Upasana: ఉపాసన కామినేని కొణిదెల.. ఈ పేరుకి పరిచయం అక్కరలేదు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global Star Ram Charan) భార్యగా, మెగా కోడలిగా ఆమె అందరికీ పరిచయమే. అంతేకాదు, అపోలో బాధ్యతలను దిగ్విజయంగా నిర్వహిస్తూ, సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ చేసే చారిటీ… తన పేరుకు ఉన్న కామినేని, కొణిదెల రెండు ఫ్యామిలీలకు మంచి పేరును, ఖ్యాతిని తీసుకొస్తున్నాయి. ఇప్పుడామెకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక పదవిని అప్పగించింది. తెలంగాణ రాష్ట్ర క్రీడా అభివృద్ధిలో కీలక అడుగు వేస్తూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) నాయకత్వంలోని ప్రభుత్వం 2025 స్పోర్ట్స్ పాలసీ క్రీడా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాన్ని బలపరిచేలా తెలంగాణ స్పోర్ట్స్ హబ్ (Sports Hub of Telangana) బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్‌ను ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ హబ్‌కు కో-ఛైర్‌పర్సన్‌గా తెలంగాణ ప్రభుత్వం ఉపాసనను ఎంపిక చేసింది. బోర్డు ఛైర్మన్‌గా లక్నో సూపర్ జెయింట్స్ యజమాని, పారిశ్రామికవేత్త సంజయ్ గోయెంకా నియమించింది.
Also Read- King Nagarjuna: ‘కూలీ’ చివరిరోజు రజనీ సర్ అందరినీ పిలిచి తలో ఒక ప్యాకెట్ ఇచ్చారు
ఈ విషయం చెబుతూ ఉపాసన సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ కో-ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వానికి ఉపాసన కృతజ్ఞతలు తెలిపారు. ‘‘తెలంగాణను గ్లోబల్ స్పోర్ట్స్ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేయడానికి ఇది నాకు లభించిన గొప్ప అవకాశం. సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సంజీవ్ గోయెంకాతో కలిసి పనిచేసే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నాను. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో దేశానికి ఆదర్శంగా నిలిచే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు ఇది తొలి మెట్టు’’ అని ఉపాసన తన పోస్ట్‌లో పేర్కొన్నారు. తన కోడలు ఉపాసనకు ఈ పదవి దక్కడంపై మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కూడా సోషల్ మీడియా వేదికా సంతోషం వ్యక్తం చేశారు.
Honoured to be the Co Chairman of the Sports Hub of Telangana alongside @sanjivgoenka Ji to shape Telangana into a global sports force.
Grateful to Shri @revanth_anumula Garu and the Government of Telangana for this bold vision.
This is a powerful step towards building… pic.twitter.com/Xz3k1LWFnw
— Upasana Konidela (@upasanakonidela) August 4, 2025
‘‘మా కోడలు ఉపాసన ఇప్పుడు తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ కో-ఛైర్‌పర్సన్. తెలంగాణ ప్రభుత్వం ఆమెను ఈ గౌరవప్రదమైన పదవిలో నియమించడం చాలా సంతోషంగా ఉంది. ఇది గౌరవం అనడం కంటే, బాధ్యతను మరింత పెంచిందని చెప్పాలి. డియర్ ఉపాసన.. మీకున్న నిబద్ధత, ప్యాషన్‌తో క్రీడాకారుల్లో దాగి ఉన్న అపార ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తారని, టాలెంట్ ఉన్నవారిని అగ్ర స్థానంలో నిలబెట్టడానికి తగిన విధి విధానాలను రూపొందించడంలో మీ వంతు కృషి చేస్తావని ఆశిస్తున్నాను. ఎప్పుడూ నీకు ఆ దేవుడి దీవెనలు తోడుగా ఉంటాయి’’ అని చిరంజీవి పేర్కొన్నారు.
Also Read- Rajinikanth: ‘బాషా’ సినిమాకు ఆంటోని ఎలాగో.. ‘కూలీ’ సినిమాకు సైమన్ అలాగే.. నాగ్ అదరగొట్టేశాడు
బోర్డు ఛైర్మన్‌గా సంజయ్ గోయెంకా, కో-ఛైర్‌పర్సన్‌గా ఉపాసన ఎంపికైన తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ బోర్డులో సభ్యులుగా సన్ టీవీ నెట్‌వర్క్ అధినేత్రి కావ్య మారన్ (సన్‌రైజర్స్ కావ్య పాప), మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, ఫుట్‌బాల్ స్టార్ భైచుంగ్ భూటియా, ఒలింపిక్ స్వర్ణ విజేత అభినవ్ బింద్రా, రవికాంత్ రెడ్డి వంటి ప్రముఖులకు చోటు కల్పించారు.
Our ‘Kodalu’ is the Co – Chairperson of Telangana Sports Hub now ☺️
Delighted at the appointment of @upasanakonidela to the esteemed position. It is as much an honour as much as it is a great responsibility.
Dear Upasana,
I am sure with your commitment and passion you will…
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 4, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు