Sattamum Needhiyum
ఎంటర్‌టైన్మెంట్

Sattamum Needhiyum: ఈ సిరీస్ కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారట.. సక్సెస్ కావడంతో!

Sattamum Needhiyum: ‘సట్టముం నీతియుం’ వెబ్ సిరీస్ కోసం నా భర్త ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారని అన్నారు నిర్మాత శశికళ ప్రభాకరణ్ (Sasikala Prabhakaran). శరవణన్ ప్రధాన పాత్రలో నటించిన ‘సట్టముం నీతియుం’ సిరీస్‌ జీ5 ఓటీటీలో విడుదలై బ్రహ్మాండమైన ఆదరణను అందుకుంటున్న నేపథ్యంలో మేకర్స్ హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ‘సంక్రాంతికి వస్తున్నం, రాబిన్‌హుడ్, భైరవం’ వంటి బిగ్ ప్రాజెక్ట్స్ అనంతరం జీ5 (Zee5) ఓటీటీలోకి వచ్చిన వెబ్ సిరీస్ ‘సట్టముం నీతియుం’. 18 క్రియేటర్స్ బ్యానర్‌పై ఈ సిరీస్‌ను శశికళ ప్రభాకరణ్ నిర్మించారు. ఈ షో రన్నర్‌‌గా సూర్య ప్రతాప్. ఎస్ వ్యవహరించారు. బాలాజీ సెల్వరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ తాజాగా తెలుగులో సైతం విడుదలై మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌తో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. ఈ వెబ్ సిరీస్‌ను ప్రేక్షకులు ఆదరిస్తున్న తీరుతో ‘సట్టముమ్ నీతియుమ్’ చిత్రబృందం సక్సెస్ మీట్‌ను నిర్వహించింది.

Also Read- Tollywood: సినీ కార్మికుల సమ్మె.. ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు!

ఈ కార్యక్రమంలో నిర్మాత శశికళ ప్రభాకరణ్ మాట్లాడుతూ.. నిర్మాతగా ఇలా స్టేజ్ మీద మాట్లాడుతుండటం నాకు చాలా కొత్తగా ఉంది. ఇప్పటి వరకు యాంకర్‌గా ఎన్నో సార్లు మైక్ పట్టుకుని మాట్లాడినా కూడా, ఇప్పుడు మాత్రం చాలా కొత్తగా అనిపిస్తోంది. ఇదంతా కూడా నా భర్త ప్రభాకరణ్ వల్లే సాధ్యమైందని చెప్పగలను. ఈ సిరీస్ అందరినీ ఆకట్టుకుంటుందని మేము ముందుగానే ఊహించాం. మేము ఊహించిన దానికంటే, ఈ సిరీస్‌ను ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రేక్షకులందరికీ థాంక్స్. తెలుగులోనూ ఈ సిరీస్ అద్భుతంగా దూసుకుపోతోంది. ఈ సిరీస్‌కు పని చేసిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. బాలాజీ ఈ సిరీస్‌ను కేవలం 13 రోజుల్లోనే పూర్తి చేశారు. ఆయన వల్లే ఈ సిరీస్ ఇంత గొప్పగా వచ్చింది. ఆర్ట్ డైరెక్టర్ భావన మాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. శరవణన్ సర్ ఈ సిరీస్‌కు బ్యాక్ బోన్‌‌లా నిలబడి సపోర్ట్ ఇచ్చారు. నమ్రత ప్రస్తుతం చాలా బిజీగా మారిపోయింది. ఈ సిరీస్‌‌లో అందరూ అద్భుతంగా నటించారు. నా భర్త ప్రభాకరణ్‌కు వెబ్ సిరీస్‌లు, సినిమాల పట్ల ఎంతో ప్యాషన్ ఉంది. ఆయనకు ఈ ప్రాజెక్ట్ చాలా ప్రత్యేకం. ఆయన ఈ సిరీస్ కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఆడియెన్స్‌ అందరికీ, జీ5 వారికి థ్యాంక్స్ అని చెప్పారు.

Also Read- Mass Jathara: ‘ఓలే ఓలే’.. రవితేజ-శ్రీలీల డ్యాన్స్ చూడటానికి రెండు కళ్లు చాలవ్!

జీ5 బిజినెస్ సౌత్ హెడ్, సౌత్ మార్కెటింగ్ హెడ్ లాయిడ్ జేవియర్ మాట్లాడుతూ.. మా సంస్థకు మీడియా ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. ఈ మధ్య చాలా గొప్ప సినిమాలు, సిరీస్‌లను ప్రేక్షకులకు అందించాం. ఇప్పుడు ‘సట్టముం నీతియుం’ కూడా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. పది రోజుల్లోనే వంద మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌ను దాటేసింది. 13 రోజుల్లోనే ఇంత మంచి సిరీస్‌ను తెరకెక్కించడమనేది మామూలు విషయం కాదు. పబ్లిక్ డిమాండ్ వల్లే ఈ సిరీస్‌ను ఇతర భాషల్లోకి డబ్ చేయడం జరిగింది. ప్రస్తుతం తెలుగులోనూ ఈ సిరీస్ మంచి ఆదరణను రాబట్టుకుంటూ, బ్లాక్ బస్టర్‌ సక్సెస్‌ను సాధించింది. ఈ సిరీస్‌ను సక్సెస్ చేసిన ఆడియెన్స్‌‌కి థాంక్స్’ అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో బాలాజీ సెల్వరాజ్, నటుడు శరవణన్, ప్రభాకరణ్ వంటి వారంతా మాట్లాడారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

SCU: సుజీత్ సినిమాటిక్ యూనివర్స్.. దర్శకనిర్మాతలు క్లారిటీ ఇచ్చేశారుగా..!

Arjun Das: ఓరి నీ అభిమానం చల్లగుండా.. మరీ ఇంత పెద్ద మెసేజ్ ఏంటయ్యా?

Sandeep Raj: ‘ఓజీ’ విడుదల వేళ.. 8 సంవత్సరాల క్రితం చేసిన ట్వీట్‌‌‌తో సంచలనం!

O Cheliya Teaser: హీరో శ్రీకాంత్ వదిలిన ‘ఓ.. చెలియా’ టీజర్ ఎలా ఉందంటే?

Connplex Cinemas: ‘ఓజీ’ సినిమాతో హైదరాబాద్‌లో మరో లగ్జరీ మల్టీప్లెక్స్‌ ప్రారంభం.. వివరాలివే!