక్సెస్‌పై పోస్ట్ పెట్టడంతో యూనిట్ అంతా ప్రభాస్‌కు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ‘శంబాల’ చిత్ర బృందం రాయలసీమ ప్రాంతంలో సక్సెస్ టూర్ నిర్వహిస్తోంది. విడుదలైన ప్రతి చోటా సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తుండటంతో చిత్ర బృందం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాను క్రిస్మస్ విన్నర్‌గా ప్రేక్షకులు డిసైడ్ చేసేయడంతో.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తోంది. మండే రోజు కూడా ఈ సినిమా చాలా చోట్ల హౌస్‌ఫుల్ కలెక్షన్లతో నడుస్తుందని, ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలని మేకర్స్ తెలిపారు.

Also Read- Jagapathi Babu: షాకింగ్ లుక్‌లో జగపతిబాబు.. ‘పెద్ది’ పోస్టర్ వైరల్!

సినిమాను నిలబెట్టిన టెక్నీషియన్స్

‘శంబాల’ చిత్రానికి దర్శకత్వం వహించిన యుగంధర్ ముని, కథను తెరకెక్కించిన విధానంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. మరీ ముఖ్యంగా శ్రీ చరణ్ పాకాల అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణం పోసింది. ప్రవీణ్ కె బంగారి అందించిన విజువల్స్ ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లాయి. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మహీధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించారు. ఆది సాయికుమార్ తన నటనతో మరోసారి మెప్పించగా.. అర్చన ఐయ్యర్, ఇంద్రనీల్, రవి వర్మ, మీసాల లక్ష్మణ్ వంటి నటీనటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. బేబీ చైత్ర, మధు నందన్‌ల నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయి. క్రిస్మస్ విన్నర్‌గా నిలిచిన ‘శంబాల’ ఇప్పుడు బాక్సాఫీస్ రేసులో దుమ్మురేపుతోంది. ప్రభాస్ వంటి గ్లోబల్ స్టార్ అండగా నిలవడం, ఆడియన్స్ ఆదరించడం చూస్తుంటే ఆది ఖాతాలో చాలా కాలం గుర్తుండిపోయే హిట్ పడిందని అనడంలో అతిశయోక్తి లేనే లేదు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

ibomma Ravi Case: ‘ఐబొమ్మ రవి కేసు’.. సంచలన విషయాలు చెప్పిన సైబర్ క్రైమ్ డీసీపీ!

Viral News: కుక్క కాటుకు చనిపోయిన గేదె.. ఆస్పత్రికి పరుగులు పెట్టిన జనం, ఎందుకంటే?

Jr NTR: ఢిల్లీ హైకోర్టు‌కు కృతజ్ఞతలు తెలిపిన మ్యాన్ ఆఫ్ మాసెస్.. మ్యాటర్ ఏంటంటే?

January Bank Holidays: జనవరిలో భారీగా బ్యాంక్ హాలిడేస్.. ముందే జాగ్రత్త పడండి మరి.. తేదీలు ఇవే

Shambhala: ఫెంటాస్టిక్ బ్లాక్ బస్టర్ కొట్టేశారు.. ‘శంబాల’పై రెబల్ స్టార్!