Arjun Son of Vyjayanthi: నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) హీరోగా, రాములమ్మ విజయశాంతి (Vijayashanthi) ఆయన మదర్‌గా నటిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా చిత్రం ‘అర్జున్ S/O వైజయంతి’. ఈ వేసవి సీజన్‌లో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోన్న ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలను మేకర్స్ యమా దూకుడుగా నిర్వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ భారీ అంచనాలను నెలకొల్పింది. ఈ మధ్యకాలంలో ఏ సినిమాకు లేని విధంగా ఒక్క టీజర్ విడుదల తర్వాత.. సినిమా థియేటర్, నాన్ థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ అవడం విశేషం. అలాగే కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే హైయస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన సినిమాగా ఈ సినిమా రికార్డు క్రియేట్ చేయడంతో చిత్రబృందం అంతా హ్యాపీగా ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ సింగిల్‌ని విడుదల చేసి, మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్‌ని మొదలుపెట్టారు.
Also Read- Aditya 369 Sequel Update: బాలయ్య ఫ్యాన్స్ ఎగిరిగంతేసే న్యూస్.. ఆదిత్య 369 సీక్వెల్ పై క్రేజీ ఆప్డేట్
‘అర్జున్ S/O వైజయంతి’ ఫస్ట్ సింగిల్ ‘నాయాల్ది’ని మేకర్స్ నరసరావుపేటలోని రవి కళామందిర్‌లో ఫ్యాన్స్ సమక్షంలో గ్రాండ్‌గా విడుదల చేశారు. ఈ సందర్భంగా అభిమానులు భారీ ర్యాలీని నిర్వహించారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా సునీల్ బలుసు నిర్మించిన ఈ సినిమాలో విజయశాంతి IPS అధికారిగా నటిస్తుండగా, ఆమె కుమారుడిగా కళ్యాణ్ రామ్ కనిపించనున్నారు. ఇక తాజాగా విడుదలైన ఫస్ట్ సాంగ్ విషయానికి వస్తే..
‘‘నాయుడేమన్నాడే.. నీ నిగనిగలాడే నగలే…
అరె.. ధగ ధగమంటూ మెరిసే.. మతి పోగొడతావుందే..
నాయుడేమన్నాడే.. వగలాడీ నీ నడకల్లో..
వయ్యారాలన్నీ కలిసి.. వల విసిరేస్తావుంటే..
చుక్కల చీర చుట్టేసి.. గజ్జెల పట్టీలు కట్టేసి
చెంగుమని నీవట్టా నడిసొస్తుంటే..’’ అంటూ సాగిన ఈ పాటను అజనీష్ లోక్‌నాథ్ స్వరపరిచారు. రఘురామ్ సాహిత్యం అందించిన ఈ పాటను నకాష్ అజీజ్, సోనీ కొమండూరి తమ ఎనర్జిటిక్ వోకల్స్‌తో ప్రాణం పోశారు. ఈ పాటలో కళ్యాణ్ రామ్, సాయి మంజ్రేకర్ (Saiee Manjrekar) మధ్య సిజలింగ్ కెమిస్ట్రీ వావ్ అనేలా ఉంది. సాఫ్ట్ అండ్ మెలోడీగా మొదలైన ఈ పాట.. అదిరిపోయే డ్యాన్స్ నెంబర్‌గా ప్రేక్షకులను ఆకర్షిస్తోంది.
ఇక ఈ సాంగ్ లాంచ్ కార్యక్రమంలో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. పల్నాడు జిల్లాకు ఈ సాంగ్ లాంచ్ నిమిత్తం రావడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ మొట్టమొదటి ఈవెంట్ చేస్తున్నాం. నేను ‘పటాస్’ సినిమా తర్వాత ఎప్పుడు బయటికి రాలేదు. ‘పటాస్’ సక్సెస్ మీట్‌కి మాత్రమే వచ్చాను. ఈ వేడుక చూస్తుంటే సాంగ్ లాంచ్ ఈవెంట్‌లా లేదు.. ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సక్సెస్ మీట్‌లా ఉంది. ప్రతి సినిమాతో మీ మన్ననలని పొందడానికి ప్రయత్నిస్తుంటాను. ఇటీవల ట్రైలర్ లాంచ్ వేడుకలో చెప్పినట్లు ‘అతనొక్కడే’ లా ఈ సినిమా కూడా మరో 20 ఏళ్లు గుర్తుండిపోయే సినిమా అవుతుంది. ఈ సినిమాలో మా అమ్మ పాత్ర చేసిన విజయశాంతి, ఆ పాత్రని ఒప్పుకోవడం వల్లే ఈ సినిమా చేయడం జరిగింది. ఆమెకు ఈ సందర్భంగా ధన్యవాదాలు. అమ్మలని గౌరవించడం మన బాధ్యత. వాళ్ళ కోసం ఎంత త్యాగం చేసినా తప్పులేదు. ఈ సినిమాని అమ్మలందరికీ అంకితం చేస్తున్నామని అన్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు