Sanjay Dutt: బాలీవుడ్ ఖల్ నాయక్ సంజయ్ దత్ (Sanjay Dutt) కారు దిగితే ఒక వైబ్.. అలాంటిది ఆయన కారే ఒక వింతగా ఉంటే? ప్రస్తుతం ముంబై వీధుల్లో అదే జరుగుతోంది. అవును, నిన్నమొన్నటి వరకు ‘ధురంధర్’ సినిమాలో ఎస్పీ చౌదరి అస్లాంగా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంజయ్ దత్, ఇప్పుడు తన రియల్ లైఫ్ కొత్త రైడ్‌తో సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తున్నారు. అదే ఎలన్ మస్క్ కలల ప్రాజెక్ట్ ‘టెస్లా సైబర్‌ట్రక్’ (Tesla Cybertruck). సంజయ్ దత్ టెస్లా సైబర్‌ట్రక్‌ను డ్రైవ్ చేస్తూ.. స్టైలిష్‌గా దిగుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంకా భారత్‌లో టెస్లా కార్లు అధికారికంగా లాంచ్ జరగలేదనే విషయం తెలిసిందే. మరి సంజయ్ దత్ దగ్గరికి ఎలా వచ్చిందంంటూ అంతా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. దీని వెనుక ఉన్న కథ విషయానికి వస్తే..
Also Read- MSG Collections: ‘మన శంకర వర ప్రసాద్ గారు’ 5 డేస్ కలెక్షన్స్.. మైండ్ బ్లోయింగ్!
హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలోని కారులా
ప్రస్తుతం సంజయ్ దత్ దుబాయ్‌లో ఉంటున్న విషయం తెలిసిందే. ఈ కారుని గమనిస్తే.. దుబాయ్ రిజిస్ట్రేషన్ నంబర్‌లానే ఉంది. బహుశా ఆయన దుబాయ్ నుంచి కార్నెట్ పర్మిట్ ద్వారా దీనిని ముంబైకి తెప్పించి ఉండవచ్చు. పైగా ఇది లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ కావడం విశేషం. దీని విలువ సుమారు 80,000 డాలర్లు (దాదాపు ₹72 లక్షలు) ఉంటుందని అంచనా, కానీ ఇండియాకు దిగుమతి చేసుకుంటే ఆ లెక్కలు కోట్లలోనే ఉంటాయి. అయినా కూడా అంత ఖర్చు పెట్టి ఖల్ నాయక్ ఈ కారును ఇండియా వీధుల్లోకి తెచ్చారు. ఇది చూడటానికి ఏదో హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలోని కారులా అనిపిస్తుండటం విశేషం. ఇంకా దీని బాడీ మొత్తం స్టెయిన్ లెస్ స్టీల్‌తో తయారు చేశారు. ఇది దాదాపు బుల్లెట్ ప్రూఫ్. ఇంకా కేవలం 3 సెకన్లలోనే 100 కి.మీ వేగాన్ని అందుకుంటుందనేలా దీని ఫీచర్స్ ఉన్నాయి. హాలీవుడ్ స్టార్స్ కిమ్ కర్దాషియాన్, జస్టిన్ బీబర్ వంటి వారి దగ్గర మాత్రమే ఉన్న ఈ కారు.. ఇప్పుడు సంజయ్ దత్ గ్యారేజీలోకి కూడా చేరింది.
Also Read- AR Rahman: ముస్లిం అయిన మీరు ‘రామాయణ’కు ఎందుకు వర్క్ చేస్తున్నారని అడిగితే..
బాక్సాఫీస్ వద్ద కూడా బాధేస్తున్నాడు
కార్ల విషయంలోనే కాదు, సినిమాల విషయంలోనూ సంజయ్ దత్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ఇండియన్ సినిమాలో ఏ నటుడికి లేని విధంగా సంజయ్ దత్‌కు మూడు వెయ్యి కోట్ల చిత్రాలు ఉండటం విశేషం. ప్రభాస్ ‘ది రాజా సాబ్’ మిస్సయింది కానీ, లేదంటే 4వ చిత్రం కూడా ఆయన ఖాతాలో ఉండేది. ‘కెజియఫ్ చాప్టర్ 2’ (KGF Chapter 1), ‘జవాన్’ (Jawan), ‘దురంధర్ పార్ట్ 1’ (Dhurandhar Part 1) చిత్రాలు వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్‌ని రాబట్టిన విషయం తెలిసిందే. ఈ మూడు చిత్రాల్లోనూ సంజయ్ దత్ భాగమయ్యారు. సంక్రాంతి కానుకగా వచ్చిన ‘ది రాజా సాబ్’ (The Raja Saab)లో సంజయ్ దత్ ఒక పవర్‌ఫుల్ రోల్‌లో మెరిశారు. త్వరలో ఆయన నుంచి ‘ధురంధర్ పార్ట్ 2’తో పాటు, కన్నడ మూవీ ‘KD: ది డెవిల్’, మరాఠీ వీరుడు ‘రాజా శివాజీ’ బయోపిక్స్ రానున్నాయి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

