Felicitation to Dialogue King Sai Kumar
ఎంటర్‌టైన్మెంట్

Sai Kumar: ‘అభినయ వాచస్పతి’ బిరుదుతో డైలాగ్ కింగ్‌కు సన్మానం.. ఎక్కడంటే?

Sai Kumar: నటుడిగా కెరీర్ ప్రారంభించి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న డైలాగ్ కింగ్ సాయి కుమార్.. ఇప్పటికీ బిజీ నటుడిగానే కొనసాగుతున్నారు. ఆయన కోసం ప్రత్యేకంగా పాత్రలు రాస్తూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా బ్లాక్‌బస్టర్ మెషీన్ అనిల్ రావిపూడి తన సినిమాలలో కచ్చితంగా ఓ పాత్రని సాయి కుమార్ కోసం రాసుకుంటూ ఉంటారు. ఒక్క అనిల్ రావిపూడి అనే కాదు, సాయి కుమార్ కోసం ప్రతి సినిమాలో ఒక పాత్ర క్రియేట్ చేయగలిగేంత గొప్ప నటుడు సాయి కుమార్. ‘పోలీస్ స్టోరీ’ సినిమాతో తిరుగులేని స్టార్‌డమ్ సొంతం చేసుకున్న సాయి కుమార్.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి మంచి పాత్రలు చేస్తూ.. ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నారు.

Also Read- Amardeep: అమర్‌ దీప్ మాములోడు కాదు.. ఏకంగా ఆ టైటిల్‌తోనే సినిమా!

ఇక ఈ డైలాగ్ కింగ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. పూణెలోని ఆంధ్ర సంఘం ఆయనని ఘనంగా సన్మానించింది. అంతే కాదు, సాయి కుమార్‌కు ‘అభినయ వాచస్పతి’ అనే అవార్డును కూడా బహూకరించారు. 1941లో పూణెలో పెట్టిన ఈ ఆంధ్ర సంఘం ప్రాముఖ్యత ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి సంస్థ డైలాగ్ కింగ్ సాయి కుమార్‌ను ఉగాది సందర్భంగా సత్కరించి, ఆయన సినిమా ఇండస్ట్రీకి చేసిన సేవలను కొనియాడింది. 50 ఏళ్లుగా కళామతల్లికి సేవలు అందిస్తున్న సాయి కుమార్‌కు, ఆయన సతీమణి సురేఖను ఈ కార్యక్రమంలో ఘనంగా సత్కరించారు. ఈ సత్కారానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఆనందంగా ఉంది
పూణె ఆంధ్ర సంఘం వంటి సంస్థ తనను ఇలా గుర్తించి, సత్కరించడం ఎంతో ఆనందంగా ఉందని, ఈ క్షణాలను ఎప్పటికీ మరిచిపోలేనని సత్కారం అనంతరం సాయి కుమార్ ఉద్వేగానికి లోనయ్యారు. ఈ క్రెడిట్ మొత్తం తన అభిమానులు, కుటుంబ సభ్యులదే అని ఆయన చెప్పుకొచ్చారు. కళామతల్లి ఆశీర్వాదం ఉన్నంతకాలం నటుడిగా కొనసాగుతూనే ఉంటానని, ఆదరిస్తున్న ప్రేక్షకులకు, ఇలాంటి సత్కారాలతో బాధ్యతను తెలియజేస్తున్న వారందరికీ ధన్యవాదాలని తెలిపారు. సాయి కుమార్ మంచి వక్త. ఆయన కంఠానికి ఉన్న శక్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అందుకే ఆయనని డైలాగ్ కింగ్ అని పిలుస్తుంటారు.

Also Read- Akkada Ammayi Ikkada Abbayi Trailer: 60 మందికి ఒకే అమ్మాయి.. సమ్మర్‌కి హిలేరియస్ ఎంటర్‌టైనర్!

తీరికలేని నటుడు
సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి యాభై ఏళ్లు పూర్తయిన అనంతరం కొందరు విశ్రాంతి కోరుకుంటారు. కానీ సాయి కుమార్ రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తున్నారు. ఏదో పేరుకి చేస్తున్నాం అంటే చేస్తున్నామని కాకుండా.. వరుసగా సక్సెస్ ఫుల్ ప్రాజెక్టులతో ఆయన దూసుకుపోతుండటం విశేషం. ‘కమిటీ కుర్రోళ్లు, సరిపోదా శనివారం, లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం, కోర్ట్’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి మెప్పించిన సాయికుమార్.. ప్రస్తుతం కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో పలు ప్రాజెక్టులు చేస్తూ బిజీగా ఉన్నారు. సాయి దుర్గ తేజ్ ‘సంబరాల ఏటి గట్టు’, అల్లరి నరేష్ ‘12A రైల్వే కాలనీ’, నాగ శౌర్య ‘బ్యాడ్ బాయ్ కార్తిక్’ వంటి క్రేజీ సినిమాల్లో నటిస్తున్నారు. మరో వెబ్ సిరీస్‌లతోనూ ఆయన తన సత్తా చాటుతున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!