Shabara Telugu Teaser: దీక్షిత్ శెట్టి (Dheekshith Shetty), క్రితికా సింగ్ (Kritika Singh) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘శబార’ (Shabara). ప్రేమ్ చంద్ కిలారు (Kilaru Prem Chand) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని విశ్రమ్ ఫిల్మ్ ఫ్రాటర్నిటీ బ్యానర్ పై హర్షిత చదలవాడ, దుర్గా చుంచు, రమాదేవి కిలారు నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్‌ని మేకర్స్ స్టార్ట్ చేశారు. అందులో భాగంగా చిత్ర టీజర్‌ను ‘హార్ట్ బీట్ ఆఫ్ శబార’ అంటూ బుధవారం మేకర్స్ విడుదల చేశారు. మిథున్ ముకుందన్ ఈ మూవీకి సంగీతాన్ని అందిస్తుండగా.. అజయ్ అబ్రహం జార్జ్ కెమెరామెన్‌గా వర్క్ చేస్తున్నారు. ‘దసరా’, ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులలోనూ మంచి గుర్తింపు పొందిన దీక్షిత్ శెట్టి నుంచి వస్తున్న ఈ సినిమాపై ‘హార్ట్ బీట్ ఆఫ్ శబార’ (Heartbeat Of Shabara Telugu Teaser) భారీగా అంచనాలను పెంచేదిగా ఉంది. టీజర్‌ని గమనిస్తే..
Also Read- Couple Friendly: సంతోష్ శోభన్ సినిమా నుంచి సాంగొచ్చింది.. ఎలా ఉందంటే?
రక్తం చూడని యుద్ధం ఉంటుందా?
‘మనం నడిచే ఈ నేల కింద అంతా బంగారమే ఉందంట కదా! నాకు దొరికితే అది నాదే అవుతుందా?’ అనే చిన్న పిల్లాడి వాయిస్‌తో ఈ టీజర్ మొదలైంది. ‘ఒక ప్రపంచమంతా బంగారమే ఉందని తెలిసినప్పుడు, దాన్ని వెతుక్కుంటూ ఎంత మంది వచ్చి ఉంటారు. ఎన్ని యుద్ధాలు జరిగి ఉంటాయి. ఎన్ని ప్రాణాలు పోయి ఉంటాయి. ఈ నేల ఎంత రక్తాన్ని చూసి ఉంటుంది. రక్తం చూడని యుద్ధం ఉంటుందా?’ అని దీక్షిత్ శెట్టి పవర్ ఫుల్ డైలాగ్స్ చెబుతుంటే, స్క్రీన్‌పై కనిపించే ప్రతి సన్నివేశం రెప్పవేయనీయనంతగా ఆకర్షిస్తున్నాయి. మరీ ముఖ్యంగా మ్యూజిక్ ఈ టీజర్‌పై భారీ ఇంపాక్ట్‌ని కలిగిస్తోంది. ఇందులో దీక్షిత్ శెట్టి పాత్ర చాలా కీలకంగా ఉంటుందనే విషయం ఈ టీజర్ తెలియజేస్తుంది. అలాగే హార్ట్ బీట్ ఆఫ్ శబార అనే టైటిల్‌ని ఈ టీజర్‌కు ఎందుకు పెట్టారో కూడా.. ఫుల్ క్లారిటీని ఈ టీజర్ ఇస్తుంది.
Also Read- Yadhu Vamsee: క్యాస్టింగ్ కాల్.. ‘కమిటీ కుర్రోళ్లు’ దర్శకుడికి అచ్చమైన తెలుగమ్మాయ్ కావాలట!
ఒక బంగారు గని కోసం రెండు యుగాలు
ఇప్పటి వరకు దీక్షిత్ శెట్టి అంటే ఓ సాప్ట్ బాయ్‌గానే కనిపించారు. కానీ ఇందులో పూర్తిస్థాయి యాక్షన్, ఎమోషనల్ రోల్‌లోకి ఆయన మారిన తీరు చూస్తే వావ్ అనాల్సిందే. ఒక బంగారు గని కోసం రెండు యుగాలు అనే థీమ్‌తో ఈ మూవీ రూపొందినట్లుగా ఈ టీజర్‌లో తెలిపారు. ఆ రెండు యుగాలకు సంబంధించిన సన్నివేశాలను ఇందులో చూపిస్తూ.. ఫైనల్‌గా దీక్షిత్ శెట్టిని చూపించిన విధానం.. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా? అని వెయిట్ చేయించేలా ఉందంటే అస్సలు ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌లోని ఉత్కంఠను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లింది. దర్శకుడు ప్రేమ్ చంద్ కిలారు ప్రతి పాత్రకు ఇంపార్టెన్స్ ఇస్తూ, ప్రెజెంట్ చేసినట్లుగా అనిపిస్తోంది. మొత్తంగా అయితే, దీక్షిత్ శెట్టి సోలో హీరోగా తన పవర్ చూపించే సమయం ఆసన్నమైందని, ఈ టీజర్ చెప్పకనే చెప్పేస్తోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

