MSG Collections: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), హిట్ మెషిన్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో వచ్చి బాక్సాఫీస్ దగ్గర మెగా బ్లాక్ బస్టర్‌గా దుమ్మురేపుతోన్న చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu). గత సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’తో భారీ విజయాన్ని అందుకున్న విక్టరీ వెంకటేష్ ఇందులో కీలక పాత్రలో నటించగా, లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటించారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీమతి అర్చన సమర్పించారు. సినిమా విడుదలకు ముందు రోజు పడిన ప్రీమియర్స్ నుంచే టాక్ అదరగొట్టిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’.. భారీ పోటీ ఉన్నా కూడా కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నారు. ఫలితంగా న్యూ రికార్డులు బాక్సాఫీస్‌కు పరిచయమవుతున్నాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమా సాధించిన 5 రోజుల కలెక్షన్ల వివరాలతో ఓ పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్ ప్రకారం..
Also Read- Euphoria Trailer: గుణశేఖర్ ‘యుఫోరియా’ మూవీ ట్రైలర్.. సమాజానికి ఈ సినిమా అవసరం.. డోంట్ మిస్!
5 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతంటే..
ఈ సినిమా విడుదలకు ముందు ప్రీమియర్స్‌తో రాబట్టిన అమౌంట్‌తో పాటు మొత్తం 5 రోజులకుగానూ ప్రపంచవ్యాప్తంగా రూ. 226 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను (MSG 5 Days WW Collections) రాబట్టినట్లుగా అధికారికంగా పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో మెగాస్టార్ చిరంజీవి తనదైన మ్యానరిజమ్‌తో ఇచ్చిన పోజు ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అయ్యేలా చేస్తుంది. ఇంతకు ముందు ఈ సినిమా రూ. 200 కోట్ల క్లబ్‌లోకి చేరినట్లుగా చెబుతూ విడుదల చేసిన పోస్టర్‌లో హీరో చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి స్టైలిష్‌గా నడుచుకుంటూ వస్తున్నారు. వెనుక బ్యాక్‌గ్రౌండ్‌లో కలెక్షన్ల వివరాలతో పాటు మెగా సంక్రాంతి బ్లాక్‌బస్టర్ అని మేకర్స్ తెలియజేశారు. మరో రికార్డ్ ఏమిటంటే.. ఈ చిత్రం రీజనల్ ఫిల్మ్స్‌లో ఇప్పటి వరకు ఏ చిత్రానికి లేని విధంగా 5వ రోజు రికార్డ్ కలెక్షన్స్‌ని రాబట్టడం. ఈ విషయంలో ‘బాహుబలి 2, ఆర్ఆర్ఆర్’ చిత్రాలను కూడా ఈ సినిమా అధిగమించింది.
Also Read- Bandla Ganesh: సుద్దపూస.. బండ్ల న్యూ అవతార్ చూశారా? డీజే కొట్టు మామా!
ఆల్ ఏరియాస్ క్లీన్ స్వీప్
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ‘మన శంకర వర ప్రసాద్ గారు’ 5వ రోజు ఒక్కరోజే దాదాపు రూ. 15 కోట్లు రాబట్టినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం రెండో స్థానంలో ఉంది. ఇప్పటికే ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాకు చాలా ఏరియాల్లో బ్రేకీవెన్ అయిపోయి లాభాల బాట పట్టినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం 98 శాతం రికవరీ అయినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక శనివారం, ఆదివారం కూడా ఈ సినిమా హౌస్‌ఫుల్ కలెక్షన్లతో నడవబోతున్నట్లుగా బుక్ మై షో రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఎలా చూసినా, ఈ సినిమా నిర్మాతలకు కోట్లలోనే లాభాలు రానున్నాయి. అన్ని ఏరియాల్లో ఈ సినిమా క్లీన్ స్వీప్ చేసినట్లుగా మేకర్స్ కూడా సంతోషంగా చెబుతున్నారు. కేవలం వారం రోజులకే ఈ సినిమా.. లాస్ట్ ఇయర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్ర ఫుల్ రన్‌ని బీట్ చేస్తుండటం చూస్తుంటే.. మెగాస్టారా మజాకానా? అనేలా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
#ManaShankaraVaraPrasadGaru continues to conquer every territory with unanimous dominance 😎🔥
₹226 Crore+ gross worldwide in just 5 days for the #MegaSankranthiBlockbusterMSG ❤️🔥❤️🔥
ALL-TIME RECORD FOR A REGIONAL FILM 💥💥💥
A sensational weekend is on the cards for #MSG 🔥 pic.twitter.com/hopeIaUK89
— Shine Screens (@Shine_Screens) January 17, 2026
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

