court (image source :X)
ఎంటర్‌టైన్మెంట్

Sattamum Needhiyum: మరో ఆసక్తికర కోర్టు రూమ్ డ్రామా ఓటీటీలోకి.. ఎప్పుడంటే?

Sattamum Needhiyum: తెలుగులో కోర్టు రూమ్ డ్రామా కథలను ప్రేక్షకులు అమితంగా ఆదరిస్తున్నారు. ఇటీవల వచ్చిన శివాజీ ‘కోర్టు’ సినిమా ఏ స్థాయిలో హిట్ అయిందో తెలిసిందే. తాజాగా అలాంటి కథతోనే తమిళంలో ఓ వెబ్ సిరీస్ వచ్చి సూపర్ హిట్ అయింది. తమిళంలో రూపొందించిన ‘సట్టముమ్ నీతియుమ్’ వేబ్ సిరీస్ తెలుగులో కూడా తీసుకొచ్చేందుకు జీ5 సిద్ధమవుతోంది. జూలై 18 నుంచి తమిళ వర్షెన్ జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తెలుగు, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతోందని మేకర్లు ప్రకటించారు. పవర్ ఫుల్ సీన్స్, ఉత్కంఠభరితమైన కోర్టు సన్నివేశాలు, భావోద్వేగాలతో నిండిన ఈ సిరీస్ ఆగస్ట్ 1న తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘సట్టముమ్ నీతియుమ్‌’ను బాలాజీ సెల్వరాజ్ తెరకెక్కించారు. 18 క్రియేటర్స్ బ్యానర్‌పై శశికళ ప్రభాకరన్ ఈ సిరీస్‌ను నిర్మించారు. ఇప్పటికే తమిళంలో హిట్ టాక్ తెచ్చుకోవడంతో తెలుగులో విడుదల కోసం ఇక్కడి ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తు్న్నారు.

Read also- Viral News: కుక్కకు నివాస ధ్రువీకరణ పత్రం కోరుతూ అప్లికేషన్.. కలెక్టర్ ఏం చేశారంటే?

ఈ సిరీస్ ఓటీటీలోకి రానున్న సందర్భంగా నటుడు శరవణన్ మాట్లాడుతూ.. ‘‘సట్టముమ్ నీతియుమ్’ కథ విన్న వెంటనే అది నా మనసును తాకింది. ఇది రెగ్యులర్ కోర్ట్ డ్రామా కాదు. ఈ కథ సామాన్యుడి బలం గురించి మాట్లాడుతుంది. ధైర్యంగా నిలబడి పోరాడే ఓ కామన్ మెన్‌ను చూపిస్తుంది. ఇలాంటి ప్రాజెక్టులో నేను భాగం అవ్వాలని కథ విన్నవెంటనే నిర్ణయించుకున్నాను. 15 ఏళ్ల తర్వాత మళ్లీ ఇలాంటి ఓ పవర్ ఫుల్ పాత్రను పోషించాను. ఈ సిరీస్ అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు. జీ5 తమిళ, మళయాళం బిజినెస్ హెడ్ లాయిడ్ జేవియర్ మాట్లాడుతూ.. ‘జీ5లో మేము నిరంతరం వినోదాత్మకంగానే కాకుండా సామాజికంగా ముఖ్యమైన కథలను కూడా అందించడానికి ప్రయత్నిస్తాము. ‘సట్టముమ్ నీతియుమ్’తో న్యాయం, సత్యం వంటి అంశాలతో సామాజిక కథను అందించాం. అందరినీ మెప్పించేలా మా సిరీస్ ఉంటుంది’ అని అన్నారు.

Read also- Vijay Deverakonda: ‘కింగ్‌డమ్’ యుద్ధం కూడా అలాంటిదే..

‘సట్టముమ్ నీతియుమ్’ ఒక గ్రామీణ లీగల్ థ్రిల్లర్. ఒక దళిత యువకుడు అనుమానాస్పదంగా మరణించిన తరువాత, పోలీసుల అక్రమ అరెస్టులు మొదలవుతాయి. ఈ కేసు విచారణకు హైకోర్టు ఓ ప్రత్యేక విచారణాధికారిని నియమిస్తుంది. నిజం తెలుసుకునే క్రమంలో, పోలీస్ వ్యవస్థలోని లోపాలు, వర్గ వివక్ష, అధికార దుర్వినియోగం బయటపడతాయి. న్యాయం కోసం నిరుద్యోగ యువతీ యువకులు, స్థానిక నాయకులు పోరాడతారు. నిజం కోసం సాగిన ఈ లీగల్ పోరాటం ఆద్యంతం ప్రేక్షకుల్ని ఆలోచింపజేసేలా ఉంటుంది. కథ పరంగా మంచి డెప్తు ఉండటంతో ఈ సిరీస్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.

Just In

01

Telugu Reality Shows Impact: తెలుగు రియాలిటీ షోల వల్ల ఎంటర్‌టైన్మెంట్ తప్పుదారి పడుతుందా?.. అసలు వాటి వల్ల లాభమా?.. నష్టమా?

Medchal News: వివాదంలో శ్రీ శివ్వంపేట పోచమ్మ-మైసమ్మ ఆలయం.. నోటీసులు జారీ..!

Gold Price Today: అతి భారీగా పెరిగి బిగ్ షాకిచ్చిన గోల్డ్ రేట్స్?

SEBI Warning: మెరిసే ప్రతి పెట్టుబడి సురక్షితం కాదు.. డిజిటల్ గోల్డ్‌పై జాగ్రత్త.. SEBI హెచ్చరిక

RV Karnan: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం: ఎన్నికల అధికారి కర్ణన్