Samantha: 500 మంది మగాళ్లతో హాట్ సీన్ చేసిన సమంత?
Samantha ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్‌మెంట్

Samantha: వామ్మో.. 500 మంది మగాళ్ల ముందు హాట్ సీన్ లో రెచ్చిపోయిన సమంత..?

Samantha: టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా సమంత గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాలలో నటించి తనదైన గుర్తింపు సంపాదించారు. చైతూతో సామ్ విడాకులు తీసుకున్న రోజు నుంచి ఎన్నో రూమర్స్ వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ కూడా తగ్గలేదు. విడాకుల అనంతరం కొంత వెనుకంజ వేసినప్పటికీ, సినిమాల్లో తన ప్రస్థానం కొనసాగించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత తన సినీ ప్రయాణంలోని కొన్ని అనుభవాలను పంచుకున్నారు.

Also Read: Bigg Boss Telugu 9: ఈ రోజే బిగ్‌ బాస్ 9 గ్రాండ్ లాంఛ్.. ఫైనల్ లిస్ట్ అదేనా లేక అంతా తూచ్ అంటారా?

సమంత హీరోయిన్ గానే కాకుండా.. ఐటం సాంగ్స్ లో కూడా నటించింది. అలా ‘పుష్ప: ది రైజ్’ చిత్రంలో సమంత తొలిసారి ‘ఊ అంటావా మావ’ పాటలో నటించి, తన గ్లామరస్ లుక్స్, డ్యాన్స్ తో అభిమానులను ఆకట్టుకుంది. ఈ పాట సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ పాట గురించి సమంత మాట్లాడుతూ, “ఈ పాట చేయాలని నిర్ణయించినప్పుడు చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. కొందరు మాత్రం సమర్థించారు. కానీ, పాట నాకు చాలా నచ్చి చేశాను. ఇంతకు ముందు ఇలాంటి అవకాశం నాకు రాలేదు, కాబట్టి ఈ సాహసం చేయాలనిపించింది” అని చెప్పుకొచ్చింది.

Also Read: Karthik Gattamneni: తొమ్మిది గ్రంథాలు దుష్టుల బారిన పడితే.. ‘మిరాయ్‌’ మన రూటెడ్ యాక్షన్ అడ్వెంచర్

ఇక ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌లో రాజీ పాత్ర గురించి మాట్లాడుతూ, సమంత తన బాధను వెల్లడించింది. “ఈ సినిమాలో పాత్ర చేయగలనా అనే సందేహం మొదటి నుంచి ఉండేది. షూటింగ్‌కు ముందు రోజు వరకూ చాలా టెన్షన్‌ పడ్డా.. సరిగ్గా పడుకున్నది లేదు.. సరిగ్గా తిన్నది కూడా లేదు. ఇక సెట్‌లో కి అడుగు పెట్టాక 500 మంది మగాళ్ల ముందు నేను మధ్యలో నిలబడినప్పుడు భయపడ్డాను. ‘యాక్షన్’ అనగానే ఒళ్లు గగుర్పొడిచింది. వారి ముందు రొమాంటిక్ సీన్స్ చేయాలంటే కొంచం కష్టంగానే అనిపించింది. ఏం చేద్దాం.. కొన్ని సార్లు రెచ్చిపోయి మరి అలాంటి సీన్స్ చేయాలి తప్పదు. కానీ, ఇలాంటి సవాల్‌తో కూడిన పాత్రలు చేయడం నాకు సంతృప్తినిస్తుంది” అని ఆమె తెలిపింది. ఇప్పుడు సామ్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: Ganesh Immersion 2025: పాతబస్తీ గణనాధులపై స్పెషల్ ఫోకస్.. మంత్రి పొన్నం, డీజీపీ, మేయర్ విజయలక్ష్మి ఏరియల్ సర్వే

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?