Amardeep: అమర్ దీప్ చౌదరి ఈ పేరు తెలుగు ప్రేక్షకులకి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బుల్లితెరపై నటుడిగా ‘జానకి కలగనలేదు’ సీరియల్‌లో నటించి, నటుడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు. అందులో ఇంటికి పెద్ద కొడుకుగా, తల్లి మాటకి ఎదురు చెప్పని కొడుకుగా అందరి మన్నల్ని అందుకున్నాడు. అమర్ దీప్ భార్య తేజస్విని కూడా సీరియల్ నటే. ఆమె కూడా తన నటనతో పేరు తెచ్చుకున్నారు. ఇటీవల బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలో రన్నరప్‌గా నిలిచి, ఇంకో స్టెప్ ముందుకు వేసిన అమర్ దీప్.. ఇప్పుడు నటుడిగా వెండితెరపై తన టాలెంట్ చూపించేందుకు ప్రయత్నిస్తున్నాడు.
Also Read- Akkada Ammayi Ikkada Abbayi Trailer: 60 మందికి ఒకే అమ్మాయి.. సమ్మర్‌కి హిలేరియస్ ఎంటర్‌టైనర్!
ఈ క్రమంలో ఆయన బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత వరుసగా రెండు మూడు సినిమాల ఓపెనింగ్స్ కూడా జరుపుకున్నాయి. బిగ్‌బాస్ హౌస్‌లో తనదైన తరహాలో గేమ్స్ ఆడటంతో పాటు మంచి ఎంటర్‌టైనర్‌గా పేరు పొందాడు. మాస్ మహారాజా రవితేజకి వీరాభిమానిని అంటూ అచ్చు రవితేజలా హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్‌ని మెయింటైన్ చేయడమే కాకుండా ఆయన బాడీ లాంగ్వేజ్‌ని కూడా అనుసరిస్తుంటాడు. ఇప్పుడొక వైపు బుల్లితెరపై అలరిస్తూనే, సిల్వర్ స్క్రీన్ మీద తన సత్తా చాటేందుకు సిద్ధమైన అమర్ దీప్ అకౌంట్‌లో ఇప్పుడు మరో సినిమా చేరింది. తాజాగా ఆయన హీరోగా మరో సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఆ వివరాల్లోకి వెళితే..
‘అలా నిన్ను చేరి’, సన్నీ లియోన్ ‘మందిర’ సినిమాలను నిర్మించిన విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌లో మూడో సినిమాగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘సుమతీ శతకం’. కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పిస్తుండగా, కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో ఎం. ఎం. నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో అమర్ దీప్ చౌదరి హీరోగా నటిస్తుండగా, ఆయన సరసన సైలీ చౌదరి హీరోయిన్‌గా కనిపించనుంది. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్‌గా రూపుదిద్దుకోనున్న ఈ సినిమాను ఉగాదిని పురస్కరించుకుని గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని మేకర్స్ ఈ సందర్భంగా తెలియజేశారు.
Also Read- Mega157: బ్లాక్ బస్టర్ మెషీన్ డ్యూటీ ఎక్కేశాడు.. రాబోయే సంక్రాంతికి రఫ్ఫాడించుడే!
ఈ సినిమాకు బండారు నాయుడు కథను అందిస్తుండగా, సుభాష్ ఆనంద్ సంగీతం సమకూర్చుతున్నారు. కెమెరా మెన్‌గా హలేష్, ఎడిటర్‌గా సురేష్ విన్నకోట వంటివారు ఇతర సాంకేతిక నిపుణులు. ఈ సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా అమర్ దీప్ మాట్లాడుతూ.. ఒక మంచి కథతో, కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇందులో నటనకు చాలా ప్రాధాన్యత ఉంది. బుల్లితెర, బిగ్‌బాస్.. ఇలా ప్రతి చోట నన్ను ఎంతగానో ఆదరించారు. వెండితెరపై కూడా నాకు మీ ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నానని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు