Akkada Ammayi Ikkada Abbayi Trailer: టీవీ యాంకర్ టర్న్‌డ్ హీరో ప్రదీప్ మాచిరాజు హీరోగా నటిస్తున్న చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. దీపికా పిల్లి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ఈ వేసవికి అందరినీ కూల్ చేసేందుకు ఏప్రిల్ 11న థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ యూనిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్స్ డుయో నితిన్, భరత్ డైరెక్ట్ చేస్తున్నారు. మాంక్స్ అండ్ మంకీస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ ఎగ్జైటింగ్ ఎంటర్‌టైనర్‌కు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన టీజర్, పాటలు మంచి స్పందనను రాబట్టుకోగా, తాజాగా మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ను గమనిస్తే..
Also Read- Mega157: బ్లాక్ బస్టర్ మెషీన్ డ్యూటీ ఎక్కేశాడు.. రాబోయే సంక్రాంతికి రఫ్ఫాడించుడే!
‘‘భజ గోవిందం భజగోవిందం అంటూ శ్లోకంతో మొదలైన ఈ ట్రైలర్‌లో హలో ఇది నేనే, చిన్నప్పటి నుండి నేనెన్నో విజయాలు సాధించాను.. అంటూ ప్రదీప్ మాచిరాజు తనని తాను పరిచయం చేసుకున్నారు. చిన్నప్పటి నుంచి దెబ్బలు తింటున్నట్లుగా చూపిస్తూ.. వద్దులే వీటిని ఇంతటితో మర్చిపోదాం అంటూ విషయంలోకి తీసుకెళ్లాడు. ఒక ప్రాజెక్టు పని మీద నేనొక మెట్రో పాలిటన్ సిటీకి వచ్చాను. అరే.. ఏం చేశారురా అంటే.. పక్కనే ఉన్న వ్యక్తి మీరు చెప్పిందే చేసాము సామి అంటాడు. నేనేం చెప్పానురా అని పక్కకి తిరిగి చూస్తాడు. ఫ్లాష్ బ్యాక్ సీన్లో గెటప్ శ్రీను మేము ఉంది 60 మంది. మాకు కూడా పని రాదు. నువ్వే పని నేర్పి వాడుకుంటే వాడుకో అని చెప్తాడు.
మనదేశంలో ఇంజరింగ్ చదివిన వాడు ఒక్క డాక్టర్ పని తప్ప ఏ పనైనా చేయగలడు.. అనే డైలాగ్ అనంతరం.. ఆ ఊర్లో వాళ్ళు నన్నెంత గౌరవంగా చూసుకున్నారంటే అని అనగానే.. ఊరి జనం అంతా అరుపులతో చేతులలో కత్తులతో కనిపిస్తారు. కట్ చేస్తే ప్రదీప్ మాచిరాజు అతని ఫ్రెండ్ చెట్టుకి వేలాడుతూ ఉంటారు. నా దరిద్రానికి ఆ ఊరి మొత్తానికి ఒకే ఒక అమ్మాయి ఉంది అని ప్రదీప్ అనగానే.. హీరోయిన్ ఎంట్రీ. బ్యాగ్రౌండ్లో సాంగ్. ఎట్టి పరిస్థితుల్లో రాజా (హీరోయిన్) ఈ 60 మందిలో ఒకర్ని పెళ్లి చేసుకోవాలి అని పంచాయితీలో చెప్పగానే ప్రదీప్ షాక్ అవుతాడు. బ్రహ్మాజీ ఎంట్రీ. నా కథలోని పాత్రలు, సన్నివేశాలు నా కలలో కూడా నన్ను వెంటాడుతుంటాయి.. అనగానే పెద్ద సౌండ్ కట్ చేస్తే పెద్ద యాక్సిడెంట్. ప్రదీప్, సత్యతో ఏంటి ఇదంతా.. కొంపదీసి మనం చచ్చిపోయి స్వర్గానికి వచ్చామా ఏంటి? అంటాడు. అందుకు సత్య.. ఊరుకోండి సర్ మీరు చేసిన దానికి స్వర్గం గేట్ కాదు కదా.. కిటికీ కూడా తీయరు అనే డైలాగ్‌తో ట్రైలర్ ముగిసింది.
Also Read- Arjun Son of Vyjayanthi: ‘నాయాల్ది’.. నాయుడేమన్నాడే.. వగలాడీ నీ నడకల్లో!
ఓవరాల్‌గా అయితే.. ఈ కథ ఒక మారుమూల గ్రామంలో ఒక ప్రాజెక్ట్‌ను సూపర్ వైజ్ చేయడానికి నియమించబడిన సివిల్ ఇంజనీర్ చుట్టూ తిరుగుతుందనేది తెలుస్తుంది. అక్కడ 60 మంది అనుభవం లేని కార్మికులతో పని చేయించాలి. ఆ గ్రామంలో ఒకే ఒక అమ్మాయి ఉంది, ఆమె తండ్రి ఈ 60 మందిలో ఒకరిని పెళ్లి చేసుకోవాలని అనౌన్స్ చేస్తాడు. ఈ క్రమంలో ఇంజనీర్ ప్రదీప్, అమ్మాయి దీపిక ఇద్దరూ ప్రేమలో పడతారు. తర్వాత జరిగే పరిస్థితులు ఏంటనేది చాలా ఎక్జయిటింగ్‌గా టర్న్ అవుతూ.. సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. నితిన్-భరత్ ద్వయం హ్యుమర్‌తో కూడిన కథాంశాన్ని ఎంచుకోగా, డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ప్రదీప్ మాచిరాజు, దీపిక తమ పాత్రలకు పర్ఫెక్ట్‌గా సెట్టయ్యారు. ఇతర పాత్రలతో పాటు, రథన్ సంగీతం, ఇతర సాంకేతిక నిపుణుల పనితీరు సినిమాను చూడాలనే ఇంట్రస్ట్‌ని కలిగిస్తున్నాయి. రొమాన్స్, విలేజ్ డ్రామాతో కూడిన వినోదాత్మకంగా ఈ సినిమా ఉంటుందని తెలియజేయడంలో ఈ ట్రైలర్ నూటికి నూరు శాతం సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు