Mass Jathara: మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) హీరోగా నటిస్తున్న 75వ చిత్రం ‘మాస్ జాతర’ (Mass Jathara). భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై ఎటువంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకు కారణం ‘ధమాకా’ (Dhamaka) జోడీనే. అవును ఇందులో రవితేజ సరసన మరోసారి శ్రీలీల (Sreeleela) జతకడుతోంది. అలాగే ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. మరీ ముఖ్యంగా ఇటీవల వచ్చిన ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘తు మేరా లవర్’ సెన్సేషన్‌ను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం ఈ చిత్ర మేకర్స్ రెండవ గీతంగా ‘ఓలే ఓలే’ను విడుదల చేశారు. ఈ పాట ఎలా ఉందంటే.. రవితేజ – శ్రీలీల జోడి డ్యాన్స్ చూసేందుకు రెండు కళ్లు చాలడం లేదంటే నమ్మాలి.
Also Read- Coolie Vs War 2: ఓవర్సీస్ లో ‘కూలీ’ Vs ‘వార్ 2’ సినిమాల్లో గెలుపెవరిదంటే..
పాట వింటూ అందరూ కాలు కదిపేలా ఎంతో ఉత్సాహభరితంగా ఈ సాంగ్ ఉంది. ‘ధమాకా’ జోడి రవితేజ – శ్రీలీల ఇద్దరూ మెస్మరైజింగ్ డ్యాన్స్‌తో సందడి సందడి చేసి పడేశారు. ఇంకా చెప్పాలంటే దుమ్ము లేపేశారు. ‘ఓలే ఓలే’ పాటతో ఈ జోడి మరోసారి తమ టాలెంట్‌తో ఆకట్టుకుంటున్నారు. ఇద్దరూ పోటాపోటీగా డ్యాన్స్ చేసి పాటను మరో స్థాయికి తీసుకెళ్ళారు. రవితేజ తన వింటేజ్ స్టెప్పులతో అలరించగా, శ్రీలీల తన అసాధారణ డ్యాన్స్ ప్రతిభతో మరోసారి కట్టిపడేశారు. ఇద్దరూ కలిసి ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా తెరపై తమ డ్యాన్స్‌తో మెరుపులు మెరిపిస్తున్నారు. సంక్రాంతికి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో సెన్సేషన్‌ని క్రియేట్ చేసిన సంగీత సంచలనం భీమ్స్ సిసిరోలియో తనదైన శైలిలో ఈ ‘ఓలే ఓలే’ పాటను స్వరపరిచారు.
Also Read- Upasana: మెగా కోడలికి తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు.. చిరు రియాక్షన్ చూశారా?
మాస్ మహారాజా అభిమానులకు, మాస్ ప్రేక్షకులకు విందు భోజనంలా ఈ పాట ఉందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. థియేటర్లలో ప్రేక్షకుల చేత.. ఈలలు, చప్పట్లతో స్టెప్పులు వేయించేలా.. ఊర మాస్ స్టెప్స్‌తో ఎంతో ఉత్సాహభరితంగా ఈ సాంగ్ ఉంది. భీమ్స్ సిసిరోలియో, రోహిణి సోరట్ ఆలపించిన ఈ పాటు భాస్కర్ యాదవ్ దాసరి అందించిన సాహిత్యం ఉల్లాసంగానూ, ఆకర్షణీయంగానూ ఉంది. పాట మూడ్‌కి సరిపోయే మాస్ ఫ్లేవర్‌తో ఆయన సాహిత్యాన్ని అందించారు. సంగీతం, సాహిత్యం, గాత్రం అన్నీ కలగలిసి ఈ ‘ఓలే ఓలే’ పాటను అదిరిపోయే మాస్ గీతంగా మలిచాయి. ఇప్పటి వరకు వచ్చిన పాటలను చూస్తుంటే.. దర్శకుడు భాను బోగవరపు.. మాస్ మహారాజా అభిమానులతో పాటు, మాస్ ప్రేక్షకులు మెచ్చే విధంగా ఈ ‘మాస్ జాతర’ను మలుస్తున్నారనేది అర్థమవుతోంది. మాస్ రాజా వింటేజ్ వైబ్స్, కమర్షియల్ హంగులతో ఈ చిత్రంతో థియేటర్లలో మాస్ పండుగను తీసుకురాబోతుందనే హింట్ ఆల్రెడీ ప్రేక్షకులలోకి కూడా వెళ్లిపోయింది. అందుకే ఈ సినిమాపై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఫుల్ మీల్స్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 27న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు