Sankranthi 2026: బిగ్ బాస్ తర్వాత కళ్యాణ్, తనూజ కలిసి డ్యాన్స్..
Kalyan and Tanuja (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Sankranthi 2026: కళ్యాణ్ పడాల, తనూజ కలిసి డ్యాన్స్.. బిగ్ బాస్ తర్వాత మళ్లీ ఈ వేడుకలోనే!

Sankranthi 2026: ఇప్పటి వరకు బిగ్ బాస్ తెలుగు షో 9 సీజన్లు ముగించుకుంది. గత 8 సీజన్లు ఏమోగానీ, 9వ సీజన్ (Bigg Boss Telugu Season 9) మాత్రం హాట్ టాపిక్ అయ్యింది. అందుకు కారణం సామాన్యులు ఎక్కువగా హౌస్‌లోకి అడుగు పెట్టడమే. అలాగే విన్నర్ కూడా సామాన్యుడే నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కళ్యాణ్ పడాల బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. సెలబ్రిటి తనూజ (Tanuja) రన్నరప్‌గా నిలిచింది. మూడో ప్లేస్‌ మళ్లీ సామాన్యుడినే వరించింది. ఇక ఈ హౌస్‌లో కళ్యాణ్ (Kalyan Padala), తనూజల కెమిస్ట్రీపై ఎలాంటి వార్తలు వచ్చాయో తెలియంది కాదు. హౌస్‌లో ఉన్నప్పుడు చాలా మంది.. బయటకు వెళ్లిన తర్వాత కూడా మీరు ఇలాగే ఉంటారా? అని పలు సందర్భాల్లో ప్రశ్నించారు. మరి వారు అడిగారనో, లేదంటే పరిస్థితులు అలా కల్పిస్తున్నాయో తెలియదు కానీ.. ఈ సంక్రాంతికి వారిద్దరూ ఓ కార్యక్రమంలో కలిసి డ్యాన్స్ చేశారు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ ప్రోమోని గమనిస్తే..

Also Read- The Raja Saab: ‘ది రాజా సాబ్’ థియేటర్లో మొసళ్లు.. వీళ్లు మాములు ఫ్యాన్స్ కాదు బాబోయ్!

మా సంక్రాంతి వేడుక

స్టార్ మా ఛానల్ ఈ సంక్రాంతికి ‘మా సంక్రాంతి వేడుక’ (Maa Sankranthi Veduka) అంటూ ఓ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తోంది. శ్రీముఖి (Srimukhi) హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ఈ వేడుకకు సీరియల్ సూపర్ స్టార్స్, బిబి బ్లాస్టర్స్, వీకెండ్ ఎంటర్‌టైనర్స్ అంటూ మూడు గ్రూపులుగా ఈ సంక్రాంతిని ప్లాన్ చేశారు. ఇందులో బిబి బ్లాస్టర్స్‌గా ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లిన చాలా మంది కంటెస్టెంట్ హాజరవుతున్నారు. కళ్యాణ్, తనూజలతో పాటు ఇమ్మానుయేల్, డిమోన్ పవన్, రీతూ, రమ్య, మాధురి వంటి వారంతా ఉన్నారు. వారితో స్టార్ మా గట్టిగానే ఈ వేడుకను ప్లాన్ చేసింది. అదిరిపోద్ది ఈ సంక్రాంతి అంటూ శ్రీముఖి కూడా అల్లరల్లరి చేస్తోంది. ప్రభాకర్, డాక్టర్ బాబు కలిసి ‘మన శంకర వర ప్రసాద్ గారు’లోని చిరు, వెంకీ సాంగ్‌ ‘మెగా విక్టరీ మాస్’కు డ్యాన్స్ చేస్తున్నారు. తనూజని ఓ రాణిలా ఇంట్రడ్యూస్ చేశారు. అవినాష్ కామెడీ హైలెట్ అనేలా ఉంది. సంక్రాంతికి ఏమేం చేస్తారో అవన్నీ ఈ వేడుకలో చేస్తున్నారు.

Also Read- Jana Nayagan: ‘అఖండ 2’కు ఆర్థిక ఇబ్బందులు.. మరి ‘జన నాయగన్’కు?

అన్నయ్యకు ఆశీస్సులు, తమ్ముడకి సూట్‌కేస్‌లు

ఇమ్యానుయేల్‌పై మంచి పంచ్‌లు పడుతున్నాయి. అన్నయ్యకు ఆశీస్సులు, తమ్ముడకి సూట్‌కేస్‌లు అంటూ గట్టిగానే ఇస్తున్నారు. స్పెషల్ అట్రాక్షన్‌గా రాహుల్ సిప్లిగంజ్ దంపతులు ఈ వేడుకలో సందడి చేశారు. వారి లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చారు. ఇక కళ్యాణ్, తనూజలు కలిసి ఇటీవల వచ్చిన ‘చాంఫియన్’ సినిమాలోని ‘గిర గిర గింగిరాగిరే’ పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్నారు. వారిద్దరు కూడా ఈ వేడుకలో చాలా స్పెషల్‌గా కనిపిస్తున్నారు. మరి విన్నర్, రన్నర్ అని వాళ్లని అలా కలిపారో, లేదంటే వారి కెమిస్ట్రీని వాడుకోవాలని భావించారో తెలియదు కానీ, ఇద్దరు జంటగా చాలా బాగా కనిపించారు. అందుకే ఇమ్మానుయేల్ వారిద్దరికి దిష్టి కూడా తీశారు. ఆ తర్వాత అనిల్ రావిపూడి ఎంట్రీ ఇచ్చారు. తన సినిమా ప్రమోషన్ నిమిత్తం వచ్చిన ఆయన కూడా రెండు పంచ్‌లు పేల్చారు. అంతేనా, అందరితో కలిసి సినిమాలోని ‘ఏంటి బాసు సంగతి’ పాటకు డ్యాన్స్ కూడా వేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇక ఈ వీడియో విడుదల తర్వాత కళ్యాణ్, తనూజల ఫ్యాన్స్ మళ్లీ డ్యూటీ ఎక్కేశారు. కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Silent Screams: వరంగల్, ఆసిఫాబాద్, నల్గొండ జిల్లాలతో శృతి హాసన్‌కున్న లింకేంటి?

Medchal: మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో.. నిందితుడికి రెండేళ్ల జైలు..!

Jio IPO 2026: జియో ఐపీవో కోసం ఎదురుచూస్తున్నవారికి బిగ్ అప్‌డేట్

Telangana High Court: ‘రాజా సాబ్’ నిర్మాతకు షాక్.. టికెట్ ధరల హైక్ మెమోని కొట్టేసిన హైకోర్టు!

Fire Accident: కారేపల్లి జిన్నింగ్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం.. సంఘటన పై అనుమానాలెన్నో..?