Couple Friendly: సంతోష్ శోభన్ (Santosh Soban) హీరోగా నటిస్తున్న చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ’ (Couple Friendly). ఈ చిత్రంలో మానస వారణాసి (Manasa Varanasi) హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా నిర్మిస్తోంది. అజయ్ కుమార్ రాజు. పి కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాను వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న తెలుగు, తమిళంలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్‌ని యమా జోరుగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం ఈ సినిమా నుంచి ‘గాబరా గాబరా’ లిరికల్ సాంగ్ (Gaabara Gaabara Lyrical Song)ను మేకర్స్ రిలీజ్ చేశారు.
Also Read- Yadhu Vamsee: క్యాస్టింగ్ కాల్.. ‘కమిటీ కుర్రోళ్లు’ దర్శకుడికి అచ్చమైన తెలుగమ్మాయ్ కావాలట!
జానెడు పైకి ఎక్కుదామంటే..
‘‘గాబరా గాబరా సోదరా లైఫ్ మొత్తం, కాలమే తన్నెరా లక్‌ని..
బంతి భోజనంలో బంతిని వడ్డిస్తారా,
చేపను వేపాక చెరువులో వేస్తారా,
సంబంధం లేని పనులనే..
చేస్తున్నాం సిగ్గే పడకనే, చెత్త చేరింది లోనే,
గాబరా గాబరా సోదరా.. లైఫ్ మొత్తం, కాలమే తన్నెరా లక్‌ని ఆమడ దూరం,
జానెడుగా పైనకి ఎక్కుదమంటే, బారెడుగా జీవితం కిందకు జారిపోతుందే రా..’’ అంటూ సాగిన ఈ పాటకు రాకేందు మౌళి సాహిత్యం అందించగా.., ఆదిత్య రవీంద్రన్ క్యాచీ ట్యూన్స్‌తో కంపోజ్ చేశారు. సంతోష్ నారాయణన్ ఈ పాటను ఆలపించారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read- Vishwak Sen: మనం పెట్టిన రాకెట్ అటు, ఇటు తిరిగి.. తరుణ్ భాస్కర్‌పై విశ్వక్ పంచులే పంచులు!
కళాపోషణ లేని లైఫ్
ఈ పాటను గమనిస్తే.. ఏది కలిసి రాని లైఫ్‌కు ఫేట్ ఇచ్చే ట్విస్ట్‌లు, ఎంత ప్రయత్నించినా ఎదురయ్యే రెడ్ లక్‌లు ఎలా ఉంటాయో.. తెలిపేలా ఈ పాట ఉంది. దురదృష్టవంతులకు కేరాఫ్ అడ్రస్‌గా ఈ పాట నిలుస్తుందనడంలో ఆశ్చర్యం లేదు. లైఫ్ అన్నాక కూసంత కళాపోషణ ఉండాలని రావు గోపాలరావు చెబితే.. ఆ కళాపోషణ లేని లైఫ్ ఎలా ఉంటుందో ఈ సాంగ్ చెబుతుంది. సంతోష్ శోభన్ ఈ పాటలో అన్ లకీ ఫెలోగా కనిపిస్తున్నారు. తన ప్రేమకు లింక్ చేస్తూ.. పాటను అద్భుతంగా పిక్చరైజ్ చేశారు. నిజ జీవితంలో జరుగుతున్నట్లుగానే ఈ పాట ఉండటంతో పాటు, చాలా మంది లైఫ్‌లకు చాలా దగ్గరగా ఈ పాట ఉండటం విశేషం. సంతోష్ శోభన్ చాలా న్యాచురల్‌గా ఈ పాటలో కనిపిస్తున్నారు. హీరోయిన్‌ది కూడా సేమ్ ప్రాబ్లమ్ అనేలా ఈ పాటను చూస్తుంటే తెలుస్తోంది. ఫైనల్‌గా.. ఫిబ్రవరి 14కి పర్ఫెక్ట్ ఫిల్మ్ అనే ఫీల్‌ని ఈ పాట ఇస్తోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

