Yadhu Vamsee: ‘కమిటీ కుర్రోళ్లు’ (Committee Kurrollu) చిత్రంతో దర్శకుడిగా మంచి పేరు, అవార్డులు తెచ్చుకున్న యదు వంశీ (Yadhu Vamsee)కి ఇప్పుడు అచ్చమైన తెలుగమ్మాయ్ కావాలట. ఏంటి పెళ్లి చేసుకోవడానికా? అని అపార్థం చేసుకోకండి. ‘కమిటీ కుర్రోళ్లు’తో టాలీవుడ్‌లో దర్శకుడిగా తన ముద్ర వేసిన యదు వంశీ.. అంతా కొత్త వారితో ఆ సినిమాను తీసి సక్సెస్ కొట్టారు. ఇప్పుడు యదు వంశీ తన రెండో ప్రాజెక్ట్ కోసం ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించారు. ఈ క్రమంలో తన రెండో ప్రాజెక్ట్ కోసం ఒక యువ మహిళా నటి కోసం (New Telugu Face) ఆయన క్యాస్టింగ్ కాల్‌ను ప్రకటించారు. 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అచ్చమైన తెలుగు అమ్మాయి కోసం యదు వంశీ అన్వేషిస్తున్నారట. నటన, ప్రతిభ-ఆధారిత ప్రక్రియ ద్వారా తెలుగు సినిమాలో నటించడానికి ఉత్సాహంగా ఉన్న నటీమణులకు ఓ సువర్ణ అవకాశాన్ని అందించడమే లక్ష్యంగా యదు వంశీ ఈ ప్రకటనను విడుదల చేశారు.
Also Read- Sita Ramam 2: ‘సీతారామం 2’ లేదన్నారు?.. వైరల్ అవుతున్న దుల్కర్ సల్మాన్, మృణాల్ ఫోటోలు..
మొదటి చిత్రంతోనే కొత్తవాళ్లకి ఛాన్స్
‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో దాదాపు 15 మంది కొత్త ఆర్టిస్టులు, టాలెంట్ ఉన్న హీరో, హీరోయిన్లు ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి తెలిసిందే. విలేజ్, రూటెడ్ కథతో వచ్చిన యదు వంశీ.. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుకున్నారు. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్‌లో ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రం అత్యున్నత గౌరవాన్ని పొందిన విషయం తెలియంది కాదు. దుబాయ్‌లోని గల్ఫ్ అకాడమీ మూవీ అవార్డ్స్ (GAMA)లో అంతర్జాతీయ గుర్తింపును పొందింది. 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ ఫీచర్ ఫిల్మ్‌గా ప్రతిష్టాత్మక నామినేషన్‌ను పొందిందీ చిత్రం. రూటెడ్ కథలు చెప్పాలన్న యదు వంశీ నిబద్దతను ఈ గౌరవాలు దృఢంగా నిలబెట్టాయి.
Also Read- Bhartha Mahasayulaku Wignyapthi: ‘వామ్మో వాయ్యో’ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది.. ఎంజాయ్!
చేయాల్సింది ఇదే..
ఇక ‘కమిటీ కుర్రోళ్లు’తో కొత్తవారిని పరిచయం చేసినట్లే.. ఇప్పుడు చేయబోయే సినిమాకు కూడా తాజాగా ప్రకటించిన కాస్టింగ్ కాల్‌తో దర్శకుడు కొత్త వారిని కనుగొనడం వైపు దృష్టి పెట్టారు. ఉత్సాహం, విశ్వాసం, సాంస్కృతిక మూలాల మిశ్రమాన్ని సహజంగా ప్రతిబింబించే ‘అచ్చమైన తెలుగు అమ్మాయి’ కోసం అన్వేషణ జరుగుతోంది. గ్లామర్ కంటే వ్యక్తీకరణ సామర్థ్యం, భావోద్వేగ లోతు, తెలుగు భాషపై ఉన్న పట్టుతో ఈ అవకాశం వరించనుంది. ఆశావహులైన అభ్యర్థులు తమ ఆడిషన్ వీడియోలను నేరుగా బృందానికి సమర్పించవచ్చని తెలుపుతూ.. yadhuvamseeYV2@gmail.com ఇమెయిల్ ద్వారా లేదా WhatsApp 8639164104 కు వీడియోలను పంపాలని తెలిపారు. మరెందుకు ఆలస్యం నటి కావాలనుకునే వారంతా అప్లయ్ చేసుకోండిక. నిజాయితీగల ప్రతిభను ప్రోత్సహించడానికి, కంటెంట్-ఆధారిత తెలుగు సినిమాలను బలోపేతం చేయడమే ధ్యేయంగా నడుస్తున్న పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ సంస్థ తమ #PEP3 సినిమా కోసమే ఈ ప్రకటనను విడుదల చేసింది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

