Samantha and Raj Nidimoru: సిటాడెల్, ఫ్యామిలీ మెన్ వంటి సిరీస్‌లకు డైరక్షన్ చేసిన రాజ్ నిడిమోరుతో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొంత కాలం నుంచు క్లోజ్ గా ఉంటూ .. ఇద్దరూ ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అంతే కాదు, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని కొంతకాలంగా జోరుగా వార్తలు వస్తున్నాయి.
Also Read: R.Madhavan: సల్మాన్, మాధవన్ ని రిజెక్ట్ చేసి.. ఆ బిలీనియర్ ని పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్?
వీరిద్దరూ తరచూ కలిసి కనిపించడం, వెకేషన్‌లకు జంటగా వెళ్లడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. అయినప్పటికీ, సమంత, రాజ్ లలో ఇద్దరూ ఈ విషయంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే, తాజాగా ఈ జంట మరోసారి కెమెరా కంటికి చిక్కింది. ఒకే కారులో కలిసి ప్రయాణిస్తూ కనిపించారు, దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ కలిసి రెస్టారెంట్‌కు డిన్నర్‌కు వెళ్లినట్లు సమాచారం. ఈ తాజా సంఘటనతో డేటింగ్ రూమర్స్ మళ్లీ హాట్ టాపిక్‌గా మారాయి.
Also Read: Priya Sachdev: 30,000 కోట్ల ఆస్తి వివాదం.. ఇన్‌స్టాగ్రామ్ పేరు, బయోను మార్చిన సంజయ్ కపూర్ భార్య
రాజ్, డీకే కలిసి నిర్మించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2’, ‘సిటడెల్: హనీ బన్నీ’ సిరీస్‌లలో సమంత కీలక పాత్రలు పోషించింది. ఈ ప్రాజెక్టుల సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం బలపడినట్లు తెలుస్తోంది. సమంత రూత్ ప్రభు, డైరెక్టర్ రాజ్ నిడిమోరులు తమ మధ్య సంబంధం గురించిన పుకార్లను పలుమార్లు ఖండించినప్పటికీ, ఈ రూమర్స్ మాత్రం ఆగలేదు. ఈ క్రమంలోనే రాజ్ నిడిమోరు భార్య గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో నమ్మకం, ప్రేమ, సంబంధాల గురించి పోస్టులు పెట్టడంతో అనేక అనుమానాలను వస్తున్నాయి. అయితే, ఈ ఏడాది చివరిలో సమంత, రాజ్ ల బంధాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారని పుకార్లు వస్తున్నాయి. మరి, దీనిలో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది.
Also Read: Anasuya: తల్లి అయినంత మాత్రాన మన నిజమైన వ్యక్తిత్వాన్ని వదులుకోవాలా?.. అనసూయ పోస్ట్ వైరల్!