Bandla Ganesh: టాలీవుడ్ వింటేజ్ క్లాసిక్ జోడీ శివాజీ (Sivaji), లయ (Laya) మళ్ళీ వెండితెరపై మెరవబోతున్న విషయం తెలిసిందే. శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుధీర్ శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘సాంప్రదాయని సుప్పిని సుద్దపూసని’ (Sampradayini Suppini Suddapoosani) అనే వెరైటీ టైటిల్‌ని ఖరారు చేసి, ఇటీవలే ఫస్ట్ లుక్‌ని కూడా వదిలారు. 90s వెబ్ సిరీస్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన శివాజీ, ఇందులో పంచాయతీ సెక్రెటరీ శ్రీరామ్‌గా అలరించబోతున్నారు. ఈ ప్రాజెక్టులో రోహన్, అలీ, ధనరాజ్ వంటి భారీ తారాగణం ఉండటం సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఇక ఈ సినిమా అసలు సిసలు హైలైట్ ఎవరంటే బ్లాక్ బస్టర్ బండ్ల గణేష్ (Bandla Ganesh). ఎప్పుడూ తన మాటలతో, పవర్ ఫుల్ స్పీచ్‌లతో సోషల్ మీడియాను షేక్ చేసే బండ్లన్న, ఈసారి ‘డీజే బండ్ల’గా కొత్త అవతారమెత్తారు.
Also Read- Harsha Vardhan: వస్త్రధారణ అనేది స్వేచ్ఛలో ఒక అంశం మాత్రమే.. శివాజీ, అనసూయ కాంట్రవర్సీలోకి హర్ష!
బండ్లన్నతో స్టెప్పులు
అవును, బండ్ల గణేష్ మళ్లీ కాస్త గ్యాప్ తర్వాత ఈ సినిమాలో ఓ పాత్ర చేసినట్లుగా అర్థమవుతోంది. ఇందులో ఆయనకు ఓ పాట కూడా ఉన్నట్లుగా తాజాగా వదిలిన ప్రోమో తెలియజేస్తోంది. ‘పాయ పాయ’ (Paya Paya Song) అంటూ వచ్చిన సాంగ్ ప్రోమోలో ఆయన వేసిన స్టెప్పులు చూస్తుంటే ఫ్యాన్స్‌కు పూనకాలు రావడం ఖాయం అనిపిస్తోంది. బండ్లన్న ఎనర్జీకి, ఆ డీజే బీట్ తోడవ్వడంతో ఈ ప్రోమో ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. వింటేజ్ మెలోడీలు, కామెడీ పంచ్‌లు, దానికి తోడు బండ్ల గణేష్ మాస్ డ్యాన్స్.. వెరసి ఈ సినిమా ఒక కంప్లీట్ ఎంటర్‌టైనర్‌లా కనిపిస్తోంది. ముఖ్యంగా శివాజీ-రోహన్ కాంబో మళ్ళీ రిపీట్ అవ్వడం, ఈటీవీ విన్ భాగస్వామ్యం ఉండటం సినిమాపై పాజిటివ్ వైబ్స్‌ని క్రియేట్ చేశాయి.
చిత్తూరు బ్యాక్ డ్రాప్‌లో
త్వరలోనే విడుదల కానున్న ఫుల్ సాంగ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బండ్లన్న ఈసారి డీజే కొట్టి ఏ రేంజ్ రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి మరి! ఈ ప్రోమోలో అలీ కూడా మరో విభిన్నమైన పాత్రలో కనిపిస్తున్నారు. ఇంతకు ముందు వచ్చిన మోషన్ పోస్టర్‌ను కూడా మేకర్స్ చాలా క్రియేటివ్‌గా రెడీ చేశారు. చిత్తూరు బ్యాక్ డ్రాప్‌లో జరిగే కథలో ఒక క్రైమ్ ఎలిమెంట్ కూడా వున్నట్లు మోషన్ పోస్టర్ తెలియజేయడమే కాకుండా, సినిమాపై ఆసక్తిని పెంచింది. ఇప్పుడు, ఎప్పుడూ లేనిది బండ్లన్నతో స్టెప్పులేయించి, సినిమాపై ఇంకాస్త ఆసక్తిని పెంచేశారు. చూద్దాం.. మరి ఈ పాట, బండ్ల డ్యాన్స్ ఈ సినిమాకు ఏ విధంగా హెల్ప్ అవుతుందో..
. @ganeshbandla steps onto the dance floor for the first time ever in the #PayaPaya Song from #SampradayiniSuppiniSuddapoosani
🕺💥🥁𝗙𝘂𝗹𝗹 𝗟𝘆𝗿𝗶𝗰𝗮𝗹 𝗩𝗶𝗱𝗲𝗼 𝗖𝗼𝗺𝗶𝗻𝗴 𝘀𝗼𝗼𝗻 pic.twitter.com/dhgbKKL3M1
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) January 16, 2026
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

