OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్‌లో రికార్డులు రాకుండా మధ్య వర్తులు అడ్డుపడుతున్నారా? అంటే అవుననే అంటున్నారు ఆయన అభిమానులు. ముఖ్యంగా అక్కడ సినిమాను విడుదల చేసేందుకు తీసుకుంటున్న డిస్ట్రిబ్యూటర్లు సరైన ప్లానింగ్‌తో చేయడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఇంతకు ముందు వచ్చిన ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu)కు ఇలాగే చేశారు. ఇప్పుడు రాబోతున్న ‘ఓజీ’ సినిమాకు కూడా అలానే చేస్తున్నారు.. మరి ఎందుకిలా చేస్తున్నారు? అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. అలాగే ఓజీ ఓవర్సీస్ అడ్వాన్స్ సేల్స్ గురించి ప్రస్తావిస్తూ.. మొదలైన ఆరు రోజుల్లేనే 1 మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరితే, ఆ తర్వాత 6 రోజులకు (250కే డాలర్స్) కలిపి కూడా 1.25 మిలియన్ డాలర్స్ దగ్గరే ఆగిపోవడం ఏంటి? విడుదల దగ్గరపడే కొద్ది ఇంకా పెరగాలి కదా? అని వారు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లైన ప్రత్యంగిరా సినిమాస్‌ను ప్రశ్నిస్తున్నారు.
Also Read- Daggubati Brothers: విచారణకు హాజరుకాని దగ్గుబాటి బ్రదర్స్.. కోర్టు సీరియస్
‘ఏఎంసీ థియేటర్స్’ ఓపెన్ కాలేదు
ఇదే విషయంలో సోషల్ మీడియాలో పెద్ద రచ్చ కూడా జరుగుతుంది. యాంటీ ఫ్యాన్స్ ఇది మీ వాడి సత్తా అంటూ తర్వాతి 6 రోజుల సేల్స్‌ని చూపిస్తుండటంతో, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలో ‘ఓజీ’ సినిమాను ఓవర్సీస్‌లో రిలీజ్ చేస్తున్న ప్రత్యంగిరా సినిమాస్ ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చింది. వాస్తవానికి ఎప్పుడూ లేని విధంగా అడ్వాన్స్ సేల్స్ మొదలైన ఆరు రోజుల్లోనే 1 మిలియన్ సాధించిన చిత్రంగా ‘ఓజీ’ రికార్డును క్రియేట్ చేసింది. మరి అందులో ప్రత్యంగిరా సినిమాస్ (Prathyangira Cinemas) పాత్ర లేదని ఎలా చెప్పగలరు. ఆ తర్వాత ఎందుకు తగ్గాయో కూడా వారు తాజాగా వివరణ ఇచ్చారు. ఓవర్సీస్‌లో కూడా కొన్ని మల్టీప్లెక్స్ ప్రాంచైజీలు ఉన్నాయి. ఇండియాలో పివిఆర్ ఐనాక్స్, ఏషియన్ సినిమాస్ ఎలా ఉన్నాయో.. అమెరికాలో ‘ఏఎంసీ థియేటర్స్’ (ఐమ్యాక్స్, డీ బాక్స్, 4డీఎక్స్, డాల్బీ సినిమా) మల్టీప్లెక్స్ ఫ్రాంచైజీ ఉందట. అందులో ఇంత వరకు ఒక్క టికెట్ కూడా ‘ఓజీ’కి బుక్ కాలేదట. ఇదే విషయాన్ని సదరు డిస్ట్రిబ్యూటర్లు తెలియజేశారు.
Also Read- Allu Arjun- Atlee: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన అట్లీ
రిలీజ్ నాటికి 3కె ప్లస్ షోస్
హాలీవుడ్ సినిమా టైటిల్స్‌తో వచ్చే ఇండియన్ సినిమాలను డాల్బీ ఫార్మెట్‌లో ప్రదర్శించడానికి ‘ఏఎంసీ’ ఫ్రాంచైజ్ అంగీకరించకుండా కొన్ని ఒప్పందాలు చేసుకుందట. కంటెంట్ డెలివరీ అయిన తర్వాతే.. వారు బుకింగ్ ఓపెన్ చేస్తారు. ‘ఓజీ’ సినిమాకు సంబంధించి నిర్మాణ సంస్థ, దర్శకుడు సకాలంలో డెలివరీ చేస్తామని ప్రకటించినా కూడా ఏఎంసీ కన్విన్స్ కాలేదని, ఒక్కసారి కంటెంట్ డెలివరీ అయితే అవన్నీ ఓపెన్ అవుతాయని చెబుతున్నారు. ఇప్పటి వరకు కేవలం పిఎల్ఎఫ్ అండ్ స్టాండర్డ్ షోస్ మాత్రమే బుక్ అయ్యాయని వారు క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు, ‘ఓజీ’ సినిమా మాకు కూడా ఎంతో ప్రత్యేకమైనదని, ఈ సినిమాకు మ్యాగ్జిమమ్ ఎఫెర్ట్ పెడతామని, కావాలంటే మా ట్రాక్ రికార్డ్ చూసుకోమని వారు అంటున్నారు. రిలీజ్ నాటికి 3కె ప్లస్ షోస్ పెట్టడానికి మ్యాగ్జిమమ్ ఎఫర్ట్ పెడతామని వారు మాటిచ్చారు. అది మేము చేయలేకపోతే.. ఇంకెవరు చేయలేరని వారు చెబుతున్నది విన్న తర్వాత ఫ్యాన్స్‌లో కూడా కాన్ఫిడెంట్ పెరుగుతోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు