Chai Waala
ఎంటర్‌టైన్మెంట్

Chai Waala: ‘చాయ్ వాలా’ ‘సఖిరే..’ని చూశారా.. మెలోడీ అదిరింది

Chai Waala: చేసింది తక్కువ సినిమాలే అయినా, నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో శివ కందుకూరి (Shiva Kandukuri). ఇప్పుడాయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘చాయ్ వాలా’ (Chai Waala). హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్‌‌పై రాధా విజయలక్ష్మి, వెంకట్ ఆర్. పాపుడిప్పు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ప్రమోద్ హర్ష (Pramod Harsha) రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్‌.. మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా, సినిమాపై మంచి అంచనాలను కూడా పెంచేశాయి. ఈ క్ర‌మంలో మేక‌ర్స్ గురువారం (సెప్టెంబర్ 11) చిత్రం నుంచి తొలి పాట‌ను విడుద‌ల చేశారు. ‘సఖిరే..’ అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్ హృద‌యాల‌ను హ‌త్తుకునేలా ఉంది. ప్రస్తుతం ఈ సాంగ్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

Also Read- OG Movie: రికార్డ్స్ రాకుండా చేస్తున్నారంటూ.. ‘ఓజీ’ అమెరికా డిస్ట్రిబ్యూటర్లపై ఫ్యాన్స్ ఆగ్రహం!

ప్రేమికుల కోసం..

ఈ సాంగ్ వివరాల్లోకి వెళితే.. ‘సఖిరే..’ అంటూ సాగిన ఈ పాటను క్యాచీ ట్యూన్‌తో మ్యూజిక్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ ఆర్‌. విహారి (Prashanth R. Vihari) కంపోజ్ చేశారు. సురేష్ బ‌నిశెట్టి సాహిత్యం అందించిన ఈ పాటను క‌పిల్ క‌పిల‌న్ పాడారు. తన ప్రియురాలిపై గుండెల‌నిండా స్వ‌చ్చ‌మైన‌ ప్రేమ‌ను నింపుకున్న హీరో త‌న భావాల‌ను అందంగా ఈ పాట రూపంలో వ్య‌క్తం చేస్తున్నట్లుగా, ముఖ్యంగా లవర్స్ ఎంతగానో ఇష్టపడేలా పాట ఉంది. ప్రేమికులందరూ హమ్మింగ్ చేసుకునేలా ఈ పాట ఉండటంతో.. సోషల్ మీడియాలో అందరూ ఈ సాంగ్‌ను పోస్ట్ చేస్తూ.. చాలా గ్యాప్ తర్వాత మంచి మెలోడీ అంటూ కామెంట్స్ చేస్తుండటం విశేషం. అలాగే ఈ పాటలో హీరో శివ కందుకూరి స్ట‌న్నింగ్ లుక్స్‌ ఆకట్టుకుంటుంటే.. హీరోయిన్ తేజు అశ్విని గ్లామర్ అసలు చూపులు తిప్పుకోనీయ‌టం లేదంటే నమ్మాలి. అంత చక్కగా ఈ పాటను పిక్చరైజ్ చేశారు.

Also Read- Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1’.. ఆ రాష్ట్రంలో విడుదల కావడం లేదా? అసలేం జరిగిందంటే?

మంచి సినిమా ఇవ్వబోతున్నాం

ఈ మెలోడీలో రొమాంటిక్ మూమెంట్స్ విజువ‌ల్ ట్రీట్‌లా ఉన్నాయి. ఒక్క ప్రేమికులే కాదు.. అందరూ ఈ పాట‌ పాడుకునేలా ఉంది. క‌పిల్ క‌పిల‌న్ గొంతులో ఈ పాట మ‌రింత మాధుర్యంగా అనిపిస్తోంది. ప్రేమించేవాళ్ల‌కు, మ్యూజిక్ ల‌వ‌ర్స్‌కు ఈ పాట బాగా క‌నెక్ట్ అవుతుందనడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. పాట విడుదల సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు మా సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్‌ను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ఇప్పుడు వచ్చిన సాంగ్ కూడా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం. దర్శకుడు ప్రమోద్ హర్ష ఈ సినిమాను రూపొందిస్తున్న తీరుతో మేమంతా హ్యాపీగా ఉన్నాం. మా సంస్థ నుంచి ఓ మంచి సినిమా ప్రేక్షకులకు ఇవ్వబోతున్నామనే ఫీల్‌లో ఉన్నాం. మరిన్ని విషయాలు త్వరలోనే తెలియజేస్తామని అన్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Crime News: జల్సాలకు అలవాటు పడి.. బైకు దొంగతనాలు చేస్తున్న ముఠా అరెస్ట్‌!

DGP Sivadhar Reddy: చేవెళ్ల బస్సు ప్రమాదం.. ఘటనాస్థలిని పరిశీలించిన డీజీపీ.. కీలక విషయాలు వెల్లడి

Chhattisgarh Train Accident: ఢీకొన్న ప్యాసింజర్ రైలు – గూడ్స్ ట్రైన్.. ఛత్తీస్‌గఢ్‌లో ఘోరం.. భారీగా మృతులు

Weather Update: రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. అప్రమత్తమైన అధికారులు

Hyderabad Rail Alert: హైదరాబాదీలూ బీ అలర్ట్.. రాగల 2 గంటల్లో అకస్మాత్తుగా వర్షాలు