Jagapathi Babu: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన తర్వాత జగపతి బాబు (Jagapathi Babu) ఎంచుకుంటున్న పాత్రలు, వేస్తున్న గెటప్‌లు ఒకదానికి మించి ఒకటి ఉంటున్నాయి. తాజాగా మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ (Peddi) నుంచి విడుదలైన జగపతి బాబు పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇందులో ఆయన ‘అప్పలసూరి’ అనే కీలక పాత్రలో నటిస్తున్నారు. సాధారణంగా జగపతి బాబు అంటే స్టైలిష్ విలన్ లేదా ఒక పవర్‌ఫుల్ ఫాదర్ క్యారెక్టర్ గుర్తొస్తుంది. కానీ ‘పెద్ది’ పోస్టర్‌లో ఆయనను చూస్తుంటే ఒక క్షణం ఆశ్చర్యం కలగక మానదు. ముడతలు పడిన ముఖం, చిందరవందరగా ఉన్న జుట్టు, కళ్ళజోడు, ఒక మాసిన చొక్కా.. వెరసి ఒక నిరుపేద వృద్ధుడి గెటప్‌లో ఆయన పూర్తిగా ఒదిగిపోయారు. గడ్డం, మీసం కూడా పాత్రకు తగ్గట్టుగా చాలా సహజంగా డిజైన్ చేశారు. అసలు ఆయన జగపతి బాబేనా? అని అనుమానం వచ్చేంతగా ఈ మేకోవర్ ఉండటం విశేషం.
Also Read- The Raja Saab Trailer: ‘ది రాజా సాబ్’ ట్రైలర్ 2.ఓ వచ్చేసింది. ఇది కదా కావాల్సింది!
పాత్ర పేరులోనే ఉంది పవర్
ఈ చిత్రంలో ఆయన పాత్ర పేరు ‘అప్పలసూరి’ (Appala Soori). పేరు వినడానికి చాలా సాదాసీదాగా ఉన్నా, ఆ కళ్లలో కనిపిస్తున్న తీక్షణత చూస్తుంటే సినిమాలో ఈ పాత్ర చాలా బలంగా ఉండబోతుందని అర్థమవుతోంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే కథ కావడంతో, ఆ ప్రాంతపు యాస, ఆహార్యాన్ని ప్రతిబింబించేలా ఈ పాత్రను బుచ్చిబాబు మలిచినట్లు కనిపిస్తోంది. ‘రంగస్థలం’లో ప్రకాష్ రాజ్, ఆది పినిశెట్టి పాత్రలు ఎంత ఇంపాక్ట్ చూపించాయో, ‘పెద్ది’లో అప్పలసూరి పాత్ర అంతకంటే ఎక్కువే ప్రభావం చూపేలా ఉంది. దర్శకుడు బుచ్చిబాబు సానా తన మొదటి సినిమా ‘ఉప్పెన’తోనే పాత్రల చిత్రణలో తనదైన ముద్ర వేశారు. ఇప్పుడు రామ్ చరణ్‌తో చేస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో ప్రతి పాత్రకూ ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకుంటున్నారు. జగపతి బాబు వంటి సీనియర్ నటుడిని ఇలాంటి భిన్నమైన గెటప్‌లో ప్రెజెంట్ చేయడం ద్వారా సినిమాపై ఉన్న హైప్‌ని రెట్టింపు చేయగలిగారు.
Also Read- Emmanuel: బిగ్ బాస్ షో పై ఇమ్మానుయేల్ సంచలన వ్యాఖ్యలు
కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ గెటప్
ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. రత్నవేలు సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ ఇలా అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ ప్రాజెక్టుకు పనిచేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రామ్ చరణ్ పుట్టినరోజు స్పెషల్‌గా 27 మార్చి, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. గత కొన్ని రోజులుగా పాటలతో దుమ్మురేపుతున్న ‘పెద్ది’ నుంచి వచ్చిన ఈ అప్పలసూరి పోస్టర్ చూస్తుంటే, రామ్ చరణ్ సినిమా అంటే కేవలం కమర్షియల్ హంగులే కాదు, నటనకు ప్రాధాన్యమున్న ఒక అద్భుతమైన కథా చిత్రం అని స్పష్టమవుతోంది. జగ్గూభాయ్ తన కెరీర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ గెటప్‌తో రాబోతున్నారనేది ఈ పోస్టర్ చూస్తుంటే తెలుస్తోంది. ఆల్రెడీ ఈ సినిమాని పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని జగ్గూ భాయ్ కూడా ఆ మధ్య చెబుతూ.. బుచ్చిబాబుపై ప్రశంసలు కురిపించారు.
The incredible @IamJagguBhai as 'APPALASOORI' from #Peddi ❤🔥
Brace yourselves for his masterclass performance in a strong, impactful role 💥
#PEDDI WORLDWIDE RELEASE ON 27th MARCH, 2026.
Mega Power Star
@AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana… pic.twitter.com/KluPeuAYUV— Vriddhi Cinemas (@vriddhicinemas) December 29, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

